AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KL Rahul: కేఎల్ రాహుల్‌కు జరిమానా.. మ్యాచ్ ఫీజులో15 శాతం విధిస్తూ నిర్ణయం.. ఎందుకో తెలుసా..?

KL Rahul: ఓవల్‌లో ఇంగ్లండ్, భారత్‌ టీంల మధ్య నాలుగో టెస్టు జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే భారత ఓపెనర్ కేఎల్ రాహుల్‌పై జరిమానా విధిస్తూ నిర్ణయం వెలువడింది.

KL Rahul: కేఎల్ రాహుల్‌కు జరిమానా.. మ్యాచ్ ఫీజులో15 శాతం విధిస్తూ నిర్ణయం.. ఎందుకో తెలుసా..?
Kl Rahul
Follow us
Venkata Chari

|

Updated on: Sep 05, 2021 | 6:54 PM

KL Rahul: ఓవల్‌లో ఇంగ్లండ్, భారత్‌ టీంల మధ్య నాలుగో టెస్టు జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే భారత ఓపెనర్ కేఎల్ రాహుల్‌పై జరిమానా విధిస్తూ నిర్ణయం వెలువడింది. అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. అసలు విషయానికి వస్తే.. అంపైర్ నిర్ణయంపై అసమ్మతిని ప్రదర్శించినందుకు గాను కేఎల్ రాహుల్ మ్యాచ్ ఫీజులో కోత విధించారు. అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై అసమ్మతిని ప్రదర్శించడంపై ఐసీసీ ప్రవర్తనా నియమావళిని అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాలుగో టెస్టులో మూడో రోజు ఔట్‌గా ప్రకటించినందుకు అంపైర్‌పై కేఎల్ రాహుల్ నిరసన తెలిపాడు. దీంతో ఐసీసీ నియమావాళి ప్రకారం రాహుల్ మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.

జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో క్యాచ్ అందుకున్నాడు. అయితే ఇంగ్లండ్ అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌‌గా ప్రకటించారు. ఆన్-ఫీల్డ్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇంగ్లండ్ సమీక్షను కోరింది. ఆ సమయంలో రాహుల్ 46 పరుగుల వద్ద ఉన్నాడు.

థర్డ్అంపైర్ రివ్యూ తరువాత రాహుల్ తన అసంతృప్తిని తెలియజేశాడు. “అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై అసమ్మతిని ప్రదర్శించడం” తో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు రాహుల్‌ను దోషిగా తేల్చినట్లు ప్రపంచ క్రికెట్ పాలక మండలి ఒక ప్రకటనలో తెలిపింది. మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ ప్రతిపాదనను రాహుల్ అంగీకరించినందున, అతనిపై అధికారిక విచారణ అవసరం లేదని ఐసీసీ తెలిపింది.

Also Read:

IND vs ENG: ఐసోలేషన్‌లో టీమిండియా హెడ్‌కోచ్.. కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ.. మరో ముగ్గురు సభ్యులు కూడా..!

IND vs ENG 4th Test Day 4 Live: 350 దాటిన స్కోర్.. పంత్ 30, శార్దుల్ 26 బ్యాటింగ్.. 250 దాటిన టీమిండియా ఆధిక్యం

11 ఏళ్ల కెరీర్‌లో 11 వికెట్లు కూడా తీయలేదు.. చెత్త బౌలింగ్‌కు ఇతడే నిదర్శనం.. ఎవరో తెలుసా!