Nani: అభిమానులకు సర్‏ప్రైజ్ ప్లాన్ చేసిన నాని.. మీకు ఏం కావాలో చెప్పండంటున్న టక్ జగదీష్..

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ టాప్ హీరోలలో న్యాచురల్ స్టార్ నాని ఒకరు. అష్టాచెమ్మా సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమైన నాని.. ఆ తర్వాత

Nani: అభిమానులకు సర్‏ప్రైజ్ ప్లాన్ చేసిన నాని.. మీకు ఏం కావాలో చెప్పండంటున్న టక్ జగదీష్..
Tuck Jagadish
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 31, 2021 | 7:09 AM

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ టాప్ హీరోలలో న్యాచురల్ స్టార్ నాని ఒకరు. అష్టాచెమ్మా సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమైన నాని.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి న్యాచురల్ స్టార్‏గా ఎదిగారు. ప్రస్తుతం నాని చేతినిండా సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికే టక్ జగదీష్ షూటింగ్ పూర్తిచేసుకున్న నాని.. ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే నాని నటించిన టక్ జగదీష్ సినిమాలో ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడంతో.. టక్ జగదీష్ మూవీని థియేటర్లలో కాకుండా.. అమెజాన్ ప్రైమ్‏లో విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించడంతో నాని ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.

థియేటర్లలో చూసిన ఫీల్ ఓటీటీలో రాదంటూ కొందరు కామెంట్స్ చేయగా.. ప్రస్తుతం పరిస్థితులలో నాని తీసుకున్న నిర్ణయం సరైనదే అంటూ మరికొందరు ఈ హీరోకు మద్దతుగా నిలిచారు. ఈ సినిమా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‏లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ట్రైలర్‏ను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో నాని తన అభిమానుల కోసం అదిరిపోయే సర్‎ప్రైజ్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా నాని తన ఇన్‏స్టా స్టోరీలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో నాని మాట్లాడుతూ.. మీరందరూ టక్ జగదీష్ ట్రైలర్ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు. అందుకే మీకోసం చిన్న సర్‏ప్రైజ్.. టక్ జగదీష్ ట్రైలర్‏లో మీరు ఏం ఎక్స్‏పెక్ట్ చేస్తున్నారో ఒక్క వర్డ్‏లో కామెంట్స్ చేయండి అంటూ చెప్పుకొచ్చాడు నాని.. వాటిని చదవడానికి తను వెయిట్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

టక్ జగదీష్ సినిమాలో రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హారిష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాజర్, జగపతి బాబు, నరేష్, రావు రమేష్, రోహిణి కీలకపాత్రలలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.