AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jacqueline Fernandez: బాలీవుడ్ సెలబ్రెటీలకు బిగుస్తున్న మనీలాండరింగ్ కేసు.. స్టార్ హీరోయిన్‏కు చెమటలు పట్టించిన ఈడీ..

గత కొద్దిరోజులుగా చిత్రపరిశ్రమలోని ప్రముఖుల చుట్టూ వివిధ కేసులు తిరుగుతున్నాయి. డ్రగ్స్, మనీలాండరింగ్ కేసులతో సెలబ్రెటీలు

Jacqueline Fernandez: బాలీవుడ్ సెలబ్రెటీలకు బిగుస్తున్న మనీలాండరింగ్ కేసు.. స్టార్ హీరోయిన్‏కు చెమటలు పట్టించిన ఈడీ..
Jacqueline Fernandez
Rajitha Chanti
|

Updated on: Aug 30, 2021 | 6:39 PM

Share

గత కొద్దిరోజులుగా చిత్రపరిశ్రమలోని ప్రముఖుల చుట్టూ వివిధ కేసులు తిరుగుతున్నాయి. డ్రగ్స్, మనీలాండరింగ్ కేసులతో సెలబ్రెటీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులను ఈడీ విచారిస్తోంది. ఇటు తెలుగు ఇండస్ట్రీలోని పలువురు తారలను సెప్టెంబర్ నెలలో డ్రగ్స్ కేసులో భాగంగా విచారించనున్నట్లుగా ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అటు బాలీవుడ్‏లో సైతం మనీలాండరింగ్ కేసులో భాగంగా తారలను విచారించే పనిలో పడింది ఈడీ. తాజాగా మనీలాండరింగ్ కేసులో సోమవారం బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‏ను ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) అధికారులు ఢిల్లీలో విచారించారు. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా సంచలనం కలిగింది. ఈ కేసులో జాక్వెలిన్‏తోపాటు.. ఇంకా పలువురు ప్రముఖులు విచారించే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.

మానీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) అధికారులు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‏ను దాదాపు ఐదు గంటలుగా విచారించారు. మనీలాండరింగ్ ఆరోపణలతోనే జాక్వెలిన్‏ను ఈడీ విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక మరోవైపు ముంబయిలోని ఇంట్లో డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్న కేసులో బాలీవుడ్‌ నటుడు అర్మాన్‌ కోహ్లిని ఎన్‌సీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను సెప్టెంబర్‌ 1 వరకు ఎన్‌సీబీ కస్టడీలోకి తీసుకుంది.

ట్వీట్..

ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 4 సంవత్సరాల క్రితం డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి మరియు దర్శకుడు పూరి జగన్నాధ్‌తో సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులకు  విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Also Read: Lakshya Movie: షూటింగ్ పూర్తిచేసిన లక్ష్య.. త్వరలోనే థియేటర్లలో కలుద్దామంటూ యంగ్ హీరో ట్వీట్..

ఆదమరచి నిద్రపోతున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. బుల్లితెరపైకి ఎంట్రీ ఇస్తోంది ఈ చిన్నది..