Triangle Love Story: ట్రై యాంగిల్‌ లవ్‌స్టోరీ.. వివాహానికి లాటరీ పద్దతిలో యువతి ఎంపిక.. చివరకు..

Triangle Lottery Love Story: దేశంలో ఇటీవల కాలంలో చాలా ప్రేమ కథలు వార్తల్లో నిలుస్తు్న్నాయి. కొన్ని రోజుల క్రితం ఓ యువకుడు అక్కచెల్లెళ్లను వివాహమాడిన విషయం తెలిసిందే. తాజాగా మరో ట్రైయాంగిల్‌

Triangle Love Story: ట్రై యాంగిల్‌ లవ్‌స్టోరీ.. వివాహానికి లాటరీ పద్దతిలో యువతి ఎంపిక.. చివరకు..
Triangle Love Story
Follow us
Shaik Madar Saheb

| Edited By: Anil kumar poka

Updated on: Sep 06, 2021 | 9:32 PM

Triangle Lottery Love Story: దేశంలో ఇటీవల కాలంలో చాలా ప్రేమ కథలు వార్తల్లో నిలుస్తు్న్నాయి. కొన్ని రోజుల క్రితం ఓ యువకుడు అక్కచెల్లెళ్లను వివాహమాడిన విషయం తెలిసిందే. తాజాగా మరో ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీ వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలను ప్రేమించాడు. చివరకు పెద్దలు పంచాయతీ నిర్వహించి.. కీలక నిర్ణయం తీసుకున్నారు. లాటరీ ద్వారా ఇద్దరు యువతుల్లో ఒకరిని ఎంపిక చేసి వివాహం జరిపించారు. సినిమాను తలదన్నే ఈ షాకింగ్ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. ముక్కోణపు ప్రేమ కథను ఎలా పరిష్కరించాలో తలలు పట్టుకున్న గ్రామస్థులు చివరకు లాటరీ ద్వారా ఒక యువతిని ఎంపిక చేసి వివాహం జరిపించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హాసన జిల్లా సకలేశపుర సమీపంలోని ఓ కుగ్రామంలో వెలుగుచూసింది. ఈ ప్రేమ కథ శుక్రవారం సుఖాంతం కాగా.. ఆదివారం గ్రామస్థులు ఈ విషయాన్ని బయటపెట్టారు.

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సకలేశపుర ప్రాంతానికి చెందిన యువకుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ద్వారా వేర్వేరు ప్రాంతాల్లోని ఇద్దరు యువతులను ప్రేమించాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో కొన్ని రోజులుగా ప్రేమాయణం కొనసాగించాడు. అయితే.. ఆ ఇద్దరు యువతులు కూడా ఆ యువకుడిని గాఢంగా ప్రేమించారు. తీరా యువకుడి విషయం తెలిసిన తర్వాత.. అతనే కావాలంటూ ఇద్దరూ కూడా పట్టుబట్టారు. అతను లేకుండా బతకలేమన్నారు. చివరకు అతడిని వివాహం చేసుకునేందుకు ఇద్దరూ సమ్మతించారు.

అయితే ఇంతలో మరో ట్విస్ట్‌ వచ్చిపడింది. ఇద్దరిలో ఎవరిని వివాహం చేసుకోవాలో ఆ యువకుడికి అర్థం కాలేదు. గ్రామస్థులు పంచాయితీ చేసినా ఫలితం లేకుండాపోయింది. ఈ క్రమంలో ఓ యువతి ఆ యువకుడు లేకుండా ఉండలేనంటూ విషం తాగింది. అయితే.. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే ఆమె కోలుకుని గ్రామానికి తిరిగి రాగా.. మరోసారి ఈ ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీ తెరపైకి వచ్చింది. దీనిపై మరోసారి పంచాయితీ నిర్వహించారు.

ఈ క్రమంలో ఎవరూ మాటవినకపోవడంతో గ్రామస్థులు చివరికి ఓ మార్గాన్ని కనిపెట్టారు. లాటరీ ద్వారా ఒకరిని ఎంపిక చేస్తామని.. ఇందులో పేరు రాని యువతి ఎలాంటి ఫిర్యాదు చేయకుండా మౌనంగా వెనుదిరగాలంటూ షరతులు విధించారు. అనంతరం ఇద్దరు యువతుల సమ్మతితో లాటరీ తీయగా.. అందులో విషం తాగిన యువతి పేరొచ్చింది. దీంతో శుక్రవారం ఆ యువకుడితో ఆమె వివాహం జరిపించారు.

Triangle Love Story

Triangle Love Story

అయితే.. ఈ లాటరీలో విఫలమైన యువతి నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపింది. అనంతరం తనను మోసగించిన యువకుడిని సులువుగా వదలనంటూ హెచ్చరిస్తూ వెనుదిరిగింది. కాగా.. ప్రస్తుతం ఈ పెళ్లి విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Also Read: Titanic Ship: టైటానిక్‌ షిప్ లైఫ్‌ మరో 12 ఏళ్లే..! ఆ తర్వాత కనుమరుగే.. ఎందుకో తెలుసా..

Viral Video: శరీరాన్ని స్ప్రింగ్‏గా మార్చేసిన అమ్మాయి.. ప్రమాదకరమైన విన్యాసాలు.. పట్టుతప్పిందంటే అంతే సంగతులు..

ట్రై యాంగిల్‌ లవ్‌స్టోరీ.. వివాహానికి లాటరీ పద్దతిలో యువతి ఎంపిక.. చివరకు..

టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా…?

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే