Bigg Boss Telugu 5 Launch Highlights: మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 సందడి.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది వీళ్ళే ..

Rajeev Rayala

|

Updated on: Sep 05, 2021 | 10:23 PM

BB5 Grand Opening Highlights : తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ వచ్చేసింది. నాలుగు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ గేమ్ షో ఇప్పుడు సీజన్ 5తో సందడి చేయడానికి మన ముందుకు వచ్చేసింది.

Bigg Boss Telugu 5 Launch Highlights: మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 సందడి.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది వీళ్ళే ..
Bigg Boss

బిగ్‏బాస్ 5 తెలుగు: తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ వచ్చేసింది. నాలుగు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ గేమ్ షో ఇప్పుడు సీజన్ 5తో సందడి చేయడానికి మన ముందుకు వచ్చేసింది. ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. షో గ్రాండ్ ప్రీమియర్‌‌కు ముందుగానే ఈ షోలో పాల్గొనే టాప్‌ కంటెస్టెంట్ల పేర్లు బయటికి వచ్చాయి. బయటికి రావడమే కాదు.. నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజుల నుంచి తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్‌ 5 మీదే అందరి చూపు… వీళ్లు వెళుతున్నారు… కాదు వాళ్లు వెళుతున్నారంటూ ఎన్నో న్యూసులు. అయితే వీటన్నింటికి చెక్ పెట్టేసింది బిగ్ బిస్‌ టీం…. కంటెస్టెంట్స్‌ లిస్టును రివీల్‌ చేయకుండానే గ్రాండ్ ప్రీమియర్ డేట్ సెప్టెంబర్‌ 5 అంటూ అనౌన్స్‌ చేసింది. బిగ్ బాస్‌ గ్రాండ్ ప్రీమియర్ డేట్‌ను అనౌన్స్‌చేయడంతో.. ఇప్పుడు అందరి ఆసక్తి కంటెస్టెంట్ల పై పడింది. ఇప్పటి వరకు తాజ్‌ డెక్కన్‌, మారియట్‌ హోటల్లలో క్యారెంటైన్‌‌లో ఉన్న కంటెస్టెంట్లను.. తాజాగా బిగ్ బాస్‌ సెట్లోకి తరలించారు బిగ్ బాస్‌ నిర్వాహకులు. ఇప్పటివరకు హౌస్ లోకి వచ్చింది.. సన్నీ- లోబో- సిరి హనుమంత్-లహరి-ప్రియా -ప్రియాంక సింగ్- షణ్ముఖ్ -జెస్సీ-శ్రీరామ్ చంద్ర -యాని మాస్టర్- సరయు-హమీద-ఉమాదేవి-మానస్- విశ్వ-నటరాజ్ మాస్టర్- ఆర్జే కాజల్ వచ్చారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Sep 2021 10:19 PM (IST)

    బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ ముగిసింది. సింగిల్ బెడ్ ఎవరికి వచ్చిందంటే..

    నాగార్జున 19మందిని హౌస్‌లో ఉంది తాళం వేశాడు నాగ్. ఫైనల్‌గా అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పి. మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. నాలుగు టాస్క్‌‌‌లలో గెలిచిన నలుగురికి పోటీపెట్టడు బిగ్ బాస్. నాలుగు బాక్స్‌లలో దాంట్లో తాళం ఉంచి అన్నీ బాక్స్‌‌లను ఓపెన్ చేయమన్నాడు. ఈ టాస్క్‌లో విశ్వ కు సింగిల్ బెడ్ వచ్చింది.

  • 05 Sep 2021 10:11 PM (IST)

    మిగిలిన నలుగురికి టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్..

    సింగిల్ బెడ్ కోసం మరో టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్. రోల్ బేబీ రోల్ అనే పేరు పెట్టాడు బిగ్ బాస్. నలుగురితో డైస్ వేయించి ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే వారే విన్ అని చెప్పాడు బిగ్ బాస్. మొదటగా మానస్ డైస్ వేసాడు. ఆతర్వాత కాజల్ డైస్ వేసింది. ఆతర్వాత శ్వేతా వర్మ. చివరిగా రవి డైస్ వేసాడు. ఈ టాస్క్ లో మానస్ విన్ అయ్యాడు.

  • 05 Sep 2021 09:59 PM (IST)

    రవి ఎంట్రీతో హౌస్‌లో సరికొత్త ఎనర్జీ..

    రవి ఎంట్రీతో హౌస్‌లో సరికొత్త ఎనర్జీ వచ్చింది. అందరూ రవిని ఆప్యాయంగా పలకరించారు.  రవి కూడా అందరిని సరదాగా పలకరించాడు.

  • 05 Sep 2021 09:55 PM (IST)

    రియల్‌గా ఉండాలనుకుంటున్నా: రవి

    బిగ్ బాస్‌లో రియల్ రవిగా ఉండాలని అనుకుంటున్నా అని తెలిపాడు రవి. రవికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు నాగార్జున. రవి ముద్దుల కూతురితో అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పించాడు నాగ్. అలాగే తన కూతురు ఆడుకునే ఓ బొమ్మను కూడా ఇచ్చాడు నాగ్.

  • 05 Sep 2021 09:50 PM (IST)

    19వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఎవరంటే..

    బిగ్ బాస్ 5 లో 19వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు యాంకర్ రవి. పలు టీవీషోలతో రవి అందరిని ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే..Ravi

    Ravi

  • 05 Sep 2021 09:41 PM (IST)

    18వ కంటెస్టెంట్‌గా వచ్చింది ఎవరంటే..

    బిగ్ బాస్ హౌస్‌లోకి వరుసగా సభ్యులు వస్తూన్నారు. ఇక 18వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది శ్వేత వర్మ. బిగ్ బాస్ వేదిక పై బ్యూటీఫుల్ డాన్స్‌తో ఆకట్టుకుంది శ్వేత వర్మ.Swetha Varma

    Swetha Varma

  • 05 Sep 2021 09:34 PM (IST)

    అద్భుతంగా పాటపాడిన కాజల్

    బిగ్ బాస్ హౌస్ వేదిక పై ఏస్ జానకిగారి పాట పాడి అలరించింది కాజల్. అచ్చం జానకిగారిలానే పాడి ఆకట్టుకుంది కాజల్.

  • 05 Sep 2021 09:28 PM (IST)

    బిగ్ బాస్ హౌస్‌లోకి మరో కంటెస్టెంట్..

    ఇప్పటివరకు 16 మంది హౌస్‌లోకి వచ్చారు. తాజాగా 17వ కంటెస్టెంట్‌గా ఆర్జే కాజల్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓ వీడియోతో తనను తాను పరిచయం చేసుకున్న కాజల్‌కు వెల్కమ్ చెప్పాడు నాగ్.Rj Kajal

    Rj Kajal

  • 05 Sep 2021 09:20 PM (IST)

    బిగ్ బాస్‌లో 16 కంటెంట్ ఎవరంటే..

    పలు సినిమాలతో ఆకట్టుకున్న మానస్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మానస్ 16వ కంటెస్టెంట్. సూపర్ ఎనర్జిటిక్ పవన్ కళ్యాణ్ సాంగ్స్‌తో ఎంట్రీ ఇచ్చాడు మానస్.Maanas

    Maanas

  • 05 Sep 2021 09:18 PM (IST)

    ముచ్చటగా మూడో టాస్క్ ఇచ్చాడు నాగ్..

    చివరిగా వచ్చిన 5గురికి ఈ టాస్క్ ఇచ్చాడు నాగ్. ఎవరైతే ఐదు కుల్ఫీలు తింటారో వాళ్ళే విన్ అవుతారని చెప్పాడు నాగ్. దాంతో అందరు పోటీపడి మరీ కుల్ఫీలను తిన్నారు. ఈ టాస్క్ లో విశ్వ విన్ అయ్యాడు.

  • 05 Sep 2021 09:07 PM (IST)

    15వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వచింది ఎవరంటే..

    ఉమా దేవి.. పలు సినిమాల్లో, సీరియల్స్‌లో నటించి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు 15వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు ఉమా దేవి.Uma

    Uma

  • 05 Sep 2021 09:01 PM (IST)

    14వ కంటెస్టెంట్‌గా వచ్చాడు విశ్వ..

    బిగ్ బాస్ హౌస్‌లోకి 14వ కంటెస్టెంట్‌గా వచ్చాడు సీరియల్ నటుడు విశ్వా. తన లైఫ్ గురించి ఓ వీడియో ద్వారా తెలుపుతూ విశ్వకు వెల్కమ్ చెప్పాడు బిగ్ బాస్.Vishwa

    Vishwa

  • 05 Sep 2021 08:48 PM (IST)

    హౌస్‌లోకి 13వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ..

    బిగ్ బాస్ హౌస్‌లోకి 13వ కంటెస్టెంట్‌గా వచ్చింది సరయు. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి సరయు సుపరిచితురాలే..Sarayu

  • 05 Sep 2021 08:43 PM (IST)

    నాటరాజ్‌కు సూపర్ సర్‌ప్రైజ్..

    నాటరాజ్‌కు సూపర్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు నాగార్జున. గర్భిణిగా ఉన్న నటరాజ్ భార్యను బిగ్ బాస్ హౌస్ వేదికమీదకు తీసుకు వచ్చాడు నాగ్. దాంతో ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు.

  • 05 Sep 2021 08:39 PM (IST)

    హౌస్‌మెట్ నెంబర్ 12 ఎవరంటే..

    బిగ్ బాస్ హౌస్‌లోకి 12వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు నటరాజ్ మాస్టర్. పలు టీవీ ఈవెంట్స్‌లు చేసి ఫెమస్ అయ్యాడు నటరాజ్. సూపర్ ఎనర్జిటిక్ డాన్స్ పర్ఫామెన్స్‌తో ఎంట్రీ ఇచ్చాడు నటరాజ్ మాస్టర్. Natraj

    Natraj

  • 05 Sep 2021 08:28 PM (IST)

    11వ కంటెస్టెంట్ ఎవరో తెలుసా..

    అదిరిపోయే డాన్స్‌తో బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చింది హమీదా..

  • 05 Sep 2021 08:25 PM (IST)

    మరో టాస్క్ ఇచ్చిన నాగార్జున..

    పకడో పకడో అనే టాస్క్ ఇచ్చాడు నాగార్జున. నాలుగు జంతువులను నాలుగు రూమ్‌లో దాచి పెట్టి.. ఏ జంతువు శబ్దం వస్తే ఆ జతువును వెతికి పట్టుకోవాలని టాస్క్ ఇచ్చాడు బాస్. ఈ టాస్క్‌లో మొదటి రౌండ్ లో షణ్ముఖ్ , జెస్సీ ఓడిపోయారు. రెండో రౌండ్‌లో ప్రియాంక విన్ అయ్యింది.

  • 05 Sep 2021 08:09 PM (IST)

    పదోవ కంటెస్టెంట్‌ బిగ్ బాస్‌కి ఎంట్రీ..

    10వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు షణ్ముఖ్ జస్వంత్. అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు షణ్ముఖ్. షణ్ముఖ్ యూట్యూబర్‌గా అందరికి పరిచయమే.. Shanmukh Jaswanth

    Shanmukh Jaswanth

  • 05 Sep 2021 08:02 PM (IST)

    ఆకట్టుకున్న ప్రియాంక సింగ్ వీడియో..

    ప్రియాంక సింగ్ అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఆమె గురించి ఓ వీడియో ద్వారా వివరించారు బిగ్ బాస్ యాజమాన్యం.

  • 05 Sep 2021 07:59 PM (IST)

    బిగ్ బాస్ హౌస్‌లోకి 9వ కంటెస్టెంట్ ఎంట్రీ..

    బిగ్ బాస్ హౌస్‌లోకి హౌస్ మేట్స్ ఒకొక్కరిగా వస్తున్నారు. ఇప్పటికే ఎనిమిదిమంది సభ్యులు రాగా.. తాజాగా జబర్ధస్ ప్రియాంక సింగ్ ఎంట్రీ ఇచ్చింది.Priyanka Singh 1

    Priyanka Singh

  • 05 Sep 2021 07:51 PM (IST)

    హౌస్‌మెట్ 8గా ఎంట్రీ ఇచ్చాడు మోడల్ జేసీ

    బిగ్ బాస్ జెస్సీ ఎనిమిదో కంటెస్టెంట్‌గా వచ్చాడు మోడల్ జేసీ.Jassi

  • 05 Sep 2021 07:46 PM (IST)

    ప్రియాకు సర్‌ప్రైజ్ ఇచ్చిన నాగార్జున..

    ప్రియాకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడు నాగ్. ప్రియా కొడుకుతో ఓ వీడియో చేయించి ప్లే చేశారు. ప్రియ విన్ అవ్వాలని ఆమె కొడుకు కోరుకున్నాడు.

  • 05 Sep 2021 07:40 PM (IST)

    బిగ్ బాస్ హౌస్‌లో 7 కంటెస్టెంట్‌గా..

    7 కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది నటి ప్రియా. ప్రియా పలు సినిమాలు, సీరియల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన గురించి ఓ వీడియో ద్వారా వివరించింది ప్రియా..Priya

    Priya

  • 05 Sep 2021 07:27 PM (IST)

    ఆరో కంటెస్టెంట్‌గా లోబో..

