AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Sethupathi: సెప్టెంబర్ మొత్తం విజయ్ సేతుపతి హావా.. ఫ్యాన్స్‏కు ఇక పండగే..

తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉప్పెన సినిమాతో తెలుగులో విజయ్

Vijay Sethupathi: సెప్టెంబర్ మొత్తం విజయ్ సేతుపతి హావా.. ఫ్యాన్స్‏కు ఇక పండగే..
Vijay Sethupathi
Rajitha Chanti
|

Updated on: Aug 30, 2021 | 3:25 PM

Share

తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉప్పెన సినిమాతో తెలుగులో విజయ్ సేతుపతికి ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ హీరో చేతినిండా సినిమాలతో బిజీగా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి పేరు చిత్రపరిశ్రమలో సంచలనంగా మారింది. అందుకు కారణం ఈ స్టార్ హీరో నటించిన నాలుగు సినిమాలో ఒకే నెలలో విడుదల కావడమే. విజయ్ సేతుపతి నటించిన నాలుగు సినిమాలు సెప్టెంబర్ నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్నారు. ఈ నాలుగు సినిమాలు కూడా ఓటీటీల్లోనే విడుదల కావడం విశేషం.

ప్రస్తుతం విజయ్ సేతుపతి తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ నటించిన లాభం సినిమా ఇప్పటికే థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా పరిస్థితుల కారణంగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఈ మూవీ సెప్టెంబర్ 9న నెట్ ఫ్లిక్స్‏లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే మక్కల్ సెల్వన్ నటించిన మరో మూడు చిత్రాలు దర్బార్, అనాబెలె సేతుపతి, కడై శివవాసాయి కూడా ఓటీటీలనే విడుదల కాబోతున్నారు. విజయ్ నటించిన తుగ్లక్ దర్బార్ సెప్టెంబర్ 11న ఓటీటీలోనే స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే అనాబెలె సేతుపతి సినిమా డిస్నీ హాట్ స్టార్‏లో సెప్టెంబర్ 17న విడుదల కానుంది. ఇక కడై శివవాసాయి సినిమా సెప్టెంబర్ 24న సోనీ లివ్‏లో విడుదల కాబోతుంది. ప్రస్తుత పరిస్థితులలో ఒకే నెలలో నాలుగు సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్న హీరో కేవలం విజయ్ సేతుపతి మాత్రమే. ఈ ఫీట్ మక్కల్ సెల్వన్‏కు మాత్రమే దక్కింది.

Also Read: Maestro Sneak Peak: కృష్ణాష్టమి రోజున మాస్ట్రో సర్‏ప్రైజ్.. అంధుడిగా ఆకట్టుకుంటున్న నితిన్..

Shruti Haasan: . ప్రేమ, పెళ్లిపై శ్రుతి హాసన్‏కు పిచ్చ క్లారిటీ.. అప్పుడే చెబుతానంటోన్న బ్యూటీ..

Samantha Akkineni : నా రూటే సపరేటు అంటున్న అక్కినేని కోడలు పిల్ల.. ఫ్యాన్స్ ను కన్ఫ్యూజన్ లో పడేసిన సమంత