Natural Star Nani: నేను వాటికి ఫిట్ అవ్వను అంటూ క్లారిటీ ఇచ్చిన నాని.. షాక్ లో ఫ్యాన్స్..
Natural Star Nani: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టి ఆయా సినిమా షూటింగ్స్‌ను కంప్లీట్ చేస్తున్నాడు.
Natural Star Nani: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టి ఆయా సినిమా షూటింగ్స్‌ను కంప్లీట్ చేస్తున్నాడు. త్వరలో టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాని. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కంప్లీట్ ఫ్యామీలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. టక్ జగదీష్ మూవీలో తెలుగమ్మాయి రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెల 10న అమెజాన్ ప్రైమ్ లో టక్ జగదీష్ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ సినిమా జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయం పై ఇప్పటికే వివాదం రేగిన విషయం తెలిసిందే. సినిమాలు థియేటర్స్‌లో విడుదలవుతున్న వేళ నాని సినిమా ఓటీటీలో రావడంతో థియేటర్స్ యాజమాన్యం సీరియస్ అయ్యారు. అయితే ఈ వ్యవహారం పై నాని స్పందిస్తూ.. నన్ను బయటవాడిగా చూస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే ఈ సినిమా తర్వాత తన సినిమాలు అన్ని కూడా థియేటర్ల ద్వారా మాత్రమే వస్తాయని.. ఒక వేళ ఓటీటీలో వస్తే కనుక సినిమాలు మానేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు నాని.
ఇక ఇప్పుడు గందరగోళం సద్దుమణగడంతో సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిపోయింది. ఇక ఇటీవల హీరోలు అందరు ఓటీటీల వైపే అడుగులేస్తున్నారు. వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో నానిని కూడా ఫ్యూచర్‌లో వెబ్ సిరీస్‌లలో నటిస్తారా అని ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. నేను వెబ్ సిరీస్‌కు.. ఓటీటీకి ఫిట్ అవుతాను అని భావించడం లేదు అంటూ నాని క్లారిటీ ఇచ్చాడు. టక్ జగదీష్ సినిమా తర్వాత నాని చేసిన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. ఆ సినిమాను ఖచ్చితంగా థియేటర్ రిలీజ్‌కు సిద్దం చేస్తున్నట్లుగా ప్రకటించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :