Prabhas: డార్లింగ్‌ లిస్ట్‌లోకి మరో సినిమా… ఆ కుర్రడైరెక్టర్ కు ప్రభాస్ మరో ఛాన్స్ ఇచ్చాడా.?

డార్లింగ్‌ ప్రభాస్ లిస్ట్‌లోకి అతి త్వరలో మరో సినిమా యాడ్‌ అవ్వబోతోంది.  ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో ట్రెండింగ్‌ టాపిక్‌ గా చక్కర్లు కొడుతుంది..

Prabhas: డార్లింగ్‌ లిస్ట్‌లోకి మరో సినిమా... ఆ కుర్రడైరెక్టర్ కు ప్రభాస్ మరో ఛాన్స్ ఇచ్చాడా.?
టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఇటీవల నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. వీరు వచ్చే ఏడాది మూడు థియేట్రికల్ చిత్రాలను విడుదల చేయనున్నారు. అంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రాధే శ్యామ్ మూవీ సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఆ తర్వాత ఏప్రిల్‏లో సలార్, ఆగస్ట్‏లో ఆదిపురుష్ సినిమాలను విడుదల చేయనున్నారు.
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 30, 2021 | 9:44 AM

Prabhas: డార్లింగ్‌ ప్రభాస్ లిస్ట్‌లోకి అతి త్వరలో మరో సినిమా యాడ్‌ అవ్వబోతోంది. ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో ట్రెండింగ్‌ టాపిక్‌ గా చక్కర్లు కొడుతుంది. ఆల్రెడీ నాలుగు సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న బాహుబలి మరో డైరెక్టర్‌కు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. ఇంతకీ డార్లింగ్‌ను మెప్పించిన ఆ డైరెక్టర్‌ ఎవరో తెలుసా.. కుర్ర డైరెక్టర్ సుజిత్. ప్రభాస్‌ మార్కెట్ స్టామినా ఏంటో నార్త్ ఆడియన్స్‌కు పర్ఫెక్ట్‌గా చూపించిన కమర్షియల్ హిట్ మూవీ సాహో. బాహుబలి తరువాత డార్లింగ్‌ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో.. అంతకు మించి చూపించిన యాక్షన్‌ డ్రామా సాహో. తెలుగు ఆడియన్స్‌కు అంతగా నచ్చకపోయినా బాలీవుడ్ ఆడియన్స్‌ను మాత్రం ఫిదా చేసింది ఈ మూవీ. అందుకే… సాహో తరువాత మరో సినిమా చేద్దామంటూ దర్శకుడు సుజీత్‌కు అప్పుడే అభయం ఇచ్చేశారు డార్లింగ్‌. ఈ క్రేజీ కాంబో రిపీట్ కోసం యువీ క్రియేషన్స్‌ బేనర్‌ కూడా సిద్ధంగా వుంది. సాహో కంప్లీటైన తరువాత ప్రభాస్‌ కటౌట్‌కు మ్యాచ్‌ అయ్యే మరో సబ్జెక్ట్‌ కోసం వర్క్ చేయటం మొదలుపెట్టారు సుజీత్. ప్రభాస్‌ రేంజ్‌కు తగ్గ సాలిడ్‌ లైన్ సెట్ ఇప్పటికి అయ్యిందట. సాహోలో డార్లింగ్‌ను మాఫియా డాన్‌లా చూపించిన సుజిత్… ఈసారి మాత్రం సూపర్‌ కాప్‌ రోల్‌లో చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

చిరంజీవి హీరోగా లూసీఫర్ రీమేక్‌ కోసం కొద్దిరోజులు వర్క్ చేసిన సుజిత్‌.. అనుకోకుండా ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో మరోసారి కెరీర్‌లో లాంగ్ గ్యాప్ వచ్చింది. ఈ టైమ్‌లో మరో హీరో కోసం వెయిట్ చేయటం కన్నా.. తనకు లైఫ్ ఇచ్చిన డార్లింగ్‌తోనే సినిమాచేయాలని ఫిక్స్ అయ్యారట సుజిత్. ఆల్రెడీ డార్లింగ్‌తో లైన్‌ ఓకే చేయించుకున్న ఈ యంగ్ మేకర్‌ ఇప్పుడు బౌండెడ్ స్క్రిప్ట్‌ రెడీ చేసే పనిలో ఉన్నారు. స్క్రిప్ట్ లాక్ అయినా డార్లింగ్ డేట్స్ మాత్రం ఇప్పట్లో దొరకటం కష్టమే. రాధేశ్యామ్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌తో పాటు మరో మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు డార్లింగ్‌. సలార్‌, ఆదిపురుష్‌ సెట్స్ మీదే ఉన్నాయి. త్వరలో ప్రాజెక్ట్-K కూడా పట్టాలెక్కుతుంది. ఈ సినిమాలు పూర్తయితేగాని సుజిత్‌కు డేట్స్ దొరికే ఛాన్స్ లేదు. మరి అప్పటివరకు సుజిత్ వెయిట్ చేస్తారా అన్నది చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

OTT Platform: ఓటీటీ వార్.. పోటీపడి మరీ స్ట్రీమింగ్ అవుతున్న ఆ హీరోల సినిమాలు..

Bigg Boss Telugu Season 5 : ఈ సారి మరింత రసవత్తరంగా సాగనున్న బిగ్ బాస్.. టాస్కుల విషయంలో తగ్గేదే లేదంట..

Anupama Parameswaran: అందానికి అసూయ తెప్పించే అనుపమ ఫోటోలు.. బ్లాక్ డ్రెస్సులో బ్యూటీ

ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం