- Telugu News Entertainment Tollywood Tollywood Heroine Sindhu Menon Latest Photos Goes Viral In Social Media
Tollywood Heroine: టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా…?
ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన హీరోయిన్స్ కొందరు చాలా తక్కువ సినిమాలు చేసిన అనంతం మ్యారేజ్ చేసుకుని నటనకు గుడ్ చెప్పారు. ఆ లిస్ట్‌లో సింధు మీనన్ కూడా ఉంటుంది. సింధు మీనన్ కర్ణాటకలో పుట్టి పెరిగింది. అయితే ఆమె మలయాళీ ఫ్యామిలీకి చెందినవారు.
Updated on: Sep 05, 2021 | 7:00 PM

1994 లో రష్మీ అనే కన్నడ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన సింధు మీనన్.. హీరోయిన్‌గా అన్ని భాషల్లో కలిపి దాదాపు నలభై సినిమాల్లో నటించింది.

2001లో టాలీవుడ్‌కు భద్రాచలం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది సింధూ మీనన్.. ఈ సినిమా విడుదల అయినప్పడు ఆమెకు 15 ఏళ్లే

టాలీవుడ్ క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ సినిమాలో నటించిన ఈ భామ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఎక్కువగా హోమ్లీ పాత్రలు చేసిన ఈ నటి.. మన పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంది.

సింధు.. డొమినిక్ ప్రభు అనే తెలుగు అబ్బాయిని 2010లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2012లో సుభద్ర అనే తెలుగు సినిమా చేసిన అనంతరం యాక్టింగ్‌కు గుడ్ బై చెప్పింది.

భర్తతో కలిసి లండన్‌లో సెటిలైన సింధూ మీనన్ ఒక బాబు, ఒక పాపకు జన్మనిచ్చింది. కాగా ఇప్పుడు ఆమె ఫోటోలు చూసినవారు గుర్తించలేకపోతున్నారు.

ఈ ఫోటోల్లో సింధూ మీనన్‌ను చూసిన చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఈమేనా అని కామెంట్లు పెడుతున్నారు.




