BiggBoss5: మనం బిగ్‌బాస్ హడావుడిలో ఉన్నాం..కానీ, అక్కడ అంతకు మించి అంటున్నాడు హీరో అర్జున్..ఎందుకో తెలుసా?

KVD Varma

KVD Varma |

Updated on: Sep 05, 2021 | 6:18 PM

మన బుల్లితెరమీద రియాల్టీ షోల హంగామా చాలా ఎక్కువ. దాదాపుగా ప్రతీ ఛానల్ లోనూ ఒకటి లేదా రెండు రియాల్టీ షోలు నడుస్తూనే ఉంటాయి. అయితే, ఈ రియాల్టీ షోలన్నీ ఒక ఎత్తయితే బిగ్‌బాస్ షో ఒక ఎత్తు.

BiggBoss5: మనం బిగ్‌బాస్ హడావుడిలో ఉన్నాం..కానీ, అక్కడ అంతకు మించి అంటున్నాడు హీరో అర్జున్..ఎందుకో తెలుసా?
Survivor

Follow us on

Survivor: మన బుల్లితెరమీద రియాల్టీ షోల హంగామా చాలా ఎక్కువ. దాదాపుగా ప్రతీ ఛానల్ లోనూ ఒకటి లేదా రెండు రియాల్టీ షోలు నడుస్తూనే ఉంటాయి. అయితే, ఈ రియాల్టీ షోలన్నీ ఒక ఎత్తయితే బిగ్‌బాస్ షో ఒక ఎత్తు.ఇది దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లోనూ వెలువడుతోంది. అన్ని చోట్లా మంచి టీఆర్పీ రేటింగ్స్ మాత్రమే కాకుండా.. ఈ షోలో పాల్గొన్న వారి పాప్యులారిటీ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తిచేసుకున్న బిగ్‌బాస్ ఇప్పుడు ఐదో సీజన్ లోకి అడుగుపెట్టింది. అసలు ఈ బిగ్‌బాస్ ఎందుకు ఇంతగా అందరినీ ఆకట్టుకుంది అనేదానికి రకరకాలుగా సమాధానం వస్తుంది. ఎవరు ఏ రకంగా చెప్పుకున్నా సరే.. ఒక ఇంటిలో ఒకరికి ఒకరు పరిచయం లేని వ్యక్తులు వందరోజుల పాటు బయట ప్రపంచం తెలియకుండా జీవించడం అనే కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ వందరోజుల పాటు ఆ ఇంటిలో ఉండే వారిని ఊరికే ఉండనివ్వకుండా.. ఏవో ఆటలు.. టాస్క్ లు.. మధ్యలో పండగలూ.. పబ్బాలూ వచ్చినపుడు స్పెషల్ గెస్ట్ ల హడావుడి.. ఇలా అన్ని అంశాలూ బిగ్‌బాస్ షో రక్తికట్టడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇక రియాల్టీ షోలలో ఇంతకు మించి ఏముంటుంది చెప్పండి.

అబ్బే.. ఇంకా కావాలి అనేవారూ ఉంటారు. ఉన్నారు. బిగ్‌బాస్ చూసీ చూసీ విసుగు వచ్చేసింది అనే ప్రేక్షకులూ తక్కువ కాదు. బిగ్‌బాస్ 4 సీజన్ ప్రారంభంలో అసలు షో మీద వచ్చిన విమర్శలు మామూలుగా లేవు. మొత్తమ్మీద క్రమేపీ షో ప్రేక్షకులకు దగ్గరైంది. ఈసారి కూడా షో ప్రారంభం ముందు ఇంతకు ముందు ఉన్నంత హడావుడి కనిపించలేదు. ఇక ఇప్పుడే ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ షో ఎలా సాగుతుంది అనేది చెప్పుకునే సమయమూ ఇది కాదు. కానీ, బిగ్‌బాస్ మజాను ఇష్టపడే వారు మాత్రం టీవీలకు అతుక్కుపోతారనడంలో సందేహం లేదు. అయితే, బిగ్‌బాస్ ను మించి రియాల్టీ కావాలంటే ఏం చేయాలని కొందరు ఆలోచించారు. వినోదరంగంలో పోటీకి తగ్గ క్రియేటివిటీ ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంటుంది. అలాగే బిగ్‌బాస్ ను మించిన్ రియాల్టీ షో కోసం సంవత్సరం క్రితమే బీజాలు పడ్డాయి. అయితే, అది తెలుగులో కాదు లెండి. తమిళంలో. తమిళనాట జీ తమిళ్ టీవీ ఓ సరికొత్త రియాల్టీ షో ప్లాన్ చేశారు అప్పట్లో.. అసలు ఇది ఈపాటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేసేది కానీ, కరోనా దానిని ఆపింది. బిగ్‌బాస్ 5 ప్రారంభం అవుతున్న సందర్భంగా.. ఈ సరికొత్త రియాల్టీ షో గురించి కొన్ని విశేషాలు చెప్పుకుంటే బావుంటుంది కదూ..

