Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: తనని తాను మార్చుకున్న ప్రియాంకా సింగ్‌కు బిగ్ బాస్ ఓ గోల్డెన్ ఛాన్స్

Bigg Boss Priyanka Singh : ఇక జబర్దస్త్ సాయి తేజ్ నుంచి ప్రియాంక సింగ్‌గా మారిన ట్రాన్స్ జెండర్ కూడా క్వారంటైన్‌లో రీల్ వీడియోలతో అలరిస్తున్నారు. అయితే ఆమె తన ఇన్ స్టాగ్రాంలో కామెంట్ సెక్షన్లను మూసివేశారు.

Ram Naramaneni

| Edited By: Team Veegam

Updated on: Sep 06, 2021 | 6:59 PM

జబర్దస్త్ కామెడీ షో  ఎంతోమంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే. టాలెంట్ ఉన్న ఎంతో మంది ఆ షో ద్వారా నిలదొక్కుకున్నారు. ఈ షోలో లేడీ గెటప్‌లు వేసి ఫేమస్ అయిన సాయి తేజ్.. ఆ తర్వాతి కాలంలో అబ్బాయి నుంచి అమ్మాయిగా మారి సంచలనం సృష్టించాడు. తన పేరు కూడా ప్రియాంకా సింగ్‌గా మార్చుకున్నారు.

1 / 5
సాయితేజగా అందరికీ తెలిసినా కూడా తను మాత్రం చిన్నప్పటి నుంచి అమ్మాయిగా ఉండటానికే ఇష్టపడ్డానని చెప్పింది ప్రియాంక. స్క్రీన్‌పై కామెడీ చేసే తన జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయని ఆమె గతంలో తెలిపింది.  తనకు ఐదేళ్లు ఉన్నప్పటి నుంచే అక్క బట్టలు వేసుకోవడం.. ఆ తర్వాత చీరలు కట్టుకోవడం లాంటివి ఎవరికీ తెలియకుండా చేసానని చెబుతుంది ఈమె. ఇక అమ్మానాన్నలకు చెప్పకుండానే.. ఫ్రెండ్స్ సాయంతో తాను ఆపరేషన్ చేయించుకున్నట్లు వెల్లడించింది.

2 / 5
బిగ్ బాస్ హౌస్‌లోకి హౌస్ మేట్స్ ఒకొక్కరిగా వస్తున్నారు. ఇప్పటికే ఎనిమిదిమంది సభ్యులు రాగా.. తాజాగా జబర్ధస్ ప్రియాంక సింగ్ ఎంట్రీ ఇచ్చింది.

3 / 5
కాగా ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి ట్రాన్స్‌జెండర్ కేటగిరీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు ప్రియాంకా సింగ్. అక్కడ ఆమె సత్తా చాటి.. తనని తాను ఫ్రూవ్ చేసుకోగలిగితే.. భవిష్యత్‌లో మంచి అవకాశాలు వస్తాయి. కెరీర్ పరంగా నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది.

4 / 5
ఆమెకు జబర్దస్త్, అదిరింది షోలలో చేసే కమెడియన్లు ఎవరు సపోర్ట్ చేస్తారు.. ఎంతకాలం ఆమె బిగ్ బాస్ ఇంట్లో ఉండగలుగుతుంది. ఇన్నాళ్లు జీవితంలో ఎదురైన చేదు అనుభవాల పాఠాలతో ఆమె ఎంత పరిణితితో ఇంట్లో వ్యవహరిస్తుంది అన్న అంశాలు మున్ముందు తెలుస్తాయి.

5 / 5
Follow us