AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: హుషారైన మాటలతో.. చలాకీ తనంతో హౌస్‌లో హడావిడి చేసేస్తున్న భామ..

RJ Kajal: బిగ్ బాస్ సీజన్ 5 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు సీజన్ 5 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న గేమ్ షో ఏదైనా ఉంది అంటే టక్కున గుర్తొచ్చే పేరు బిగ్ బాస్.

Bigg Boss 5 Telugu: హుషారైన మాటలతో.. చలాకీ తనంతో హౌస్‌లో హడావిడి చేసేస్తున్న భామ..
17వ కంటెస్టెంట్‌గా ఆర్జే కాజల్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓ వీడియోతో తనను తాను పరిచయం చేసుకున్న కాజల్‌కు వెల్కమ్ చెప్పాడు నాగ్.
Rajeev Rayala
|

Updated on: Sep 12, 2021 | 4:58 PM

Share

బిగ్ బాస్ సీజన్ 5 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు సీజన్ 5 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న గేమ్ షో ఏదైనా ఉంది అంటే టక్కున గుర్తొచ్చే పేరు బిగ్ బాస్. ఈ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు మరింత జోష్‌తో సీజన్ 5 రెడీ అయ్యింది. సెప్టెంబర్ 5 న బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్‌గా మొదలైంది. బిగ్ బాస్ సీజన్ 1కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, సీజన్ 2 కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌లుగా వ్యవహరించారు. ఆ తర్వాత బిగ్ బాస్ బాధ్యతను కింగ్ తన భుజాలపైకి ఎత్తుకున్నారు. సీజన్ 3, సీజన్ 4 లను విజయవంతంగా నడిపించిన నాగ్. ఇప్పుడు ఐదో సీజన్‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈసారి హౌస్‌లోకి 19మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. షన్ముఖ్ -మానస్-ప్రియాంక సింగ్ – 7 ఆర్ట్స్ సరయు- సన్నీ-ఉమాదేవి-శ్రీరామచంద్ర-సిరి హనుమంతు-ప్రియ-శ్వేత వర్మ-లోబో-లహరి-జశ్వంత్-యాంకర్ రవి-నటరాజ్-కాజల్-విశ్వ-ఆనీ మాస్టర్-హమీద కంటెస్టెంట్స్‌గా ఉన్నారు. వీరిలో దాదాపు అందరూ ప్రేక్షకులకు తెలిసిన వాళ్లే.. వీరిలో ఆర్జే కాజల్ చాలా హుషారుగా కనిపించింది.

ఆర్జేగా, యూట్యూబర్‌‌గా, వీడియో జాకీగా సింగర్‌‌గా, యాంకర్‌‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా కాజల్ సుపరిచితురాలే.. ప్రేమ వివాహం చేసుకుని ఈ అమ్మడు చాలానే ఆర్థిక కష్టాలను అనుభవించింది. ఉపాధి చాలని ఆకలి రోజులు ఈమె జీవితంలో చాలానే ఉన్నాయి. పదిహేడో కంటెస్టెంట్‌గా ఆర్జే కాజల్ ఎంట్రీ ఇచ్చింది. ఆర్జే కాజల్ తన రేడియా జాకీ పని తనాన్ని బిగ్ బాస్ వేదిక పైన వివరించింది. తన గతం గురించి, వివాహా బంధం గురించి చెప్పుకొచ్చింది. హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే తమ మాటలతో చలాకీ తనంతో హడావిడి చేసింది కాజల్. మరి ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్‌లో అలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kangana Ranaut Photos: ‘తలైవి’గా వస్తున్న ‘కంగనా రనౌత్’.. చీరకట్టులో మెరుపులు..

Bigg Boss5: బిగ్ బాస్ కలర్ ఫుల్ స్టార్ట్..కంటతడి పెట్టించిన నటరాజ్ మాస్టర్..ఎమోషనల్ ఎంట్రీ!

Pawan Kalyan- Mogulaiah photos: మరోసారి చాటుకున్న రీల్ భీమ్లా నాయక్ మంచి మనసు.. మొగులయ్యకు ఆర్థిక సాయం ఫొటోస్..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!