Virat Kohli: పెవిలియన్ చేరిన కోహ్లీ కోపంతో ఏంచేశాడో తెలుసా..? నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
IND vs ENG: సింపుల్ క్యాచ్ ఇచ్చి ఔట్ కావడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. 7 ఫోర్లతో హాఫ్ సెంచరీకి చేరువై మరీ ఔట్ కావడంతో కాస్త నిరాశకు గురయ్యాడు.
IND vs ENG: ఇంగ్లండ్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. భారత టెయిలెండర్లు అద్భుతంగా ఆడడంతో ఇంగ్లండ్‌పై ఆధిపత్యం చూపిస్తోంది. అయితే, నాలుగో రోజు బ్యాటింగ్ మొదలు పెట్టిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అలీ బౌలింగ్‌లో క్రెయిగ్ ఓవర్టన్‌కు క్యాచ్ ఇచ్చి 44 పరుగుల వద్ద పెవలియన్ చేరాడు. అయితే, ఔటయ్యాక తన కోపాన్ని ప్రదర్శించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. సింపుల్ క్యాచ్ ఇచ్చి ఔట్ కావడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. 7 ఫోర్లతో హాఫ్ సెంచరీకి చేరువై మరీ ఔట్ కావడంతో కాస్త నిరాశకు గురయ్యాడు. మరోసారి భారీ స్కోర్ సాధించలేకపోయాడు.
ఈ క్రమంలో పెవిలియన్ చేరిన కోహ్లీ.. డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్తూ చాలా కోపంతో గ్లోవ్స్‌తోనే గోడను బలంగా బాదేశాడు. ఈ మేరకు నెట్టింట్లో ఓ వీడియో ట్రెండింగ్‌గా మారింది. పరుగుల యంత్రంగా పేరుగాంచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. సెంచరీ చేయక రెండేళ్లు దాటింది. హాఫ్ సెంచరీలు పూర్తి చేస్తున్నా.. వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. దీంతోనే ఆగ్రహానికి గురైన కోహ్లీ.. బలంగా గోడపై తన ప్రతాపాన్ని చూపించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీ బ్రేక్ సమాయానికి టీమిండియా 346 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం 8 వికెట్ల నష్టానికి 445 పరుగులు సాధించింది. బుమ్రా 19, యాదవ్ 13 పరుగులతో క్రీజులో నిలిచారు.
Virat Kohli is frustrated of his dismissal.#ENGvIND pic.twitter.com/YifSoc9UEe
— Mr.Cricket (@MrCricketR) September 5, 2021
Also Read: ENG vs IND: బ్రాడ్‌మన్ తర్వాతి స్థానంలో టీమిండియా ఓపెనర్.. ద్రవిడ్ రికార్డునూ బ్రేక్ చేసిన రోహిత్
KL Rahul: కేఎల్ రాహుల్‌కు జరిమానా.. మ్యాచ్ ఫీజులో15 శాతం విధిస్తూ నిర్ణయం.. ఎందుకో తెలుసా..?