Seetimaarr: సినిమా చూసి సీటీ కొట్టకుండా ఉండలేరంట.. సక్సెస్ పై టాల్ హీరో కాన్ఫిడెన్స్
మ్యాచో హీరో గోపీచంద్ ఇప్పుడు ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసిమీద ఉన్నాడు. అసలే హిట్ రుచి చూసి చాలా కాలం అవవడంతో ఎంతో ఈగర్‌గా తన నెక్స్ట్..
Seetimaarr: మ్యాచో హీరో గోపీచంద్ ఇప్పుడు ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసిమీద ఉన్నాడు. అసలే హిట్ రుచి చూసి చాలా కాలం అవవడంతో ఎంతో ఈగర్‌గా తన నెక్స్ట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. విలన్‌గా నటించి ఆకట్టుకున్న గోపీచంద్ ఆ తర్వాత హీరోగా మెప్పించాడు. రణం.. లక్ష్యం.. లౌక్యం..శంఖం.. జిల్.. సాహసం వంటి సినిమాలతో ఆకట్టుకున్న గోపీచంద్. ఇటీవల కాలంలో సరైన హిట్ అందుకోలేకపోయాడు. చేసిన సినిమాలన్నీప్రేక్షకులను ఆకట్టుకోవడంతో విఫలమయ్యాయి. అయినా కూడా నిరాశ పడకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు ఈ టాల్ హీరో. ఇక ఇప్పుడుప్రేక్షకులతో సీటీ కొట్టించడానికి రెడీ అవుతున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేశాడు గోపీచంద్. ఈ సినిమా క్రీడా నేపథ్యంలో తెరకెక్కింది. సీటీమార్ సినిమాలో గోపీచంద్‌కు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్ర గాళ్స్ కబడ్డీ టీమ్ కోచ్‌గా.. తమన్నా తెలంగాణ గాళ్స్ కబడ్డీ టీమ్ కోచ్‌గా కనిపించనున్నారని తెలుస్తుంది.
ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. సినిమా విజయం పై ధీమా వ్యక్తం చేశాడు. చాలా అవాంతరాల మధ్య ఈ సినిమా షూటింగును పూర్తి చేశాము. కబడ్డీ టీమ్‌లో నిజంగా ఆట గురించి బాగా తెలిసిన వాళ్లు ఓ నలుగురు ఉన్నారు. మిగతావాళ్లకి కొంత కాలం పాటు ట్రైనింగ్ ఇవ్వవలసి వచ్చింది. మొదటిసారిగా కెమెరా ముందుకు వచ్చిన అమ్మాయిలు చాలా కష్టపడ్డారు. ట్రైనింగ్ సమయంలోను.. షూటింగ్ సమయంలోను దెబ్బలు తగిలినా ఓర్చుకున్నారు. వాళ్ల అంకితభావం చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. తెలుగులో మొదటిసారిగా పూర్తి కబడ్డీ నేపథ్యంలోనే రూపొందిన సినిమా ఇది. ఈ సినిమాను చూస్తూ సీటీ కొట్టకుండా ఉండలేరు.. అంటూ గోపీచంద్ చెప్పుకొచ్చారు.
మరిన్ని ఇక్కడ చదవండి :