AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bheemla Nayak: సందడి మొదలైంది.. పవన్ బర్త్ ‏డే అదిరిపోయే సర్‏ప్రైజ్ ప్లాన్ చేసిన భీమ్లా నాయక్ టీం.. ట్వీట్ వైరల్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాలో పవర్ స్టార్‏కు భారీగా క్రేజ్ ఉంది.

Bheemla Nayak: సందడి మొదలైంది.. పవన్ బర్త్ ‏డే అదిరిపోయే సర్‏ప్రైజ్ ప్లాన్ చేసిన భీమ్లా నాయక్ టీం.. ట్వీట్ వైరల్..
Bheemla Nayak
Rajitha Chanti
|

Updated on: Aug 31, 2021 | 8:15 AM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాలో పవర్ స్టార్‏కు భారీగా క్రేజ్ ఉంది. పవన్ అభిమానులు నెట్టింట్లో చేసే రచ్చ గురించి తెలిసిన విషయమే. ఇటీవల వకీల్ సాబ్ సినిమాకు ఆయన అభిమానులు చేసిన రచ్చ మాములుగా లేదు. సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు కావడంతో.. ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ రేర్ ఫోటోలను, ఆయన సినిమాలకు సంబంధించిన ఫోటోస్, వీడియోలు షేర్ చేస్తూ.. నెట్టింట్లో పవన్ మేనియా కొనసాగుతుంది. అలాగే పవన్ బర్త్ డే రోజున ఆయన తదుపరి చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం పవన్ వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్నాడు. అందులో భీమ్లానాయక్ ఒకటి. మలయాళ సూపర్ హిట్ అయ్యప్పునుమ్ కోషియమ్ సినిమాకు తెలుగు రీమేక్‏గా భీమ్లా నాయక్ చిత్రాన్ని తెరకెక్కిస్తు్నారు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ నటిస్తుండగా.. రిటైర్డ్ హవల్దార్ రోల్‏లో రానా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీకి నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పవన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఉదయం 11.16 నిమిషాలకు భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. మండుతున్న రైఫిల్స్ ప్రతిధ్వనించడానికి సిద్ధంగా ఉన్నాయి. పవర్ డేని ఒక రిసోడింగ్ పవర్ అంతమ్‏తో జరుపుకుందాం అంటూ ట్వీట్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా టేబుల్ మీద పవన్ గన్ను గురి పెట్టిన ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందిస్తున్నాడు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్.. రానా కు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.

Also Read: Karthikeya 2 movie: హీరోయిన్‏ను డిఫరెంట్‏గా పరిచయం చేసిన నిఖిల్.. కార్తికేయ 2లో నటించేది ఈ ముద్దుగుమ్మనే..

Nani: అభిమానులకు సర్‏ప్రైజ్ ప్లాన్ చేసిన నాని.. మీకు ఏం కావాలో చెప్పండంటున్న టక్ జగదీష్..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!