Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandla Ganesh: ప్రకాష్‌రాజ్‌కు షాకిచ్చిన బండ్ల గణేష్‌.. ప్యానల్‌ నుంచి తప్పుకొని బరిలోకి..

Bandla Ganesh comments on maa elections: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు రోజుకో విధంగా మలుపుతిరుగుతున్నాయి. ఎన్నికల సందర్భంగా ఇప్పటికే పలువురు పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ సంచలన ప్రకటన చేశారు.

Bandla Ganesh: ప్రకాష్‌రాజ్‌కు షాకిచ్చిన బండ్ల గణేష్‌.. ప్యానల్‌ నుంచి తప్పుకొని బరిలోకి..
Bandla Ganesh
Follow us
Shaik Madar Saheb

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 05, 2021 | 3:40 PM

Bandla Ganesh comments on maa elections: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు రోజుకో విధంగా మలుపుతిరుగుతున్నాయి. ఎన్నికల సందర్భంగా ఇప్పటికే పలువురు పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో పలువురు నటులు ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే మా ఎన్నికల్లో కొత్త పోరుకు తెరలేచింది. ఇంతకాలం ప్రకాశ్‌రాజ్‌కు మద్దతుగా పనిచేసిన నటుడు బండ్ల గణేశ్‌.. ఆ ప్యానల్‌ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. అంతేకాకుండా ‘మా’ ఎన్నికల్లో జనరల్‌ సెక్రటరీ పదవి కోసం పోటీలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తాజాగా వరుస ట్వీట్లు చేశారు. బండ్ల గణేష్ ఈ విధంగా ట్విట్లు చేశారు.

‘‘మాట తప్పను .. మడమ తిప్పను. నాది ఒకటే మాట – ఒకటే బాట. నమ్మడం – నమ్మినవారి కోసం బతకడం. నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను. నేను ఎవరిమాట వినను. త్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తాను. ఘన విజయం సాధిస్తాను. మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు. నన్ను పోటీ చెయ్ అంటోంది. అందుకే ఈ పోటీ. అందరికీ అవకాశం ఇచ్చారు. ఒకేఒక అవకాశం నాకివ్వండి. నేనేంటో చూపిస్తా. నా పరిపాలన ఏంటో తెలియచేస్తా. వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం నా ధ్యేయం. దానికోసం పోరాడతా. వారి సొంత ఇంటి కల నిజం చేస్తా. ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమీ చేయలేదు. ఇప్పుడు చేస్తామంటే మా సభ్యులు నమ్మరు. గొడవలతో మా సభ్యులను మోసం చేసింది చాలు. ఇక అలా జరగొద్దు. అందరి ఆశీస్సులు కావాలి. ‘మా’ను బలోపేతం చేద్దాం. ముఖ్యంగా పేద కళాకారులకు ఇళ్ల కల నిజం చేద్దాం.. అదే మా నిజమైన అభివృద్ధి.. చిహ్నం’’ అంటూ బండ్ల గణేశ్‌ ట్విట్లు చేశారు.

జీవితా రాజశేఖర్‌ రావడం నాకిష్టం లేదు.. కాగా.. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌లోకి జీవితా రాజశేఖర్‌ రావడం తనకిష్టం లేదని బండ్ల గణేష్ పేర్కొన్నారు. తనకు ఎంతో ఇష్టమైన మెగా ఫ్యామిలీని ఆమె ఎన్నో సార్లు కించపరిచారు. అందుకే నేను ఈ ప్యానల్‌ నుంచి తప్పుకుంటున్నాను. ఆమెపై జనరల్‌ సెక్రటరీ పదవి కోసం బరిలోకి దిగుతున్నాను అంటూ బండ్ల గణేష్ పేర్కొన్నారు.

Also Read: Bigg Boss 5 Telugu: తనని తాను మార్చుకున్న ప్రియాంకా సింగ్‌కు బిగ్ బాస్ ఓ గోల్డెన్ ఛాన్స్

Nani: నా వల్లే ప్రాబ్లమ్ అయితే ఎల్లిపోతా మావ.. రాహుల్ రామకృష్ణకు అదిరిపోయే పంచ్ వేసిన న్యాచురల్ స్టార్..

Simran Choudhary: తెలుగ‌మ్మాయి సిమ్రన్ చౌద‌రి లేటెస్ట్ ఫోటో షూట్.. మైండ్ బ్లాక్ అందాలు తప్పక చూడాల్సిందే

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