Tollywood: 2022 ప్రేక్షకులకు పండగే.. ట్రిపుల్ ధమాకా ఇవ్వనున్న స్టార్ హీరోలు వీరే..
మన హీరోలు స్పీడు పెంచారు. కోవిడ్ కారణంగా థియేటర్ ముఖం చూడకుండానే రెండేళ్లు గడిచియాయి. అందుకే కమింగ్ ఇయర్స్‌ను జామ్ ప్యాక్డ్‌గా రెడీ చేస్తున్నారు...
Tollywood: మన హీరోలు స్పీడు పెంచారు. కోవిడ్ కారణంగా థియేటర్ ముఖం చూడకుండానే రెండేళ్లు గడిచియాయి. అందుకే కమింగ్ ఇయర్స్‌ను జామ్ ప్యాక్డ్‌గా రెడీ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా నెక్ట్స్.. 2022లో ఒక్కో హీరో ట్రిపుల్ ధమాకా ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ లిస్ట్‌లో పక్కాగా వినిపిస్తున్న పేరు ప్రభాస్. ఈ మధ్య ప్రతీ సినిమాను ఏళ్ల తరబడి చేస్తున్న డార్లింగ్.. ఇక ఆలస్యం ఉండదని గట్టిగా చెబుతున్నారు. ఆల్రెడీ మోస్ట్ డిలేడ్ రాధేశ్యామ్‌ను నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఎనౌన్స్ చేశారు. సలార్ కూడా సమ్మర్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక ఆదిపురుష్ ఆగస్టు 11న ఆడియన్స్ ముందుకు వస్తారంటూ షూటింగ్ ప్రారంభమైన రోజే డిక్లేర్ చేశారు. అంటే నెక్ట్స్ ఇయర్ డార్లింగ్ ట్రిపుల్ ధమాకా పక్కా అనమాట. బాహుబలికి ఏ మాత్రం తగ్గనంటున్నారు సిల్వర్ స్క్రీన్ ఆచార్య చిరంజీవి. ఆల్రెడీ ఆచార్యుడి ఆగమనం సంక్రాంతికే అన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఆచార్య వర్క్ కంప్లీట్ కావటంతో మూడు సినిమాలను లైన్‌లో పెట్టారు మెగాస్టార్. లూసీఫర్ రీమేక్‌గా తెరకెక్కుతున్న గాడ్‌ఫాదర్‌తో పాటు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో మూవీని కూడా నెక్ట్స్ ఇయరే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
చిరు మాత్రమే కాదు చిరుత కూడా అదే వేగం చూపిస్తున్నారు. ఆచార్యతో పాటు శంకర్ డైరెక్షన్‌లో చేస్తున్న పాన్ ఇండియా మూవీ నెక్ట్స్ ఇయర్ రిలీజ్కు ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇక ఈ ఏడాది రిలీజ్ కావాల్సిన ట్రిపులార్ కూడా 2022కు రీ షెడ్యూల్ అయ్యే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే 2022లో చరణ్‌కు కూడా మూడు రిలీజ్‌లు పక్కా అనమాట. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ట్రిపుల్ ట్రీట్‌కు రెడీ అవుతున్నారు. భీమ్లానాయక్ సంక్రాంతికి రిలీజ్ అంటూ ఆల్రెడీ ఎనౌన్స్‌మెంట్ వచ్చేసింది, క్రిష్ డైరెక్షన్‌లో చేస్తున్న హరి హర వీరమల్లును సమ్మర్ రిలీజ్‌కు సిద్ధం చేయాలన్నది పవన్ ప్లాన్… అంతేకాదు హరీష్ డైరెక్షన్‌లో చేయబోయే మూవీ కూడా 2022లోనే ఆడియన్స్ ముందుకు రానుంది. సో.. పవన్ సైడ్ నుంచి కూడా మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి. రెండేళ్లుగా సరైన ఎంటర్‌టైన్మెంట్ మిస్ అయిన ఆడియన్స్.. నెక్ట్స్ ఇయర్ రిలీజ్‌లతో ఫుల్ ఖుషీ అవ్వనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :