AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ఆ మూడు సినిమాలకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆపద్బాంధవుడయ్యాడా..?

మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.  షూటింగ్ లో పాల్గొంటూ థన్ పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు..

Prabhas: ఆ మూడు సినిమాలకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆపద్బాంధవుడయ్యాడా..?
Prabhas
Rajeev Rayala
|

Updated on: Aug 30, 2021 | 9:43 AM

Share

Prabhas: మొన్నటి వరకు సైలెంట్గా  ఉన్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.  షూటింగ్లో పాల్గొంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. బయటకూడా కనిపించింది తక్కువే.. కానీ ఇప్పుడు ఎక్కడ చూసిన ప్రభాసే కనిపిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ వచ్చాక మనకు అందుబాటులో వుండరేమో అనుకున్నవాళ్లంతా.. ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకనుకుంటున్నారా.. ఇప్పుడు చిన్న సినిమాల పాలిట స్పెషల్ ప్రమోటర్‌గా మారాడు బాహుబలి ప్రభాస్. సుధీర్‌బాబు హీరోగా చేసిన శ్రీదేవి సోడా సెంటర్ కోసం ఫుల్ ప్లెడ్జ్‌డ్ ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రభాస్. తాను మల్టిపుల్ మూవీస్‌తో బిజీగా వుంటూనే.. ప్రొడ్యూసర్ విజయ్ చిల్లా కోరికను మన్నించి.. అరగంట పాటు టీమ్‌తో కనిపించారు. కట్‌చేస్తే… ఇప్పుడు థియేటర్లలో పాజిటివ్‌ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది శ్రీదేవి సోడాసెంటర్.

అంతకుముందు.. నాగ్ అశ్విన్  ప్రొడ్యూస్ చేసిన జాతిరత్నాలు సినిమాకు కూడా ప్రభాసే ఆపద్బాంధవుడయ్యాడు. జాతిరత్నాలు టీమ్‌ని ముంబైకి పిలిపించుకునిమరీ.. విష్ చేసి పంపాడు డార్లింగ్. అప్పట్లో డార్లింగ్ ఇచ్చిన ఈ జోవియల్ అప్పియరెన్స్ జాతిరత్నాలకు బాగా ప్లస్సయింది. తనకు ఫస్ట్ కమర్షియల్ హిట్ ఇచ్చిన వర్షం డైరెక్టర్ శోభన్‌ రుణం కూడా ఇలాగే తీర్చుకున్నాడు ప్రభాస్. శోభన్ తనయుడు సంతోష్ డెబ్యూ మూవీ ఏక్ మినీ కథ ట్రయిలర్‌ని తన చేతుల మీదుగానే లాంచ్ చేసి.. గో ఎహెడ్ చెప్పారు. ఇలా ఆబ్లిగేషన్స్‌నేవీ వదిలిపెట్టకుండా తన-మన తేడా లేకుండా అన్ని సినిమాల్నీ ప్రమోట్ చేస్తూ.. మీడియాలో కనిపిస్తున్నాడు ఈ ఆదిపురుష్. ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాను కంప్లీట్ చేసి సలార్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అలాగే ఈ సినిమాతోపాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్లోనూ జాయిన్ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలతోపాటు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. త్వరలోనే ఆ సినిమా సెట్లోను అడుగు పెట్టనున్నాడు ప్రభాస్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

OTT Platform: ఓటీటీ వార్.. పోటీపడి మరీ స్ట్రీమింగ్ అవుతున్న ఆ హీరోల సినిమాలు..

Bigg Boss Telugu Season 5 : ఈ సారి మరింత రసవత్తరంగా సాగనున్న బిగ్ బాస్.. టాస్కుల విషయంలో తగ్గేదే లేదంట..

Anupama Parameswaran: అందానికి అసూయ తెప్పించే అనుపమ ఫోటోలు.. బ్లాక్ డ్రెస్సులో బ్యూటీ

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్