తమిళంలో జీ టీవీ ఈ షో కోసం ప్లాన్ చేసింది. దానిపేరు ‘సర్వైవర్’. బిగ్‌బాస్ అంటే.. ఓ ఇల్లు.. పదహారు మంది కంటెస్టంట్స్ చుట్టూ కెమెరాలు.. వారం వారం వారిని పలకరించే హోస్ట్ ఇంతే. కానీ ఈ సర్వైవర్ అలా కాదు. ఇది ఏకంగా ఓపెన్ ప్లేస్ లో ప్లాన్ చేశారు. ఎక్కడో తెలిస్తే వామ్మో అంటారు. ఆఫ్రికా తీరంలో ఉన్న దీవుల్లో ఉన్న జాంజీబార్ దీవులు చాలా ప్రధానమైనది. ఇది ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందిన టూరిజం స్పాట్. ఇక్కడ ఈ సర్వైవర్ మొదలు పెడుతున్నారు. ఇది కూడా బిగ్‌బాస్ లానే ఉండే కాన్సెప్ట్. కాకపోతే.. ఇక్కడ అడవిలో కంటెస్టంట్స్ ఉండాల్సి ఉంటుంది. స్టూడియో మధ్యలో ఓ సెట్టింగ్ లాంటి ఇల్లు బిగ్ బాస్. కానీ, అడవిలో ఉంటూ అక్కడ నుంచి బయటపడటం ఈ సర్వైవర్. థ్రిల్లింగ్ గా ఉంది కదూ.

ఇక ఈ సర్వైవర్ కు హోస్ట్ మనందరికీ తెలిసిన హీరోయే. అర్జున్! అవును అర్జున్ ఈ థ్రిల్లింగ్ రియాల్టీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో పాల్గొంటున్న వారెవరనేది పూర్తిగా ఇంకా తెలియలేదు కానీ, తమిళంలో విడుదల చేసిన ప్రోమోల్లో మాత్రం నటులు శివ కార్తికేయ, ఆర్య కనిపిస్తున్నారు. ఇక అక్కడ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను బట్టి చూస్తే..శ్రీరెడ్డి, వనిత ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. దీవుల్లో.. అడవుల్లో ఇక వీరు చేసే రచ్చకి ఆడియన్స్ అడిరిపోవడం ఖాయం కదూ. ఈ సర్వైవర్ రియాల్టీ షో ఈ నెలలోనే 12వ తేదీ నుంచి ప్రసారం కాబోతోంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమోలు.. ట్రైలర్లు అక్కడ రికార్డులు బద్దలు కొట్టేస్తున్నాయి. అందులో ఓ ట్రైలర్ మీరూ చూసేయండి ఇక్కడ.

 

Also Read: Bigg Boss Telugu 5 Launch Live: మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 సందడి.. గ్రాండ్ ఎంట్రీకి రెడీ అయిన కంటెస్టెంట్స్..

Thalaivii Pre-Release Event: దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ తలైవి ప్రీ రిలీజ్ ఈవెంట్.. (లైవ్ వీడియో).

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu