AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: అమెజాన్ ప్రైమ్‏తో భారీ డీల్ చేసుకున్న శ్రుతిహాసన్.. పెద్ద సాహసమే చేస్తోందిగా..

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో శ్రుతి హాసన్ ఒకరు. ఇటీవలే క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రుతి మళ్లీ తన హవా కొనసాగిస్తోంది.

Shruti Haasan: అమెజాన్ ప్రైమ్‏తో భారీ డీల్ చేసుకున్న శ్రుతిహాసన్.. పెద్ద సాహసమే చేస్తోందిగా..
Shruti
Rajitha Chanti
|

Updated on: Aug 30, 2021 | 7:34 PM

Share

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో శ్రుతి హాసన్ ఒకరు. ఇటీవలే క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రుతి మళ్లీ తన హవా కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దగుమ్మ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమాలో నటిస్తోంది. అటు సినిమాల్లో నటిస్తూనే ఏమాత్రం సమయం దొరికిన సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది శ్రుతి హాసన్. తాజాగా ఈ అమ్మడు మరో సాహసం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన పిట్ట కథలు వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ప్లాట్‏ఫాంలోకి ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకుంది శ్రుతి హాసన్. ఈ సిరీస్ తర్వాత మళ్లీ డిజిటల్ ఫ్లాట్‏ఫాంపై శ్రుతి కనిపించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా శ్రుతి హాసన్ ఓ హిందీ వెబ్ సిరీస్ చేయబోతున్నట్లుగా తెలెుస్తోంది. ఇందుకోసం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ తో భారీ ఢీల్ కుదుర్చుకుందట. అయితే ఇప్పటి వరకు ఇందుకు సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇటీవల ఓ ఇంటర్య్యులో పాల్గొ్న్న శ్రుతి హాసన్.. ఆమెజాన్ సంస్థతో కుదుర్చున్న ఒప్పందం గురించి చెప్పుకొచ్చింది.

గత కొద్ది కాలం సినిమాలకు దూరంగా ఉన్న శ్రుతి… ఇటీవల క్రాక్ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చింది. ఈ మూవీతో శ్రుతి కెరీర్ మళ్లీ దూసుకుపోతున్నట్లుగా తెలుస్తోంది. అటు పాన్ ఇండియా లెవల్లో చిత్రాలలో అవకాశాలను అందుకోవడమే కాకుండా.. వెబ్ సిరీస్ ఆఫర్లను కూడా అందుకుంటూ బిజీ అవుతుంది. ఇక ఇటీవల ప్రేమ, పెళ్లి గురించి శ్రుతి హాసన్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. శంతను హజారికతో ఉన్న రిలేషన్ పై శ్రుతి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరి అభిరుచులు ఒకటే. కళలు, సంగీతం పట్ల అవగాహన ఉంది. అందుకే అతనితో ఎక్కువ సమయం గడిపడానికి ఇష్టపడతాను. అన్ని అంశాల్లోనూ అతను నాక్ పర్‏ఫెక్ట్ మ్యాచ్ అంటూ చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్.

Also Read: Jacqueline Fernandez: బాలీవుడ్ సెలబ్రెటీలకు బిగుస్తున్న మనీలాండరింగ్ కేసు.. స్టార్ హీరోయిన్‏కు చెమటలు పట్టించిన ఈడీ..

Bangarraju Movie: బంగార్రాజు సరసన మరో ముగ్గురు హీరోయిన్స్.. రంభ, ఊర్వసి, మేనకలు ఎవరంటే…