AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha Akkineni : నా రూటే సపరేటు అంటున్న అక్కినేని కోడలు పిల్ల.. ఫ్యాన్స్ ను కన్ఫ్యూజన్ లో పడేసిన సమంత

సీనియారిటీకి సీనియారిటీ... మెచ్యూరిటీకి మెచ్యూరిటీ. పైగా... టాలెంట్‌ విషయంలో ఆమెకు ఆమే పోటీ. కెరీర్‌లో ఇంత విషయమున్నా..

Samantha Akkineni : నా రూటే సపరేటు అంటున్న అక్కినేని కోడలు పిల్ల.. ఫ్యాన్స్ ను కన్ఫ్యూజన్ లో పడేసిన సమంత
Samantha
Rajeev Rayala
|

Updated on: Aug 30, 2021 | 1:55 PM

Share

Samantha Akkineni: సీనియారిటీకి సీనియారిటీ… మెచ్యూరిటీకి మెచ్యూరిటీ. పైగా.. టాలెంట్‌ విషయంలో ఆమెకు ఆమే పోటీ. కెరీర్‌లో ఇంత విషయమున్నా.. స్క్రీన్‌ మీద సోలో పెర్ఫామెన్స్‌కి దూరంగా వున్నారు. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ అని ఆలోచిస్తున్నారా.. ఆ భామే అక్కినేని కోడలు పిల్ల సమంత. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. పవర్‌స్టార్‌తో నటించడం ఒక అదృష్టంగా భావిస్తున్నా అని అప్పట్లో అంత ఎమోషనల్‌గా చెప్పిన సమంతను.. ఆ అదృష్టం మరోసారి వరించబోతోందట. పీకే-సామ్‌ కెమిస్ట్రీ అత్తారింటికి దారేదికి కమర్షియల్‌గా ఎంత ప్లస్ అయిందో చూశాం. ఆ మేజిక్‌ని ఈసారి గబ్బర్‌సింగ్‌ డైరెక్టర్ రిపీట్ చేస్తున్నారా అనేది పవన్‌ ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తున్న మేజర్ ఫీలర్.

ఇప్పటికే పవన్‌కి జోడీగా పూజా హెగ్డేని ఫైనల్ చేసిన హరీష్.. సెకండ్ ఫిమేల్ లీడ్‌ కోసం సమంతను అప్రోచ్ అయినట్టు ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ ఊసులో ఎంత న్యూసుందో గాని… సినీజనాలందరి ఫోకస్ సామ్‌ మీదికి మళ్లింది. సమంతను ఇక సోలో హీరోయిన్‌గా చూసుకోలేమా అనే వెలితి కనిపిస్తోంది వాళ్ల మనసుల్లో. డార్లింగ్ ప్రభాస్‌తో నాగ్అశ్విన్‌ తీస్తున్న పాన్ వరల్డ్ మూవీలో కూడా సమంతకు లిటిల్ స్కోప్ వుండే పాత్ర రాసిపెట్టారట. వైజయంతీ కాంపౌండ్‌తో వున్న పరిచయం కొద్దీ గతంలో మహానటిలో కెమియో చేసిన సమంత… నాగీ కోరిక మేరకు మరో గెస్ట్ అప్పియరెన్స్‌ని ఓకే చేశారట. ప్రస్తుతం.. మైథలాజకల్ ప్రాజెక్ట్‌ శాకుంతలంలో టైటిల్ రోల్ చేస్తూ షూటింగ్ ఫినిష్ చేశారు సమంత. విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్న కాత్తువాక్కుల రెండు కాదల్ తమిళ్‌ మూవీలో నయన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇలా పార్షియల్‌ అండ్ పెక్యూలియర్ రోల్స్‌ మాత్రమే చేసుకుంటూ వెళుతూ, యూనిక్ స్టయిల్ ఆఫ్ లైనప్‌తో ఫ్యాన్స్‌కి ఓ పజిల్‌లా తయారయ్యారు సూపర్‌డీలక్స్ బ్యూటీ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shakuntalam: అంచనాలు పెంచుతున్న గుణశేఖర్ సినిమా.. అక్కడి ప్రేక్షకులను కూడా అట్రాక్ట్ చేస్తుందిగా

RGV Rewind: అరియానాకు వర్మ ఇచ్చిన భరోసా ఏంటి.. ఎవర్ గ్రీన్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ..(వీడియో).

Tollywood: 2022 ప్రేక్షకులకు పండగే.. ట్రిపుల్‌ ధమాకా ఇవ్వనున్న స్టార్ హీరోలు వీరే..