    డిఫరెంట్ లుక్‌తో ఆకట్టుకునే లోబో ఆరో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తన లైఫ్ గురించి వీడియో ద్వారా చెప్పాడు లోబో.Lobho

    Lobho

  • 05 Sep 2021 07:25 PM (IST)

    అప్పుడే టాస్క్‌లు మొదలు పెట్టిన బిగ్ బాస్.

    కంటెస్టెంట్స్‌కు సెమీ టాస్క్ ఇచ్చాడు నాగ్. లహరి ఒక దండ ఇచ్చి ఎవరో ఒకరి మేడలో వేయాలని చెప్పాడు నాగ్. లహరి- సిరి వెంటపడింది. లహరి ఎవ్వరి మెడలోని వెయ్యలేక పోయింది. దాంతో సన్నీకి దందా ఇచ్చాడు బిగ్ బాస్. శ్రీ రామ్‌ను సన్నీ ముట్టుకోవడంతో అతనుఓడిపోయాడు. ఆతర్వాత దండ సిరి చేతికి ఇచ్చాడు. సిరి కూడా దండ వేయలేక పోయింది. ఆతర్వాత మాలను యాని మాస్టర్‌‌కు ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో సన్నీ విన్ అయ్యాడు.

  • 05 Sep 2021 07:14 PM (IST)

    యానికి వెల్కమ్ చెప్పిన హౌస్ మేట్స్..

    యాని మాస్టర్ భర్త , కొడుకుకు సంబంధించిన వీడియో చూపించి సర్‌ప్రైజ్ చేశాడు నాగ్. ఆ తర్వాత యానికి వెల్కమ్ చెప్పారు హౌస్ మేట్స్..

  • 05 Sep 2021 07:08 PM (IST)

    ఐదో కంటెస్టెంట్ ఎవరో తెలుసా..?

    బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చేసింది యాని మాస్టర్.. కొరియోగ్రాఫర్‌గా చాలా సినిమాల్లో చేసింది యాని. తన గురించి వీడియో ద్వారా చెప్పింది. 5 వ కాటెస్టెంట్‌గా యాని ఎంట్రీ ఇచ్చింది. ఈ సారి బిగ్ బాస్‌లో అమ్మాయి విన్ అవ్వాలని చెప్పింది యాని మాస్టర్. ఆ తర్వాత అందమైన డాన్స్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది.Aani

    Aani

  • 05 Sep 2021 07:02 PM (IST)

    శ్రీరామ్‌కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన నాగ్..

    శ్రీరామ్‌కు గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు నాగ్. బిగ్ బాస్ హౌస్ ద్వారా మరో సారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతానని అనుకుంటున్నానని చెప్పాడు శ్రీరామ్. నాగ్ కోసం గీతాంజలి సినిమానుంచి అందమైన పాటను పాడాడు శ్రీరామ్.

  • 05 Sep 2021 06:57 PM (IST)

    నాలుగో కంటెస్టెంట్ హౌస్‌లోకి ఎంట్రీ..

    నాలుగో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సింగర్ శ్రీరామ్ చంద్ర. అందమైన మెలోడీ పాటలు పాడుతూ ఆకట్టుకున్నాడు శ్రీరామ్.Shriraam

    Shriraam

  • 05 Sep 2021 06:55 PM (IST)

    నాగ్‌కు రేర్ గిఫ్ట్ ఇచ్చిన లహరి శేరి

    లహరికి వెల్కమ్ చెప్పాడు నాగ్. నాగ్‌కు బ్లూ కలర్ రోజ్ ఇచ్చింది లహరి. చూడటానికి సౌందర్య లహరిలా ఉన్నావంటూ పొగిడిన నాగ్ .

  • 05 Sep 2021 06:50 PM (IST)

    మూడు కంటెస్టెంట్ గా లహరి శేరి.

    మూడు కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది నటి లహరి శేరి. తన లైఫ్ ఎలా ఉంటుందో.. ఎలా ఉండాలనుకుంటుందో ఓ వీడియో ద్వారా చూపించారు.Lahari

  • 05 Sep 2021 06:44 PM (IST)

    సన్నీకి బిగ్ బాస్ హౌస్ చూపించింది సిరి..

    సన్నీకి బిగ్ బాస్ హౌస్ మొత్తం చూపించింది సిరి. హౌస్‌లో ఏది ఎక్కడ ఉన్నాయో చెప్పింది.

  • 05 Sep 2021 06:40 PM (IST)

    సన్నీకి వెల్కమ్ చెప్పిన నాగ్..

