Bheemla Nayak : రికార్డులు కంటిన్యూ చేస్తున్న పవర్ స్టార్ ‘భీమ్లానాయక్’.. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్..
Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యపనుమ్ కోషియమ్
Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యపనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పవన్‌తో పాటు దగ్గుబాటి హీరో రానా కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లూ.. పవన్ గ్లిమ్స్ ఆకట్టుకున్నాయి. ”రేయ్ డానీ బయటకు రారా… ” అంటూ ఫస్ట్ గ్లిమ్స్‌లో లుంగి పైకి కట్టుకుని ఆవేశంగా నడివస్తున్న పవన్ కళ్యాణ్‌ని చూసిన అభిమానులు ఊగిపోయారు. నెట్టింట భీమ్లా నాయక్‌ను టాప్‌లో నిలబెడుతూ … రిలీజైన గంటలోనే ట్రెండింగ్‌లో నిలిపారు. ఇక ఇటీవల పవర్ స్టార్ పుట్టిన రోజు కానుకగా భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే సంచలన రికార్డులను నమోదు చేసింది. తెలుగు సినిమా చరిత్రలోనే ఫాస్టెస్ట్ లైకులు, వ్యూస్, కామెంట్లు అంటూ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది ఈ సాంగ్.
థమన్ సంగీత సారథ్యంలో వచ్చిన భీమ్లా నాయక్ పాటకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు లిరిక్స్ విషయంలో కూడా చర్చ జరుగుతోంది. ఈ పాటపై తెలంగాణ పోలీస్లు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. ఇదిలా ఉంటే ఈ పాట తన రికార్డ్స్‌ను కంటిన్యూ చేస్తుంది. ఇప్పటికే భారీ వ్యూస్ దక్కించుకొని దూసుకుపోతుంది భీమ్లా నాయక్ సాంగ్. మూడవ రోజు కూడా టాప్‌లో పాట ట్రెండ్ అవుతోంది. 14 మిలియన్ వ్యూస్‌తో ఈ సాంగ్ ట్రెండ్ అవుతుంది. ఇక సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు రాస్తున్నారు. నిత్యామీనన్ హీరోయిన్‌గా నటిస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :