Nani: నా వల్లే ప్రాబ్లమ్ అయితే ఎల్లిపోతా మావ.. రాహుల్ రామకృష్ణకు అదిరిపోయే పంచ్ వేసిన న్యాచురల్ స్టార్..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Sep 05, 2021 | 1:41 PM

నీకు నా వల్లే ప్రాబ్లమ్ అయితే ఎల్లిపోతా మావ ఇడి కెంచి.. ఈ డైలాగ్ ఎంత ట్రెండ్ అయ్యిందో తెలిసిన విషయమే. సోషల్ మీడియాలో ఈ డైలాగ్‏తో

Nani: నా వల్లే ప్రాబ్లమ్ అయితే ఎల్లిపోతా మావ.. రాహుల్ రామకృష్ణకు అదిరిపోయే పంచ్ వేసిన న్యాచురల్ స్టార్..
Nani

నీకు నా వల్లే ప్రాబ్లమ్ అయితే ఎల్లిపోతా మావ ఇడి కెంచి.. ఈ డైలాగ్ ఎంత ట్రెండ్ అయ్యిందో తెలిసిన విషయమే. సోషల్ మీడియాలో ఈ డైలాగ్‏తో ఉన్న వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. ఇటీవల నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ కెవీ తెరకెక్కించిన జాతిరత్నాలు సినిమాలో కమెడియన్ రాహుల్ రామకృష్ణ పలికిన ఈ డైలాగ్ యూత్‏ను ఆకట్టుకుంది. ఎక్కడ చూసిన ఈ డైలాగ్ తెగ వైరల్ అయ్యింది. తాజాగా న్యాచురల్ స్టార్ నాని కూడా ఈ డైలాగ్ వేసాడు. అది కూడా.. కమెడియన్ రాహుల్ రామకృష్ణకే పంచ్ వేశాడు. నీకు ప్రాబ్లెమ్ అయితే ఎల్లిపోతా మావ అంటూ రాహుల్ రామకృష్ణ ట్వీట్‏కు స్పందించాడు నాని. గత కొన్ని రోజులుగా తన సినిమా ప్రమోషన్ కోసం నిత్యం వరుస్ ట్వీట్లతో వార్తల్లో నిలుస్తున్న రాహుల్ రామకృష్ణ.. తాజాగా నానిని ట్యాగ్ చేస్తూ.. నానికి బిగ్ బిగ్ ఫ్యాన్ అని.. అయినప్పటికీ ఆయన సినిమా కంటే సెప్టెంబర్ 10న విడుదల కానున్న తన సినిమానే బెస్ట్ అంటూ ట్వీట్ చేశాడు రాహుల్ రామకృష్ణ. అయితే తాజాగా ఈ ట్వీట్‏కు నాని స్పందించాడు.

ట్వీట్..

భార్ఘవ్ మాచర్ల దర్శకత్వంలో వస్తున్న వెబ్ మూవీ నెట్. ఇందులో రాహుల్ రామకృష్ణ, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసిన ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న జీ ఫైవ్ లో విడుదల కాబోతుంది. అయితే అదే రోజులు నాని నటించిన టక్ జగదీష్ సినిమా విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే నా సినిమాలో దమ్ముంది అంటూ రాహుల్ చేసిన ట్వీట్ సినీ పరిశ్రమలో రచ్చ చేసింది. ఈ ట్వీట్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరగ్గా..దీనిపై స్పందిస్తూ.. రాహుల్.. ఇక్కడ అందరూ పత్తిత్తులే అంటూ సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. వాస్తవిక సంఘటనల ఆధారంగా సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్‏గా నెట్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో రాహుల్ రామకృష్ణ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు.

Also Read: Bindu Madhavi: తెలుగింటి ఆవకాయ బిర్యానీ బిందు మాధవి అందాలకు చందమామ అయినా చిన్నబోవాల్సిందే..

Ritu Varma: తెలుగమ్మాయి రీతూ వర్మ అందానికి ఎలాంటి వారైనా ఆహా అని తీరాల్సిందే..

Shraddha Kapoor: సాహో బ్యూటీ శ్రద్ధాకపూర్ అందాలు.. కుర్రకారును ఆకట్టుకుంటున్న లేటెస్ట్ స్టిల్స్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu