AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss5: మొదలైన బిగ్‌బాస్ సందడి.. బాబోయ్ నాగార్జున అప్పుడే ఆట మొదలెట్టేశారుగా..

బుల్లితెర రియాల్టీ షో ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ సీజన్ 5 ప్రారంభ వేడుక అట్టహాసంగా సాగుతోంది.

Bigg Boss5: మొదలైన బిగ్‌బాస్ సందడి.. బాబోయ్ నాగార్జున అప్పుడే ఆట మొదలెట్టేశారుగా..
Biggboss5
KVD Varma
|

Updated on: Sep 05, 2021 | 10:10 PM

Share

Bigg Boss5: బుల్లితెర రియాల్టీ షో ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ సీజన్ 5 ప్రారంభ వేడుక అట్టహాసంగా సాగుతోంది. కింగ్ నాగార్జున సూపర్ సాంగ్ తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. తరువాత బిగ్‌బాస్ హౌస్ లోకి ప్రేక్షకులను తీసుకుపోయారు. ఇల్లంతా తిప్పి చూపించారు. హౌస్ లో అన్ని గదులనూ చూపించిన నాగ్.. బెడ్ రూమ్ మాత్రం చూపించలేదు. అది లాక్ చేసి ఉంది. తరువాత అక్కడే రెండు సింగిల్ బెడ్స్ తాళం వేసి ఉన్నవి ప్రత్యేకంగా చెప్పారు. బిగ్‌బాస్ ని దాని గురించి నాగ్ అడిగితే ముందు ముందు మీకే తెలుస్తుంది అని సమాధానం వచ్చింది.

తరువాత ఒక్కో కాంటెస్టెంట్ నీ వేదిక మీదకు పిలవడం మొదలు పెట్టారు. మొదటగా యూ ట్యూబ్ స్టార్ సిరి హన్మంత్ ఎంట్రీ ఇచ్చింది. తరువాత వీజే సన్నీ వచ్చాడు. వస్తూనే నాగార్జున అతన్ని నీకు ఎలాంటి అమ్మాయి కావాలో బొమ్మ వేయమని అడిగారు. అతను వేసిన బొమ్మ పట్టుకుని లోపలకు వెళ్లి అక్కడ ఎవరన్నా అలా కనిపిస్తారేమో వెతుక్కోమని హౌస్ లోకి పంపించారు నాగార్జున.

తరువాత లహరి ఎంట్రీ ఇచ్చింది. ఆమె వస్తూనే నాగార్జునకు ప్రపోజ్ చేసింది. ఎర్ర గులాబీ ఇచ్చి మరీ ఆమె చేసిన ప్రపోజల్ కు నాగార్జున హౌస్ లో ఎవరినైనా వెతుక్కోమని చెప్పి పంపించారు. తరువాత సింగర్.. ఇండియన్ ఐడల్ శ్రీరామమూర్తి, డాన్స్ మాస్టర్ యానీ, లోబో హౌస్ లోకి వచ్చారు. లోబో తన స్టైల్ పిచ్చి గురించి ఫన్నీగా చెప్పాడు. హోస్ లోకి వెళ్ళిన దగ్గర నుంచీ సందడి మొదలు పెట్టాడు.

ర్యాంప్ వాక్ తో జెస్సీ, ట్రాన్స్ జెండర్ ప్రియా సింగ్ ఎంట్రీ ఇచ్చారు. తరువాత యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్, నటి హమీదా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత వచ్చిన డ్యాన్స్ మాస్టర్ నటరాజ్ తన ప్రేమ కథ చెప్పి ఎమోషన్ పలికించారు. ఇక అందరినీ దమ్‌దమ్‌ చేస్తానంటూ యూట్యూబ్ సరయు హౌస్ లోకి అడుగుపెట్టింది.

నాగార్జున ఆట మొదలు 

ఈ సీజన్ లో మొదటి ఎపిసోడ్ నుంచే టాస్క్ మొదలు పెట్టేశారు. తాళం వేసి ఉన్న సింగిల్ బెడ్ కావలసిన వారు టాస్క్ ఆడాలి. మొదట ఐదుగురితో పూల మాల టాస్క్ ఆడించారు నాగార్జున. అందులో వీజే సన్నీ గెలిచాడు.