Megastar Chiranjeevi: చిరకాల మిత్రుడిని కలుసుకున్న చిరంజీవి.. ప్రత్యేకమైన రోజంటూ ట్వీట్..

మెగాస్టార్ చిరంజీవి.. చిత్రపరిశ్రమలో సరికొత్త రికార్డ్.. ఏలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. దశాబ్దాలుగా చిత్రసీమను

Megastar Chiranjeevi: చిరకాల మిత్రుడిని కలుసుకున్న చిరంజీవి.. ప్రత్యేకమైన రోజంటూ ట్వీట్..
Chiranjeevi
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 29, 2021 | 9:33 PM

మెగాస్టార్ చిరంజీవి.. చిత్రపరిశ్రమలో సరికొత్త రికార్డ్.. ఏలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. దశాబ్దాలుగా చిత్రసీమను ఏలుతున్న విక్రమార్కుడు. సినీ పరిశ్రమ గతిని మార్చేశాడు చిరు. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. ఇటు సోషల్ మీడియాలో మెగా మెనియా కొనసాగుతుంది. దాదాపు అరడజనుకు పైగా హీరోలను చిత్రసీమకు అందించారు. ఖైదీ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరు ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్నాడు. ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా షూటింగ్‏లో పాల్గొన్న చిరు.. ప్రస్తుతం లూసీఫర్ రీమేక్‏లో నటిస్తున్నాడు. ఇక ఇటీవలే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరు.. నిత్యం.. సినిమా అప్డేట్స్, వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటున్నారు. మొన్న చిరు బర్త్ డే కావడంతో.. చిరంజీవి ఇంట్లో ఘనంగా వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి.

తాజాగా చిరు.. తన చిరకాల మిత్రుడు భారతదేశానికి తొలి ప్రపంచకప్‏ను అందించిన దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్‏ను కలిశారు. ఎన్నో సంవత్సరాలుగా భారత్ క్రికెట్ జట్టు కంటున్న కళలను కపిల్ దేవ్ 1983లో నిజం చేశారు. ఫలుక్ నామా ప్యాలెస్‏లో జరిగిన ఓ సమావేశంలో కపిల్ దేవ్‏ను చిరు కలుసుకున్నారు. ఈ సమావేశంలో చిరు సతీమణి సురేఖ కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరు తన ఇన్‏స్టాలో షేర్ చేశారు. నా పాత మిత్రుడు కపిల్ దేవ్‏ను చాలా కాలం తర్వాత ఫలుక్‌నామా ప్యాలెస్‌లో కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ఒక్కసారిగా గతంలోకి వెళ్లి ఆ రోజులను గుర్తుచేసుకున్నాను. ఆయన మనకు మొదటి ప్రపంచకప్ అందించిన హర్యానా హర్రీక్రేన్ అంటూ ట్వీట్ చేశారు చిరు.

ట్వీట్..

Also Read: Ram Charan: సిస్టర్స్‏తో కలసి చరణ్ లంచ్ బ్రేక్.. నెట్టింట్లో వైరలవుతున్న ఫోటోస్..

స్టార్ హీరోకు ఝలక్ ఇచ్చిన దొంగలు.. సినిమా స్టైల్లో కారు చోరి.. టెక్నాలజీని వాడడంలో వీళ్లు వీరలెవల్..