Actor Suman: దక్షిణాది సీనియర్ నటుడు యాక్షన్ స్టార్ సుమన్ పుట్టిన రోజు నేడు..

Actor Suman: దక్షిణ భారత సీనియర్ నటుడు రియల్ హీరో సుమన్ పుట్టిన రోజు నేడు.. సినిమాల్లో అడుగు పెట్టిన కొద్దికాలంలోనే స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తమిళ సినిమాల్లో నటిస్తున్న సుమన్ ను తెలుగు..

Actor Suman: దక్షిణాది సీనియర్ నటుడు యాక్షన్ స్టార్ సుమన్ పుట్టిన రోజు నేడు..
Suman
Follow us
Surya Kala

|

Updated on: Aug 30, 2021 | 10:38 AM

Actor Suman: దక్షిణ భారత సీనియర్ నటుడు రియల్ హీరో సుమన్ పుట్టిన రోజు నేడు.. సినిమాల్లో అడుగు పెట్టిన కొద్దికాలంలోనే స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తమిళ సినిమాల్లో నటిస్తున్న సుమన్ ను తెలుగు తెరకు పరిచయం చేసింది స్నేహితుడు యాక్టర్ భానుచందర్. చిత్ర పరిశ్రమలో సుమన్, భానుచందర్ మంచి స్నేహితులు. ఇద్దరికీ మార్షల్ ఆర్ట్స్ లో మంచి నైపుణ్యం ఉండడంతో అప్పట్లో ట్రెండ్ సెట్ చేశారు. టి కృష్ణ దర్శకత్వంలో నటించిన నేటి భారతం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకున్నాడు అనతికాలంలోనే స్టార్ హీరోగా ఫేమస్ అయ్యాడు.

సుమన్ తల్వార్ ఆగస్టు 29వ తేదీ 1959న చెన్నైలో జన్మించాడు. కోలీవుడ్ లో నీచల్ కులం సినిమాతో వెండి తెరపై ఎంట్రీ ఇచ్చిన సమాజం తెలుగు, తమిళ, కన్నడ, ఆంగ్ల భాషల్లో మొత్తం 150కి పైగా సినిమాలలో నటించాడు.  సుమన్ యాక్షన్ హీరో గానే కాదు అన్నమయ్య సినిమాలో పోషించిన వెంకటేశ్వర స్వామి పాత్ర, శ్రీరామదాసు చిత్రములో పోషించిన రాముని పాత్రతో ప్రేక్షకులను అలరించాడు. ఇక రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన శివాజీ సినిమాతో విలన్ గా నటించి వావ్ అనిపించాడు. 2021లో ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారం అందుకున్నాడు సుమన్.

సంస్కృత భాషలో డిగ్రీ పట్టాపుచ్చుకున్న సుమన్ తుళు, ఇంగ్లిష్, తమిళం, తెలుగు,కన్నడ, హిందీ భాషల్లో ప్రావీణ్యుడు. ధారాళంగా మాట్లాడతాడు. ఇక వీణ, గిటార్ లను వాయించగలడు. కరాటే మాస్టర్ గా కెరీర్ ను ప్రారంభించిన సుమన్ స్నేహితుడు కిట్టు ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాడు. 1977లో నీచల్ కులంతో సిల్వర్ స్క్రీన్ పై అడుగు పెట్టాడు. తొలి సినిమాలో సుమన్ పోలీసు అధికారి పాత్ర పోషించాడు.1985 లో గుండా చట్టంకింద అరెస్ట్ అయిన సుమన్ .. తర్వాత నిరోషిగా రిలీజ్ అయ్యారు. తెలుగు సినీ , నాటక రచయిత, దర్శకుడు డి.వి.నరసరాజు మనుమరాలు శిరీషను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు అఖిలజ ప్రత్యూష కూతురు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆరిస్టుగా పలు సినిమాల్లో నటిస్తున్న సుమన్ కు టీవీ 9 పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది.

Also Read:  పన్ను కట్టని ప్రముఖ నటి.. మాజీ భర్త ఫిర్యాదు.. రూ. 330 కోట్లను జరిమాన విధించిన ప్రభుత్వం ఎక్కడంటే

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్