Afghanistan Leader:ఆఫ్గాన్‌లో తాలిబన్ల కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం..!సుప్రీం లీడర్‌గా అఖుంద్‌జాదా(వీడియో).
ఎట్టకేలకు ఆఫ్గానిస్థాన్‌ను తమ వశం చేసుకున్న తాలిబన్లు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలస్తుంది. ఇక ఆఫ్గాన్ సుప్రీం లీడర్‌గా తాలిబన్ మత గురువు ముల్లా హైబతుల్లా అఖుంద్‌జాదా బాధ్యతలు చేపట్టనున్నారు...
ఎట్టకేలకు ఆఫ్గానిస్థాన్‌ను తమ వశం చేసుకున్న తాలిబన్లు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలస్తుంది. ఇక ఆఫ్గాన్ సుప్రీం లీడర్‌గా తాలిబన్ మత గురువు ముల్లా హైబతుల్లా అఖుంద్‌జాదా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని తాలిబన్ సమాచార, సాంస్కృతిక కమిషన్ సీనియర్ ప్రతినిధి ముఫ్తీ ఇనాముల్లా సమాంఘనీ వెల్లడించారు.అఫ్గానిస్తాన్‌ను అక్రమించిన రెండు వారాల తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 3న ప్రార్థనల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. దేశ అత్యున్నత నాయకుడిగా తాలిబన్ మత గురువు ముల్లా హైబతుల్లా అఖుంద్‌జాదాను ఎంపిక చేశారు. ఆయన బాధ్యతలు చేపట్టడం ఇక లాంఛనమేనని తెలుస్తోంది. ఈ విషయాన్ని తాలిబన్ సమాచార, సాంస్కృతిక కమిషన్ సీనియర్ ప్రతినిధి ముఫ్తీ ఇనాముల్లా సమాంఘనీ స్వయంగా వెల్లడించారు. అఫ్గాన్ ప్రభుత్వ అధినేత అఖుంద్‌జాదా అవుతారని, ఈ విషయంలో మరో ప్రశ్నకు తావే లేదని తేల్చిచెప్పారు. నూతన సర్కారు ఏర్పాటుపై సంప్రదింపులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. మంత్రివర్గం ఏర్పాటుపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
కొత్త ప్రభుత్వంలో ప్రావిన్స్‌లకు గవర్నర్లు, జిల్లాలకు జిల్లా గవర్నర్లు ఇన్‌చార్జులుగా ఉంటారని తెలిపారు. ప్రావిన్స్‌లు, జిల్లాలకు గవర్నర్లను, పోలీసు చీఫ్‌లను, పోలీసు కమాండర్లను తాలిబన్లు ఇప్పటికే నియమించినట్లు సమాచారం. నూతన ప్రభుత్వ వ్యవస్థ పేరును, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని ఇంకా ఖరారు చేయలేదని ఇనాముల్లా వివరించారు. అఫ్గాన్ కొత్త ప్రభుత్వ వ్యవస్థలో మహిళలకు, అన్ని గిరిజన తెగల సభ్యులకు ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు తాలిబన్ రాజకీయ కార్యాలయ ఉప నాయకుడు షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్‌జాయ్ ప్రకటించారు. దేశంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం దక్కుతుందని అన్నారు. తాలిబన్లకు గట్టి పట్టున్న కాందహార్ నగరం నుంచే ముల్లా హైబతుల్లా అఖుంద్‌జాదా ప్రభుత్వ అధినేతగా దేశ పరిపాలనను పర్యవేక్షిస్తారని తెలిపారు. భారత్, అమెరికా, యూరోపియన్ యూనియన్‌తో తాము సన్నిహిత సంబంధాలనే కోరుకుంటున్నామని వివరించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Tailor Roja: టైలర్‌గా మారిన రోజా.! యూనిఫామ్ కుట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన నగరి ఎమ్మెల్యే..(వీడియో).