Pawan Kalyan Fan: క్యూబిక్స్‌తో పవన్ బొమ్మ.. అబ్బురపరిచిన పవన్ కళ్యణ్ ఫ్యాన్ వీడియో వైరల్..
అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. కాని వారిలో పవన్ ఫ్యాన్స్ మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఉంటారు. ఇన్నోవేటివ్గా పవన్ మీదుండే ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. సామాజిక సేవలో దూసూకుపోతుంటారు. అలా తాజాగా ఓ క్రేజీ ఫ్యాన్ 24 గంటలు కష్టపడి మరీ ఎవరూ చేయలేని ఓ పని చేశారు. నెట్టింట వైరల్ గా మారారు.
పవన్ పుట్టిన రోజు ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు.. అందులోనూ కొందరు ఫ్యాన్స్ తమకే సాధ్యం అయ్యే విద్యతో… రకరకాలుగా పవన్‌ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటారు. నెట్టింట వైరల్ అవుతుంటారు. అలా తాజాగా ఓ పవన్ డైహార్డ్ ఫ్యాన్స్ క్యూబిక్స్‌ను పవన్ బొమ్మ వచ్చేలా పేర్చారు. కడప నగరానికి చెందిన యువ ఇంజనీర్ నరసింహ శ్రీచరణ్‌కు రూబిక్స్‌తో వివిధ ఆకృతులు తయారు చేయడం హాబీ. ఆ అలవాటునే తన అభిమాన హీరోకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఉపయగించుకోవాలనుకున్నాడు చరణ్. అందులో భాగంగానే 550 రూబిక్ క్యూబ్స్‌తో పవన్ చిత్రాన్ని రూపొందించాడు. ఇందుకోసం ఈ కుర్రాడు ఏకంగా 24 గంటలపాటు కష్టపడ్డాడు. దీనంతటికీ సంబంధించి వీడియోను చిత్రీకరించిన శ్రీచరణ్ ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని ఇక్కడ చూడండి: మందుబాబులకు సర్కార్ షాక్..!మద్యం కొనుగోలుకు వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి (వీడియో).Vaccination Must Video.
విశాఖ జిల్లాలో అమానవీయ ఘటన..! ముళ్ళపొదల్లో ఏడుస్తూ పసిపాప(వీడియో): Baby Rescue Video.