Thalaivi: బాక్సాఫీస్ లెక్కలకు అతీతంగా కంగనా సినిమా.. మనసులు దోచుకుంటుందట..
కొన్ని సినిమాలను ఏ ప్లాట్‌ఫార్మ్ మీద చూసినా పెద్దగా ఎఫెక్ట్ పడదు. కొన్ని చిత్రాలను కచ్చితంగా బిగ్ స్క్రీన్ మీదే చూడాలి...
Thalaivi: కొన్ని సినిమాలను ఏ ప్లాట్‌ఫార్మ్ మీద చూసినా పెద్దగా ఎఫెక్ట్ పడదు. కొన్ని చిత్రాలను కచ్చితంగా బిగ్ స్క్రీన్ మీదే చూడాలి. అలాంటి ఎక్స్ పీరియన్స్ ని ఆడియన్స్ కి ఇవ్వడానికే ఇన్నాళ్లూ వెయిట్ చేశామని అంటున్నారు తలైవి మూవీ మేకర్స్. ఈ సినిమాతో నటిగా కంగన నెక్స్ట్ లెవల్ పెర్పార్మెన్స్ ని విత్‌నెస్ చేయొచ్చన్నది క్రిటిక్స్ మాట. వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 10న తలైవి రిలీజ్ కానుంది. ఈ సినిమాను తమిళ్, తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా నిర్మించారు. సినిమా స్టార్టింగ్‌లో కంగన లుక్స్ జయలాగా లేవంటూ దారుణమైన ట్రోలింగ్ జరిగింది. కానీ సినిమా కంప్లీషన్ స్టేజ్‌కి వచ్చేసరికి తలైవి మీద పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. జయలలితలా కనిపించడానికి కంగన వెయిట్ పుట్ ఆన్ కావడం, తమిళ్ నేర్చుకోవడం, భరతనాట్యం ప్రాక్టీస్ చేయడం వంటివి ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి.
ఇప్పటిదాకా నార్త్ మీద గ్రిప్ సంపాదించుకున్న కంగన ఈ మూవీతో సౌత్ మార్కెట్ మీద కూడా సోలో హీరోయిన్‌గా ఓ కమాండ్ తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నారు. తలైవి ఏ మాత్రం హిట్ అయినా అదేం అంత కష్టం కాదన్న టాక్ కూడా ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా సక్సెస్‌ని కలెక్షన్లతో ముడిపెట్టి చూడకూడదన్నది మేకర్స్ మాట. పెట్టిన డబ్బును సేఫ్‌జోన్‌లోకి తెచ్చుకోవడానికి మల్టిపుల్ వేస్‌లో ట్రై చేయాలేగానీ, చాలీచాలని షోలు, సగం నిండిన థియేటర్లలో వచ్చే వసూళ్లతో అంచనాకు రాకూడదన్నది కంగన మూవీ మేకర్స్ ఇస్తున్న ఓపెన్ స్టేట్‌మెంట్. సో బాక్సాఫీస్ లెక్కలకు అతీతంగా తలైవి మనసులు దోచుకోవడం ఖాయం అనే మాట మాత్రం యూనిట్‌లో బలంగా వినిపిస్తోంది. చూడాలి మరి ఏంజరుగుతుందో..
మరిన్ని ఇక్కడ చదవండి :