AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: శరీరాన్ని స్ప్రింగ్‏గా మార్చేసిన అమ్మాయి.. ప్రమాదకరమైన విన్యాసాలు.. పట్టుతప్పిందంటే అంతే సంగతులు..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో మంది ప్రతిభావంతులకు సంబంధించిన వీడియోలు కనిపిస్తుంటారు. ఇంటర్నెట్ పుణ్యమా అని..

Viral Video: శరీరాన్ని స్ప్రింగ్‏గా మార్చేసిన అమ్మాయి.. ప్రమాదకరమైన విన్యాసాలు.. పట్టుతప్పిందంటే అంతే సంగతులు..
Viral Video
Rajitha Chanti
|

Updated on: Sep 06, 2021 | 12:48 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో మంది ప్రతిభావంతులకు సంబంధించిన వీడియోలు కనిపిస్తుంటారు. ఇంటర్నెట్ పుణ్యమా అని.. మట్టిలోని మాణిక్యాలు ప్రపంచానికి పరిచయవవుతున్నాయి. గాయనిగాయకులు, ఆర్టిస్ట్స్ మాత్రమే కాకుండా.. అబ్బురపరిచే విన్యాసాలు చేసేవారు కూడా ఇంటర్నెట్ ద్వారా ఫేమస్ అవుతున్నారు. అయితే టాలెంట్‏ను నిరూపించుకోవడం.. అబ్బాయిలు, అమ్మాయిలు పోటీ పడుతున్నట్లుగా సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రతిభా ఉండాలే కానీ.. ప్రతి వస్తువు అవకాశమందించే వారదిగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు.. చిన్నపిల్లలు చేసే విన్యాసాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని సార్లు ఆ వీడియోలను చూస్తే ముచ్చటేస్తుంది. మరికొన్ని వీడియోలను చూస్తే.. ఆశ్చర్యమే కాదు.. భయాన్ని కలిగిస్తాయి. వారి ధైర్యానికి… సాహసానికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. తాజాగా నెట్టింట్లో ఓ అమ్మాయి విన్యాసాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అందులో ఓ టీనేజ్ అమ్మాయి.. చిన్న రైలింగ్‍తో కల్వర్ట్ మీద జిమ్నాస్ట్ మాదిరిగా విన్యాసాలు చేస్తుంది. ప్రస్తుతం ట్రైనింగ్ సెషన్‏లో ఉన్నట్లుగా ఆ అమ్మాయి తన ఇన్ స్టా ద్వారా తెలిపింది. ఇక ఆ అమ్మాయి చేసే స్టంట్స్ చూస్తే ఒకింత భయం కలగకమానదు. ఇక అమ్మాయి ఎంతో సాధన చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోను ఏరియల్ సోచి అనే పేరుతో ఇన్‏స్టాలో షేర్ చేశారు. ఇక అందులో అమ్మాయి సాహసాలను చూసి ముచ్చపడుతున్నారు. అలాగే ఇంతటి ప్రమాదకరమైన సాహసాలు చేయవద్దంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. చిన్నవయసులో అమ్మాయి ధైర్యానికి మెచ్చుకుంటున్నారు.

ఇన్‏స్టా పోస్ట్..

Also Read: Katrina Kaif: చెమటలు పట్టిస్తున్న కత్రినా..! రిహార్సల్‌ చూస్తే ఫిదా కావాల్సిందే.. వీడియో మామూలుగా లేదుగా..

Health Benefits: మీరు నానబెట్టిన బాదం తింటున్నారా.. అయితే ఈ సంగతి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిదే..

స్యూరుడు అస్తమించని ప్రాంతాలు.. అక్కడ అర్ధరాత్రి అయినా సూర్యుడు కనిపిస్తాడు.. ఎప్పటికీ చీకటి ఉండని దేశాలు ఇవే..