11 ఏళ్ల కెరీర్‌లో 11 వికెట్లు కూడా తీయలేదు.. చెత్త బౌలింగ్‌కు ఇతడే నిదర్శనం.. ఎవరో తెలుసా!
Rawl Lewis: అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతోమంది గొప్ప బౌలర్లు ఉన్నారు. వారి ప్రదర్శనల గురించి అనేక సార్లు చెప్పుకున్నాం. ఎన్నో రికార్డుల గురించి కూడా విన్నాం..
అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతోమంది గొప్ప బౌలర్లు ఉన్నారు. వారి ప్రదర్శనల గురించి అనేక సార్లు చెప్పుకున్నాం. ఎన్నో రికార్డుల గురించి కూడా విన్నాం. అత్యధిక వికెట్లు, అత్యుత్తమ సగటు, హ్యాట్రిక్‌లు ఇలా ఎన్నో గొప్ప రికార్డులు చాలామంది దిగ్గజ బౌలర్ల సొంతం. అయితే ఇదంతా ఒక ఎత్తయితే.. పేలవ ప్రదర్శనలు ఇచ్చిన బౌలర్ల లిస్టు ఒక ఎత్తు.
మీరు ఎప్పుడైనా టెస్ట్ క్రికెట్‌లో అత్యంత చెత్త బౌలింగ్ చేసిన బౌలర్ గురించి విన్నారా.! అతడి 12 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్‌లో 11 సంవత్సరాలు టెస్ట్ క్రికెట్ ఆడాడు. కానీ, 11 వికెట్లు కూడా తీయలేకపోయాడు. అతడెవరో కాదు మాజీ వెస్టిండీస్ లెగ్ స్పిన్నర్ రౌల్ లూయిస్. ఈరోజు లూయిస్ పుట్టినరోజు. సెప్టెంబర్ 5, 1974వ సంవత్సరంలో ఈ మాజీ కరేబియన్ క్రికెటర్ జన్మించాడు.
పాకిస్తాన్‌పై టెస్ట్ క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన రౌల్ లూయిస్ 1997వ సంవత్సరం, నవంబర్ 1న లాహోర్‌లో తొలి వన్డే ఆడాడు. అలాగే 17 నవంబర్ 1997వ సంవత్సరంలో తొలి టెస్టును ఆడాడు. మొదటి మూడు టెస్టులకే లూయిస్ అత్యంత పేలవమైన బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. లూయిస్ మొదటి 3 టెస్టుల్లో 97.3 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 1 వికెట్ మాత్రమే తీశాడు. ఈ సమయంలో లూయిస్ బౌలింగ్ సగటు 318గా ఉంది.
టెస్టుల్లో సెకండ్ ఛాన్స్..
ఇంతటి పేలవ ప్రదర్శన తర్వాత లూయిస్ టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. అయితే ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో లూయిస్ అద్భుత ప్రదర్శన ఆధారంగా 2006 న్యూజిలాండ్ పర్యటనకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అతడిని ఎంపిక చేసింది. లూయిస్ కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌ల్లో 3 వికెట్లు తీశాడు. ఈ 3 వికెట్లతో కలిపి లూయిస్ కెరీర్ మొత్తంలో 4 వికెట్లు పడగొట్టాడు.
Also Read: కొండచిలువకు ఎదురెళ్లిన పులి.. చివరికి గెలిచింది ఎవరంటే.. వైరల్ వీడియో!
ఓవైపు వ్యాపారం.. మరోవైపు సినిమాలతో దూసుకుపోతున్న ఈ అందాల తార ఎవరో గుర్తుపట్టారా.?
ట్రై యాంగిల్ లవ్‌స్టోరీ.. వివాహానికి లాటరీ పద్దతిలో యువతి ఎంపిక.. చివరకు..
టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా…?