Shruti Haasan: . ప్రేమ, పెళ్లిపై శ్రుతి హాసన్‏కు పిచ్చ క్లారిటీ.. అప్పుడే చెబుతానంటోన్న బ్యూటీ..

కమల్ హాసన్ గారాల పట్టి శ్రుతి హాసన్ ప్రస్తుతం టాలీవుడ్‏లో టాప్ హీరోయిన్స్‏లలో ఒకరు. సింగర్‍గా కెరీర్ ఆరంభించిన శ్రుతి... బెస్ట్ మ్యూజిక్ కంపోజర్‏గా గుర్తింపు పొందింది.

Shruti Haasan: . ప్రేమ, పెళ్లిపై శ్రుతి హాసన్‏కు పిచ్చ క్లారిటీ.. అప్పుడే చెబుతానంటోన్న బ్యూటీ..
Shruti Haasan
Follow us

|

Updated on: Aug 30, 2021 | 2:39 PM

కమల్ హాసన్ గారాల పట్టి శ్రుతి హాసన్ ప్రస్తుతం టాలీవుడ్‏లో టాప్ హీరోయిన్స్‏లలో ఒకరు. సింగర్‍గా కెరీర్ ఆరంభించిన శ్రుతి… బెస్ట్ మ్యూజిక్ కంపోజర్‏గా గుర్తింపు పొందింది. యంగ్ హీరో సిద్ధార్థ్ సరసన అనగనగా ఓ ధీరుడు సినిమాతో వెండితెరకు హీరోయిన్‏గా పరిచయమైన శ్రుతి హాసన్.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అగ్ర స్థానంలో కొన్నేల్లపాటు కొనసాగింది. ఇక ఆ తర్వాత… కొంత కాలం క్రితం మైఖెల్ కోర్సలేతో ప్రేమాయాణం నడిపిస్తూ.. సినిమాలకు దూరంగా ఉంది ఈ అమ్మడు. ఆ తర్వాత అతనితో బ్రేకప్ అనంతరం మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రుతి హాసన్. ఇటీవలే మాస్ మహారాజా రవితేజ సరసన క్రాక్ సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో శ్రుతికి మళ్లీ పూర్వ వైభవం వచ్చేసినట్లుగా తెలుస్తోంది. క్రాక్ హిట్ తర్వాత ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శ్రుతి హాసన్ డూడుల్ ఆర్టీస్ట్ శంతను హజారికాతో ప్రేమాయాణం సాగిస్తోంది. ఇటీవల వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. దీంతో త్వరలోనే శంతను.. శ్రుతి పెళ్లి చేసుకోబోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. దీంతో తాజాగా శ్రుతి హాసన్ ఈ రూమర్స్ పై స్పందించింది. ఇద్దరి అభిరుచులు ఒకటే. కళలు, సంగీతం పట్ల అవగాహన ఉంది. అందుకే అతనితో ఎక్కువ సమయం గడిపడానికి ఇష్టపడతాను. అన్ని అంశాల్లోనూ అతను నాక్ పర్‏ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్. అలాగే పెళ్లి విషయంపై స్పందిస్తూ..తనకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడే.. అయితే పెళ్లికి ముందే ఆ విషయాన్ని మీడియాకు లీక్ చేస్తా అని చెప్పుకొచ్చింది.

Also Read: Anupama Parameswaran: అందానికి అసూయ తెప్పించే అనుపమ ఫోటోలు.. బ్లాక్ డ్రెస్సులో బ్యూటీ

Megastar Chiranjeevi: చిరకాల మిత్రుడిని కలుసుకున్న చిరంజీవి.. ప్రత్యేకమైన రోజంటూ ట్వీట్..