    సన్నీకి వెల్కమ్ చెప్పాడు నాగ్. సన్నీకి ఎలాంటి అమ్మాయి కావాలని అడిగిన నాగ్.. తెలుగమ్మాయిలు అందరు బాగుంటారు. వాళ్ళు తనకు నచ్చుతారని సమాధానం చెప్పాడు సన్నీ. నచ్చిన అమ్మాయి బొమ్మ గీసి చూపించాలన్నడు నాగ్. తనకు వచ్చినట్టు గీశాడు సన్నీ.

  • 05 Sep 2021 06:36 PM (IST)

    సెకండ్ కంటెస్టెంట్ ఎవరంటే..

    బిగ్ బాస్ హౌస్‌లోకి సెకండ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు సీరియల్ యాక్టర్, వీజే సన్నీ.. సరైనోడు మూవీ సాంగ్‌కు అదిరిపోయే డాన్స్‌తో ఆకట్టుకున్నాడు సన్నీ.Sunny

    Sunny

  • 05 Sep 2021 06:33 PM (IST)

    కుడి కాలు పెట్టి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది సిరి.

    హౌస్‌లో అడుగడుగు చూస్తూ.. ఆనందం వ్యక్తం చేసింది సిరి. బిగ్ బాస్ హౌస్ చాలా బాగుందని.. తనకు చాలా నచ్చిందని చెప్పుకొచ్చింది సిరి.

  • 05 Sep 2021 06:30 PM (IST)

    నాగార్జునను చూసి ఎగ్జైట్ అయిన సిరి

    ఫస్ట్ టైం లైవ్‌లో నాగార్జునను చూసి ఎగ్జైట్ అయ్యింది సిరి. ఒక్క డైలాగ్‌ను ఇచ్చి నవరసాల్లో ఏవైనా ఐదు రసాల్లో చెప్పమని చెప్పాడు నాగ్. సిరి కూడా డైలాగ్‌ను అద్భుతంగా చెప్పి ఆకట్టుకుంది. ప్రేక్షకులకు బెస్ట్ ఎంటర్టైనమెంట్ ఇస్తానంది సిరి.

  • 05 Sep 2021 06:25 PM (IST)

    బిగ్ బాస్ 5 ఫస్ట్ కంటెస్టెంట్ ఎంట్రీ

    ఫస్ట్ కంటెస్టెంట్‌గా సీరియల్ నటి సిరి హనుమంత్ ఎంట్రీ ఇచ్చింది. మంచి మాస్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చింది సిరి.Siri

    Siri

  • 05 Sep 2021 06:18 PM (IST)

    బిగ్ బాస్ హౌస్ మొత్తం తిప్పి చూపించిన నాగ్

    బిగ్ బాస్ హౌస్ మొత్తం తిప్పి చూపించాడు నాగ్. ఈ సారి హౌస్‌లో జరిగే నవరసాలు అన్ని ఐదు రెట్లు ఎక్కువగా ఉండనుందని చెప్పేశాడు నాగ్. టాస్కులు కూడా ఈసారి ఇంట్రస్టింగ్‌గా ఉండనున్నాయని హింట్ ఇచ్చాడు నాగ్. అలాగే బెడ్ రూమ్‌లో రెండు బెడ్లను బిగ్ బాస్ లాక్ చేసి ఉంచాడు.

  • 05 Sep 2021 06:12 PM (IST)

    బిగ్ బాస్ హోస్‌ను ఎలా ఉందంటే..

    బిగ్ బాస్ హోస్‌నుప్రేక్షకులకు చూపించిన నాగార్జున. ఈ సారి ఐదు రెట్లు ఎంటర్టైన్మెంట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు నాగ్.

  • 05 Sep 2021 06:07 PM (IST)

    డాన్స్‌లతో ఆకట్టుకున్న నాగార్జున

    హుషారైన పాటలతో అదరగొట్టిన నాగ్.. ఒకలైలా కోసం అనే పాటతోపాటు మాస్ సాంగ్‌కు స్టెప్పులేసిన కింగ్.

  • 05 Sep 2021 06:05 PM (IST)

    హోస్ట్‌గా నాగార్జున ఎంట్రీ..

    అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన కింగ్ నాగార్జున.. మిస్టర్ మజ్ను అంటూ ఎంట్రీ ఇచ్చిన నాగ్. నాగార్జునకు వెల్కమ్ చెప్పిన బిగ్ బాస్

Published On - Sep 05,2021 5:56 PM

Follow us
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు