AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాబోయే టోర్నీలకు బ్యాడ్మింటన్‌ జట్టును ప్రకటించిన బాయ్.. తిరిగి కోర్టులోకి సైనా, శ్రీకాంత్‌.. సెలక్ట్ కాని పీవీ సింధు.. ఎందుకో తెలుసా?

Thomas And Uber Cup: ఈ ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌కు సైనా నెహ్వాల్‌తో పాటు కిదాంబి శ్రీకాంత్ అర్హత సాధించలేకపోయారు. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరూ బ్యాడ్మింటన్ కోర్టులోకి తిరిగి వస్తున్నారు.

రాబోయే టోర్నీలకు బ్యాడ్మింటన్‌ జట్టును ప్రకటించిన బాయ్.. తిరిగి కోర్టులోకి సైనా, శ్రీకాంత్‌.. సెలక్ట్ కాని పీవీ సింధు.. ఎందుకో తెలుసా?
Saina Srikanth
Venkata Chari
|

Updated on: Sep 05, 2021 | 9:34 PM

Share

Thomas And Uber Cup: టోక్యో ఒలింపిక్ క్రీడలు ముగిసిన తర్వాత, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఇప్పుడు కొత్త సీజన్‌ను ప్రారంభిస్తున్నారు. టోక్యోలో కాంస్య పతకం సాధించిన పీవీ సింధు మినహా, భారతదేశంలోని ఇతర స్టార్ ఆటగాళ్లందరూ థామస్-ఉబెర్ కప్ బరిలో దిగనున్నారు. అక్టోబర్ 9 నుంచి 17 వరకు డెన్మార్క్‌లో జరిగే థామస్-ఉబెర్ కప్‌లో స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, బి సాయి ప్రణీత్ వరుసగా భారత మహిళల, పురుషుల జట్లకు నాయకత్వం వహిస్తారు.

సైనా నెహ్వాల్, శ్రీకాంత్ ఈ సంవత్సరం టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయారు. ఇద్దరూ రియోలో పాల్గొన్నారు. శ్రీకాంత్ దీనికి బీడబ్ల్యూఎఫ్‌(BWF) ని నిందించాడు. అయితే సైనా కూడా కొత్త నిబంధనలతో చాలా నిరాశకు గురైంది. ఈ టోర్నమెంట్‌తోనే వచ్చే ఏడాది కామన్వెల్త్, ఆసియా క్రీడలకు సన్నాహాలు ప్రారంభమవనున్నాయి.

12 మంది సభ్యుల బృందం.. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) ఆదివారం సుదిర్మన్ కప్ కోసం 12 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించింది. థామస్-ఉబెర్ కప్ కోసం సైనాతో పాటు మాళవికా బన్సూర్, అదితి భట్, తన్సీమ్ మీర్ సింగిల్స్‌లో సెలక్ట్ అయ్యారు. అలాగా డబుల్స్‌లో మూడు జోడీలు పాల్గొననున్నాయి. ఇందులో తనీషా క్రాస్టో, రుతుపర్ణ పాండా కూడా ఉన్నారు.

10 మంది పురుషుల జట్టులో నలుగురు సింగిల్స్ ఆటగాళ్లు, మూడు డబుల్స్ జోడీలు ఉన్నారు. సింగిల్స్‌లో ప్రణీత్‌తో పాటు, కిదాంబి శ్రీకాంత్, ‎ట్రయల్స్‌లో మొదటి రెండు ప్లేయర్‌లు కిరణ్ జార్జ్, సమీర్ వర్మ ఉన్నారు. డబుల్స్‌లో చిరాగ్ శెట్టి, సాత్విక్షైరాజ్ రాంకిరెడ్డి కాకుండా, ట్రయల్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన మరో రెండు జోడీలు ఎంపికయ్యాయి.

పీవీ సింధుకు విశ్రాంతి.. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు.. ఒలింపిక్స్ తర్వాత విరామం తీసుకోవాలనుకుంటున్నందున ఆమెను ఈ జట్టులో చేర్చలేదు. థామస్ కప్‌లో, భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ చైనాతో గ్రూప్ సీలో చోటు దక్కించుకుంది. గ్రూప్‌లోని రెండు ఇతర జట్లు నెదర్లాండ్స్, తాహితీ ఉన్నాయి. ఉబెర్ కప్ కోసం థాయ్‌లాండ్, స్పెయిన్, స్కాట్లాండ్‌లతో పాటు గ్రూప్ బీ లో మహిళల జట్టు స్థానం పొందింది. సుదిర్మన్ కప్ కోసం శ్రీకాంత్, ప్రణీత్‌తో పాటు 12 మంది సభ్యుల జట్టులో, ధృవ్ కపిల, ఎంఆర్ అర్జున్‌తో పాటు డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ కూడా చేరారు. మహిళల జట్టులో, అశ్విని పొన్నప్ప, ఎన్ సిక్కి రెడ్డి జంట.. తనీషా, రుతుపర్ణ సెలక్ట్ అయ్యారు. సింగిల్స్‌లో, బన్సూర్, భట్ జట్టులో చోటు సంపాదించారు.

Also Read:

Virat Kohli: పెవిలియన్ చేరిన కోహ్లీ కోపంతో ఏంచేశాడో తెలుసా..? నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

ENG vs IND: బ్రాడ్‌మన్‌ తర్వాతి స్థానంలో టీమిండియా ఓపెనర్.. ద్రవిడ్ రికార్డునూ బ్రేక్ చేసిన రోహిత్

KL Rahul: కేఎల్ రాహుల్‌కు జరిమానా.. మ్యాచ్ ఫీజులో15 శాతం విధిస్తూ నిర్ణయం.. ఎందుకో తెలుసా..?