Bigg Boss Telugu Season 5 : ఈ సారి మరింత రసవత్తరంగా సాగనున్న బిగ్ బాస్.. టాస్కుల విషయంలో తగ్గేదే లేదంట..

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు సీజన్స్ విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 5..

Bigg Boss Telugu Season 5 : ఈ సారి మరింత రసవత్తరంగా సాగనున్న బిగ్ బాస్.. టాస్కుల విషయంలో తగ్గేదే లేదంట..
Bigg Boss5
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 30, 2021 | 6:52 AM

Bigg Boss Telugu Season 5 : తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు సీజన్స్ విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 5 తో మరోసారి అలరించడానికి సిద్ధం అవుతుంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 5 కు సంబందించిన ప్రోమోను కూడా విడుదల చేశారు నిర్వాహకులు. ఈ సారి కూడా కింగ్ నాగార్జుననే బిగ్ బాస్కు హోస్ట్ గా వ్యవహరించనునారు. ఇక బిగ్ బాస్ హౌస్ గురించి ప్రత్యేకంగా చేప్పాలిన అవసరం లేదు. కంటెస్టెంట్స్ మధ్య ,గొడవలు, అల్లర్లు, ఏడుపులు, మధ్య మధ్యలో అందాల భామల గ్లామర్ షోలతో ఫుల్ ఎంటర్టైటైనింగ్గా ఉంటుంది. వారం వారం హోస్ట్ నాగార్జున ఇచ్చే టాస్కులు, కంటెస్టెంట్స్కు ఇచ్చే వార్నింగులు. ఆడించే గేమ్స్, ఎలిమినేషన్ ఎపిసోడ్ ఇలా రసవత్తరంగా సాగుతుంది బిగ్ బాస్ షో. ఇక హిందీ బిగ్ బాస్ షోలో టాస్కుల సమయంలో తిట్టుకోవడం , కుదిరితే కొట్టుకోవడం చాలా కామన్. మన దగ్గర ఇంకా కొట్టుకునే రేంజ్లో టాస్కులు లేవు గాని తిట్టుకోవడం, గొడవపడటం, ఏడవడం వరకు జరిగాయి. కానీ ఈ సారి తెలుగులో టాస్కులు మరో లెవల్లో ఉండబోతున్నాయట.

ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకుగాను వివాదాస్పద టాస్క్లను డిజైన్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. నాలుగు సీజన్ లలో చూడని అత్యంత వివాదాస్పద టాస్క్లను చూడబోతున్నామట. అందుకు తగ్గట్టుగా టాస్కులను ప్లాన్ చేస్తున్నారట నిర్వాహకులు. ప్రస్తుతం షో కు సంబంధించిన టాస్క్ల విషయంలో సీరియస్ గా వర్క్ చేస్తున్నారట బిగ్ బాస్ టీమ్. సెప్టెంబర్ 5 నుంచి బిగ్ బాస్ ప్రేక్షకులను అలరించడానికి రాబోతుంది. ఇక బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోయేది వీరే అంటూ కొద్దిరోజులుగా కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేర్లలో యాంకర్ రవి – షణ్ముఖ్ జస్వంత్- ఆర్జే కాజల్ (యాంకర్)- నవ్య స్వామి (సీరియల్ హీరోయిన్)- నిఖిల్ (యాంకర్)- సిరి హనుమంత్ (సీరియల్ నటి)- శ్రీహాన్ (సీరియల్ నటుడు)- జస్వంత్ పాదాల (మోడల్)- వీజే సన్నీ (సీరియల్ నటుడు)- ప్రియాంకా రామన్ (క్రాక్ ఫేమ్)- జబర్దస్త్ ప్రియాంక అలియాస్ సాయి (ట్రాన్స్ జెండర్)- లోబో (యాంకర్)- సినీ నటి ప్రియ- ఈషా చావ్లా- ఉమాదేవి (కార్తీకదీపం భాగ్య)- ఆనీ మాస్టర్ (కొరియోగ్రాఫర్)-యాంకర్ రోజా – మానస్ (టీవీ నటుడు)- 7 ఆర్ట్స్ సరయు- జ్యోతి రాజ్ (ఆట సందీప్ భార్య)- ఆట సందీప్. ఈ పేర్లు దాదాపు ఖరారైనట్టే అని తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Varudu Kavalenu: అప్‏డేట్ వచ్చేసింది.. వరుడు కావలెను టీజర్ విడుదల ఎప్పుడంటే..

Dear Megha movie: హ్యాపీ హ్యాపీగా.. ఫన్నీ ఫన్నీగా.. ‘మై డియర్ మేఘ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