Mahesh Babu: ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా రేర్ ఫోటో షేర్ చేసిన మహేష్.. ఆనందం వ్యక్తం చేస్తున్న అభిమానులు..
సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ పేరులో ఓవైబ్రేషన్ ఉంది. ఓ మత్తు ఉంది.. ఇది మహేష్ అభిమానులు.. ముఖ్యంగా లేడీ ఫాన్స్ చెప్పే డైలాగులు ఇవి.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ పేరులో ఓవైబ్రేషన్ ఉంది. ఓ మత్తు ఉంది.. ఇది మహేష్ అభిమానులు.. ముఖ్యంగా లేడీ ఫాన్స్ చెప్పే డైలాగులు ఇవి. నటశేఖర కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు. సూపర్ స్టార్‌గా ఎదిగారు. తండ్రిలోని నటనను వారసత్వంగా పునికిపుచ్చుకున్న మహేష్. ఇప్పుడు టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. బాలనటుడిగా ఎన్నో పలుసినిమాల్లో నటించి మెప్పించాడు మహేష్. తండ్రి కృష్ణ తో కలిసి శంఖారావం.. కొడుకుదిద్దిన కాపురం..గూఢచారి 117.. అన్న తమ్ముడు వంటి సినిమాల్లో నటించాడు. ఇక రాఘవేంద్ర రావు తెరకెక్కించిన రాజకుమారుడు సినిమాతో మహేష్ హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకున్నాడు ప్రిన్స్. ఆ తర్వాత వరుసగా లవ్ స్టోరీ మూవీస్ చేసి లవర్ బాయ్‌గా ఎదిగాడు. ఆతర్వాత కృష్ణ లానే ప్రయోగాత్మక సినిమాలు చేసి శబాష్ అనిపించుకున్నాడు. మహేష్‌కి నటనలో ఓనమాలు నేర్పింది కృష్ణగారే. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ తండ్రిని మించిన తనయుడిగా పేరు సొంతం చేసుకున్నాడు.
నేడు (సెప్టెంబర్ 5) ఉపాధ్యాయుల దినోత్సంవం సందర్భంగా మహేష్ తన తండ్రి ఫోటోను షేర్ చేసి.. తనకు గురువు తండ్రే అంటూ రాసుకోచ్చారు. మహేష్ బాబు ట్విట్టర్‌లో ఓ రేర్ ఫోటోను షేర్ చేశాడు. ‘ప్రతిరోజూ నేర్చుకోవడం .. అపారమైన ప్రేమ ఇక్కడ ఉంది! ప్రేమించడం.. బలంగా ఉండటం.. క్రమశిక్షణ.. కరుణ.. వినయం కలిగి ఉండడం నేర్పించిన నాన్నకు ధన్యవాదాలు` అని మహేష్ పోస్ట్ చేశాడు. చిన్నతనంలో కృష్ణతో కలిసి ఉన్న ఫోటోను మహేష్ అభిమానులతో పంచుకున్నారు.
ట్వీట్ :
Here’s to the love of learning and growing each day! Thanking my father who taught me to love, to be strong, to have discipline, compassion and humility. Will always be indebted to him and to everyone who’s helped me learn and evolve in my journey. #TeachersDay pic.twitter.com/xZTSiGpsYk
— Mahesh Babu (@urstrulyMahesh) September 5, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :