Bangarraju Movie: బంగార్రాజు సరసన మరో ముగ్గురు హీరోయిన్స్.. రంభ, ఊర్వసి, మేనకలు ఎవరంటే…

కింగ్ నాగార్జున హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినా.

Bangarraju Movie: బంగార్రాజు సరసన మరో ముగ్గురు హీరోయిన్స్.. రంభ, ఊర్వసి, మేనకలు ఎవరంటే...
Nagarjuna
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 30, 2021 | 6:11 PM

కింగ్ నాగార్జున హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. అంతగా విజయం సాధించలేకపోయాడు. కానీ ఈ సినిమా ద్వారా నాగ్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను మాత్రం మెప్పించాడు. ప్రస్తుతం కింగ్.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‏గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‏లో శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా చివరి దశలో ఉండగానే… అటు బంగార్రాజు సినిమాను పట్టాలెక్కించాడు. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా ప్రారంభించారు. ఇక నాగ్ పుట్టిన రోజు సందర్భంగా.. బంగార్రాజు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‏ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ స్వర్గం నుంచి దిగివస్తున్న నాగ్ ఫోటో అభిమానులను తెగ ఆకరట్టుకుంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో స్వర్గలోకంలో సన్నివేశాలు ఉంటాయట. స్వర్గలోక సన్నివేశాల కోసం మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. స్వర్గలోకం సెట్ వేయడం దగ్గర్నుంచి బంగార్రాజు కోసం ప్రత్యేక జాగ్రత్తుల తీసుకుంటున్నారట మేకర్స్. అయితే ఈ సినిమాలో స్వర్గలోక సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని.. అందులో రంభ, ఊర్వశి, మేనకల పాత్రలు ఉండబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఆ ముగ్గురి కోసం హీరోయిన్స్‏ను వెతికే పనిలో పడ్డారట. ఇప్పటికే బంగార్రాజు కోసం బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్‏ను ఎంపిక చేసినట్లుగా టాక్. ఈమెతోపాటు.. దర్శన బనిక్, అక్షత కూడా బంగార్రాజు సినిమాలో నటించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. రంభ, ఊర్వశి, మేనకలతో కలిసి, నాగార్జున, నాగచైతన్య కలయికలో ఓ సాంగ్ ఉండబోతుందని.. అచ్చంగా సోగ్గాడే చిన్ని నాయనా సినిమా మాదిరిగానే ఇందులో కూడా హీరోయిన్లతో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందని అర్థమవుతుంది.

Monal Gajjar, Darshana Banik, Akshata Sonawane

Monal Gajjar, Darshana Banik, Akshata Sonawane

ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‏లో శరవేగంగా జరుగుతుంది.

Also Read: ఆదమరచి నిద్రపోతున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. బుల్లితెరపైకి ఎంట్రీ ఇస్తోంది ఈ చిన్నది..

Vijay Sethupathi: సెప్టెంబర్ మొత్తం విజయ్ సేతుపతి హావా.. ఫ్యాన్స్‏కు ఇక పండగే..

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?