విశాఖ జిల్లాలో అమానవీయ ఘటన..! ముళ్ళపొదల్లో ఏడుస్తూ పసిపాప(వీడియో): Baby Rescue Video.
అమ్మవడిలో హాయిగా ఉండాల్సిన ఓ పసికందు ముళ్ళపొదల్లో అల్లాడిపోతున్న దృశ్యం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. కాకులు దూరని కారడవిలో.. ఓ వైపు చల్లని గాలులు.. మరోవైపు ఏకదాటిగా కురుస్తున్న వర్షం..
అమ్మవడిలో హాయిగా ఉండాల్సిన ఓ పసికందు ముళ్ళపొదల్లో అల్లాడిపోతున్న దృశ్యం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. కాకులు దూరని కారడవిలో.. ఓ వైపు చల్లని గాలులు.. మరోవైపు ఏకదాటిగా కురుస్తున్న వర్షం.. వీటికి తోడు పాపపై చీమలు చేస్తున్న దాడి. ఊహించుకునేందుకే భయంకరంగా ఉన్న ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.
రోలుగుంట మండలం భోగాపురంలో సమీపంలోని బీఎన్ రోడ్డులో అప్పుడే పుట్టిన పసికందును ముళ్ళపొదల్లో గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్ళారు.పసిబిడ్డ పొదల్లో ఉందన్న సమాచారం అందుకున్న ఎస్సై నాగకార్తీక్.. వెంటనే స్పందించి శిశువును స్వయంగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ శిశువు మహిళా శిశుసంక్షేమ శాఖాధికారుల ఆధీనంలో ఉంది. ఆడశిశువు కావడంతోనే వద్దనుకుని పొదల్లో విడిచివెళ్ళినట్టు అనుమానిస్తున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. సకాలంలో స్పందించి శిశువును ఆసుపత్రికి చేర్చిన ఎస్సైని స్థానికులు అభినందించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Afghanistan Leader:ఆఫ్గాన్‌లో తాలిబన్ల కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం..!సుప్రీం లీడర్‌గా అఖుంద్‌జాదా(వీడియో).
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

