AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maestro Sneak Peak: కృష్ణాష్టమి రోజున మాస్ట్రో సర్‏ప్రైజ్.. అంధుడిగా ఆకట్టుకుంటున్న నితిన్..

టాలెంటెడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న చిత్రం మాస్ట్రో. ఇందులో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్‏గా నటిస్తుండగా..

Maestro Sneak Peak: కృష్ణాష్టమి రోజున మాస్ట్రో సర్‏ప్రైజ్.. అంధుడిగా ఆకట్టుకుంటున్న నితిన్..
Nithiin
Rajitha Chanti
|

Updated on: Aug 30, 2021 | 3:04 PM

Share

టాలెంటెడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న చిత్రం మాస్ట్రో. ఇందులో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. మిల్కిబ్యూటీ తమన్నా కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే షూటింగ్ చేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 17న ప్రముఖ ఓటీటీ సంస్థ డీస్నీ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్‏కు విశేషస్పందన లభించింది. అయితే కృష్ణాష్టమి సందర్భంగా.. మాస్ట్రో చిత్రయూనిట్ నితిన్ అభిమానులకు సర్‎ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది.

తాజాగా కృష్ణాష్టమి పురస్కరించుకుని మాస్ట్రో నుంచి స్నీక్ పీక్ విడుదల చేసింది చిత్రయూనిట్. అందులో నితిన్ పియానే ప్లే చేస్తూ కనిపించాడు. ఈ సినిమాలో నితిన్ కళ్లు కనిపించని అంధుడిగా కనిపించబోతున్నట్లుగా మొదటి నుంచి టాక్ వినిపిస్తోంది. తాజాగా విడుదలైన స్నీక్ పీక్‏లో నితిన్ కళ్లు కనబడని యువకుడిగానే కనిపిస్తున్నాడు. అంధుడైన నితిన్ ఓ బ్యూటిఫుల్ ట్యూన్ కంపోజ్ చేస్తుండగా.. ఆకస్మాత్తుగా పియానో వర్క్ చేయడం ఆగిపోతుంది. దీంతో ట్యూన్ అవడం లేదు.. పియానో పనిచేయడం లేదు.. అంటూ తన చేతికి ఉన్న వాచ్‏లో టైం చెక్ చేసుకుంటాడు. అయితే ఇందులో నితిన్ నటన ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను హిందీలో సూపర్ హిట్ సాధించిన అంధాధున్ చిత్రానికి రీమేక్‏గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ సినిమా పై ఆసక్తిని పెంచుతుంది. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాస్ట్రో చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నరేష్, జిషుసేన్ గుప్తా, శ్రీముఖి, అనన్య, హర్షవర్ధన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాస్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

Also Read: Tollywood drugs case: ‘లింకులు తెంపుతాం.. నేరస్థులను పట్టుకుంటాం..’ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు

Shruti Haasan: . ప్రేమ, పెళ్లిపై శ్రుతి హాసన్‏కు పిచ్చ క్లారిటీ.. అప్పుడే చెబుతానంటోన్న బ్యూటీ..

ఏకంగా 19 ఏళ్ల యూవీ రికార్డు బద్దలు కొట్టేశాడు.. ఈ ప్లేయర్ ఎవరంటే
ఏకంగా 19 ఏళ్ల యూవీ రికార్డు బద్దలు కొట్టేశాడు.. ఈ ప్లేయర్ ఎవరంటే
ఆ సినిమా ప్లాప్ అయ్యాక రాత్రంతా ఏడ్చేసా..
ఆ సినిమా ప్లాప్ అయ్యాక రాత్రంతా ఏడ్చేసా..
నల్ల పసుపును ఎప్పుడైనా తిన్నారా? ఎన్ని సమస్యలను తగ్గిస్తుందంటే...
నల్ల పసుపును ఎప్పుడైనా తిన్నారా? ఎన్ని సమస్యలను తగ్గిస్తుందంటే...
ఇదేం బాధరా భగవంతుడా.. కడసారి వీడ్కోలుకు కన్నీటి కష్టాలు..
ఇదేం బాధరా భగవంతుడా.. కడసారి వీడ్కోలుకు కన్నీటి కష్టాలు..
వాట్సప్‌లో స్టన్నింగ్ ఫీచర్.. వెబ్ వెర్షన్‌లో కూాడా కాలింగ్
వాట్సప్‌లో స్టన్నింగ్ ఫీచర్.. వెబ్ వెర్షన్‌లో కూాడా కాలింగ్
బాబోయ్.. లక్కంటే ఈ ముద్దుగుమ్మదే.. వరుస ఆఫర్స్..
బాబోయ్.. లక్కంటే ఈ ముద్దుగుమ్మదే.. వరుస ఆఫర్స్..
ఇంత అందానికి అదృష్టమే కలిసి రావట్లేదు.. హిట్టు కోసం వెయిటింగ్..
ఇంత అందానికి అదృష్టమే కలిసి రావట్లేదు.. హిట్టు కోసం వెయిటింగ్..
పాము కరిచినా చావదు.. సింహనికే సుస్సుపోయించే భయపడని జంతువు..
పాము కరిచినా చావదు.. సింహనికే సుస్సుపోయించే భయపడని జంతువు..
వారం రోజులు జీలకర్ర నీటిని తాగితే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు..
వారం రోజులు జీలకర్ర నీటిని తాగితే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు..
టీమిండియాతో మ్యాచ్‌కు లైన్ క్లియర్.. ఓకే చెప్పిన పాక్
టీమిండియాతో మ్యాచ్‌కు లైన్ క్లియర్.. ఓకే చెప్పిన పాక్