AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మందుబాబులకు సర్కార్ షాక్‌..!మద్యం కొనుగోలుకు వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ తప్పనిసరి (వీడియో).Vaccination Must Video.

మందుబాబులకు సర్కార్ షాక్‌..!మద్యం కొనుగోలుకు వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ తప్పనిసరి (వీడియో).Vaccination Must Video.

Anil kumar poka
|

Updated on: Sep 05, 2021 | 8:26 PM

Share

మందుబాబులకు అక్కడి ప్రభుత్వం ఊహించని షాక్‌ ఇచ్చింది..మందు కొనుగోలు చేయాలంటే..కొన్ని తప్పనిసరి నిబంధనలు అమల్లోకి తెచ్చింది...సర్కార్‌ చెప్పిన సూచనలు పాటిస్తేనే..మందుబాటిల్ విక్రయించేందుకు అనుమతినిచ్చింది..లేదంటే..చుక్క గొంతులోకి దిగేది లేదని తేల్చిచెప్పింది..

మద్యం ప్రియులకు తమిళనాడు సర్కార్ షాకిచ్చింది. ఇక‌పై మ‌ద్యం దుకాణాల్లో మ‌ద్యం కొనుగోలు చేయాలంటే వ్యాక్సిన్ వేసుకున్నట్టుగా స‌ర్టిఫికెట్, ఆధార్ కార్డు ఉంటేనే మ‌ద్యం విక్రయించాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానాన్ని మొదటిసారిగా తమిళనాడులోని నీలగిరి జిల్లాలో అమలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా.. మద్యం కొనుగోలు చేయాలంటే ఆధార్‌ కార్డు, కరోనా టీకా పత్రం చూపాలని అధికారులు స్పష్టం చేశారు.

మద్యానికి బానిసైన వారు మద్యం సేవించకుండా ఉండలేరు. అంతే కాకుండా వారు ఎక్కడ మద్యం దుకాణం కనిపిస్తే అక్కడికి వెళ్లి మద్యం సేవిస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారికి కరోనా సోకే ప్రమాదం ఉంది. అందువలన వారి నుంచి వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకకూడదని, కరోనా నియంత్రిచడానికి అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఇది నీల‌గిరి జిల్లాలో మాత్రమే అమ‌ల‌వుతోంది. అక్కడ మద్యం కొనుగోలు చేయాలంటే ఆధార్‌ కార్డు, కరోనా టీకా వేయించుకున్న సర్టిఫికెట్‌ తప్పనిసరి చేశారు అధికారులు.
మరిన్ని ఇక్కడ చూడండి: FYI With Swathi: అతిగా వర్కౌట్ చేస్తే చనిపోతారా? ట్రెండ్ గా మారిన ఫిట్ నెస్ ప్రాణాలు మీదకొచ్చిందా..?(వీడియో).

విశాఖ జిల్లాలో అమానవీయ ఘటన..! ముళ్ళపొదల్లో ఏడుస్తూ పసిపాప(వీడియో): Baby Rescue Video.

Afghanistan Leader:ఆఫ్గాన్‌లో తాలిబన్ల కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం..!సుప్రీం లీడర్‌గా అఖుంద్‌జాదా(వీడియో).

Tailor Roja: టైలర్‌గా మారిన రోజా.! యూనిఫామ్‌ కుట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన నగరి ఎమ్మెల్యే..(వీడియో).