Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love O2O Actress: పన్ను కట్టని ప్రముఖ నటి.. మాజీ భర్త ఫిర్యాదు.. రూ. 330 కోట్లను జరిమాన విధించిన ప్రభుత్వం ఎక్కడంటే

Love O2O Actress: ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిమితికి మించి ఆదాయం ఉన్నా.. సంపాదిస్తున్న వారు ఆదాయపు పన్ను చెల్లించాల్సిందే. ప్రభుత్వం ఖజానా నిండడానికి సంపన్నులు, ప్రజలు చెల్లించే పన్నులే ఆధారం...

Love O2O Actress: పన్ను కట్టని ప్రముఖ నటి.. మాజీ భర్త ఫిర్యాదు.. రూ. 330 కోట్లను జరిమాన విధించిన ప్రభుత్వం ఎక్కడంటే
Zheng Shuang
Follow us
Surya Kala

|

Updated on: Aug 30, 2021 | 10:33 AM

Love O2O Actress:ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిమితికి మించి ఆదాయం ఉన్నా.. సంపాదిస్తున్న వారు ఆదాయపు పన్ను చెల్లించాల్సిందే. ప్రభుత్వం ఖజానా నిండడానికి సంపన్నులు, ప్రజలు చెల్లించే పన్నులే ఆధారం. అయితే సంపాదిస్తూ కూడా పన్నులు ఎగవేసేవారు ఏ దేశంలో నైనా ఉంటారు. ఇక అభివృద్ధి చెందిన దేశం చైనా కూడా పన్నుల విధానాన్ని సవరిస్తూ.. తన ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి చూస్తుంది. ముఖ్యంగా డ్రాగన్ కంట్రీ పేద, ధనికుల మధ్య అంతరాలు తగ్గించాలనే యోచనలో నూతన ఆదాయపు పన్నులు విధించే పద్దతులను అమలులోకి తీసుకొచ్చింది.

నూతన పన్నుల విధానంతో సెలెబ్రెటీలపై సైతం ఉక్కుపాదం మోపుతోంది. పన్ను కట్టని వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. దీంతో తాజాగా ఓ టాప్​ సెలెబ్రెటీ పన్ను ఎగ్గొట్టిన్నందుకు 46 మిలియన్ యూఎస్ డాలర్లు అంటే మన దేశపు కరెన్సీ లో రూ. 330 కోట్ల ను కట్టాలని సమన్లు జారీ చేసింది. అంతేకాదు ఆ నటి పన్ను చెల్లించే వరకు .. ఆమె నటించిన షోలు, డ్రామాలు, సీరీస్​లు ఏవీ ప్రదర్శించకుండా నిషేధం విధించింది. ఆమ్మో ఇన్ని కోట్లు పన్ను కట్టాల్సిన నటి ఎవరో వివరాల్లోకి వెళ్తే..

చైనాకు చెందిన 30 ఏళ్ల జెంగ్‌‌‌‌ షువాంగ్‌‌‌‌ ప్రముఖ టీవీ, సినిమా నటి. 2019, 2020ల్లో జెంగ్ నటించిన సినిమాలు, టీవీ సిరీస్‌‌‌‌ల కోసం తీసుకున్న పేమెంట్‌‌‌‌కు సంబంధించి పన్ను కట్టలేదని షాంఘై మున్సిపల్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ అధికారులు గుర్తించింది. వెంటనే ఆమెకు నోటీసులు ఇచ్చి.. పన్నులు ఎగొట్టినందుకు భారీ మొత్తంలో జరిమానా విధించారు.

అయితే జెంగ్ పన్నుల విషయం అధికారులు ఆమె మాజీ భర్త జెంగ్ హెంగ్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే డ్రాగన్ కంట్రీలో చైనా చట్టాలను పాటించని నటీనటుల షోలను ప్రసారం చేయరు. ఈ నేపథ్యంలో నటి జెంగ్‌‌‌‌ తాజా షోలను నేషనల్‌‌‌‌ రేడియో, టెలివిజన్‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌ బ్యాన్ చేసింది. ఇక నుంచి తమ ఛానల్స్ లో జెంగ్ నటించిన షోలను ప్రచారం చేయమని అధికారికంగా ప్రకటన చేసింది.

ఇప్పటికే జెంగ్ సరోగసీ ద్వారా జన్మనిచ్చిన ఇద్దరు శిశువులను అమెరికా వదిలేసిందనే విషయంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు పన్ను ఎగొట్టిన వివాదం.. దీంతో జెంగ్ ఎప్పుడు ఏదొక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది అని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Also Read: Mayuura Dhvaja: తన శరీరంలోని సగభాగం ఇచ్చి పరోపకారం త్యాగనిరతిని గురించి చెప్పిన ధీరుడు.. పాండవులను ఓడించిన వీరుడు