Bigg Boss5: బిగ్ బాస్ కలర్ ఫుల్ స్టార్ట్..కంటతడి పెట్టించిన నటరాజ్ మాస్టర్..ఎమోషనల్ ఎంట్రీ!

KVD Varma

KVD Varma |

Updated on: Sep 05, 2021 | 10:09 PM

తెలుగు బుల్లితెరపై సంచలన రియాల్టీ షో బిగ్ బాస్ అదిరిపోయేలా ప్రారంభం అయింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా సూపర్ సెట్ లో కంటెస్టెంట్ల ఎంట్రీ కలర్ ఫుల్ గా సాగుతోంది.

Bigg Boss5: బిగ్ బాస్ కలర్ ఫుల్ స్టార్ట్..కంటతడి పెట్టించిన నటరాజ్ మాస్టర్..ఎమోషనల్ ఎంట్రీ!
Bigg Boss 5 Nataraj Master

Follow us on

Bigg Boss5: తెలుగు బుల్లితెరపై సంచలన రియాల్టీ షో బిగ్ బాస్ అదిరిపోయేలా ప్రారంభం అయింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా సూపర్ సెట్ లో కంటెస్టెంట్ల ఎంట్రీ కలర్ ఫుల్ గా సాగుతోంది. ఒక్కో కంటెస్టెంట్ ఒక్కో కథతో ఎంట్రీ ఇస్తున్నారు. బిగ్ బాస్ అంటేనే నవరసాల సమ్మేళనం కదా. అన్ని రసాలు ఎంట్రీలోనే కనిపించేశాయి. అయితే, 12వ ఎంట్రీగా డ్యాన్స్ మాస్టర్ నటరాజ్ ఎంట్రీ ఇచ్చారు. ఈయన ఎంట్రీ కోసం చూపించిన ఎవీతోనే అందరినీ ఎమోషన్ లోకి నెట్టేశారు.

తన జీవితంలో ప్రేమ పెళ్లి గురించి ఆ ఎవీలో చెప్పుకొచ్చారు నటరాజ్ మాస్టర్. తాను హన్మకొండలోని వేయిస్తంభాల గుడిలో తన ప్రేమ ప్రపోజల్ గాజులు తొడిగి చేశానని చెప్పారు. ఇక తరువాత నాగార్జున దగ్గరకు వచ్చిన నటరాజ్ తన జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు చెప్పుకొచ్చారు. తాను మొదట్లో ఇలా ఉండేవాడిని కాదనీ.. కృష్ణుడి టైప్ లో తిరిగేవాదిననీ తన సీక్రెట్ రివీల్ చేశారు. అయితే, తనను తన భార్య ప్రేమ మార్చేసిందని అన్నారు. చిన్నప్పుడే హీరోగా మారాలని అనుకుని ఇండస్ట్రీకి వచ్చిన తాను చివరికి డ్యాన్స్ మాస్టర్ అయ్యానని చెప్పిన నటరాజ్ తాను ఎప్పుడూ ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడిని అని చెప్పారు. ఆ సమయంలో తనను ఒకమ్మాయి ఏడేళ్ళ పాటు ప్రేమిస్తూ ఉందని చెప్పారు. ఆ అమ్మాయి ప్రేమను తెలుసుకోవడానికి ఏడేళ్ళు పట్టిందని అన్నారు. తరువాత తాను ఆ అమ్మాయి ప్రేమను అర్ధం చేసుకుని ప్రపోజ్ చేశానని తెలిపారు నటరాజ్ మాస్టర్. ఇప్పుడు తనకు సర్వస్వంతన భార్యే అని చెప్పారు. దీంతో నాగార్జున కూడా ఎమోషన్ అయి.. నీకో సర్ప్రైజ్ అన్నారు.

స్టేజ్ మీదకు నటరాజ్ మాస్టర్ భార్యను పిలిపించారు. అయితే, ఆమె గర్భవతి. తనకు ఏడో నెల అని ఆమె చెప్పింది. నాగార్జున మరి ఇపుడు ఈయన బిగ్ బాస్ లోకి వస్తున్నారు ఎలా అని అడిగారు. దానికి ఆమె..”ఇది ఆయన డ్రీం. ఇది ఎప్పుడూ వచ్చే చాన్స్ కాదు. నేను అతని కల నెరవేరడానికి ధైర్యంగా బయట ఉంటాను. బిగ్ బాస్ పూర్తయి.. ఆయన గెలిచి వచ్చేసరికి నా బిడ్డతో కలిసి స్వాగతం చెబుతాను.” అని చెప్పింది. ఇక మరో వైపు నటరాజ్ మాట్లాడుతూ ”బాబు పుట్టినప్పుడు నేను అక్కడే ఉండాలి.. బాబును ఎత్తుకోవాలి అని అనుకున్నాను.. నా భార్య మాత్రం నన్ను ఫోర్స్ చేసి ఇక్కడకు పంపించింది..” అంటూ నటరాజ్ మాస్టర్ తన పర్సనల్ విషయాలను షేర్ చేశారు. ” ఇప్పుడిప్పుడే ఆమె కడుపులో బాబు కొద్దిగా కదులుతున్నాడు. పూర్తిగా కదిలే క్షణాలను చూడటానికి నేను దూరంగా ఉంటాను.” అంటూ తన భార్య గర్భాన్ని ముద్దాడి అందరినీ కంటతడిపెట్టించేశారు.

Also Read: BiggBoss5: మనం బిగ్‌బాస్ హడావుడిలో ఉన్నాం..కానీ, అక్కడ అంతకు మించి అంటున్నాడు హీరో అర్జున్..ఎందుకో తెలుసా?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu