Health Benefits: మీరు నానబెట్టిన బాదం తింటున్నారా.. అయితే ఈ సంగతి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిదే..
చాలా మంది బాదంను నానబెట్టి తింటారు. అయితే బాదం నానబెట్టి తింటేనే అధిక ప్రయోజనం కలుగుతుందని మీకు తెలుసా... వివిధ రకాల జ్వరాలు వెంటాడుతున్న ఈ సమయంలో..
చాలా మంది బాదంను నానబెట్టి తింటారు. అయితే బాదం నానబెట్టి తింటేనే అధిక ప్రయోజనం కలుగుతుందని మీకు తెలుసా… వివిధ రకాల జ్వరాలు వెంటాడుతున్న ఈ సమయంలో ఎవరి నోట విన్నా.. డ్రై ఫ్రూట్స్ తినండీ.. రోగనిరోధక శక్తి పెంచుకోండీ అంటూ సలహాలు ఇస్తున్నారు. దైనందిన జీవితంలో మనకు రోగ నిరోధక శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. అందుకు తరచుగా డ్రై ఫ్రూట్స్ తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ముఖ్యంగా బాదం, కాజు, పిస్తా, ఎండు ద్రాక్ష లాంటివి తినాలని శరీరానికి చాలా పోషకాలు లభిస్తాయని మనకు తెలిసిందే. అయితే ఇందులో బాదంను మాత్రమే నీటిలో నానబెట్టిన తర్వాత పొట్టు తీసుకుని తినాలంటారు.
నానబెట్టిన బాదం పప్పులో అద్భుతమైన పోషకవిలువలున్నాయి. బరువు తగ్గడం నించీ రక్తపోటు అదుపులో ఉంచుకోడం వరకూ.. గుండె ఆరోగ్యాన్ని కాపాడడం నించీ కాన్సర్ ముప్పుని తగ్గించడం వరకూ బాదం చేసే మేలు అంతా ఇంతా కాదు. దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోడం వల్ల ఎన్నో లాభాలను పొందచ్చు.
నానబెట్టి రోజూ తింటే..
అయితే.. ఓ నాలుగైదు బాదం పప్పులను నానబెట్టి రోజూ తింటే ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. ఒకవేళ మీకు పొట్టు ఇష్టం లేదనుకుంటే.. నానబెట్టిన బాదంను ఉదయం పొట్టు తీసి తినవచ్చు. అప్పుడు పోషకాలు మీ శరీరానికి విరివిగా అందుతాయి. పొట్టు తీసన బాదం మూడు, నాలుగు రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. నార్మల్‌గా తింటే బాదం రుచిగా ఉంటుంది కానీ పోషకాలు అంతగా అందవు.
బాదం తొక్కల్లో టానిన్‌లు..
బాదం తినడానికి ముందు నీటిలో నానబెట్టడం ఉత్తమ మార్గం. నానబెట్టి పొట్టు తీసి తినాలని చాలా పరిశోధనలు వెల్లడించాయి. బాదం గింజ పొట్టులో టానిన్లు ఉంటాయి. ఇవి పోషకాలను పూర్తిగా గ్రహించకుండా నిరోధిస్తాయి. అంతేకాకుండా జీర్ణం చేసుకోవడం కష్టం. అందుకే చాలా మంది బాదం పొట్టును తొలగించి తినడానికి ఇష్టపడతారు.
నానబెట్టిన బాదం వారంలో ఓ నాలుగు రోజులు తింటే గుండె సంబంధిత సమస్యల్ని దూరం చేస్తుంది. బాదం నానబెట్టి తింటే మీకు పీచు పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. బాదంలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింకు, ఫాస్పరస్, సోడియం ఖనిజ లవణాలు విరివిగా ఉన్నాయి.
బాదం పప్పులో విటమిన్-ఈ, ఒమెగా3 అమైనో ఆమ్లాలు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. మలబద్దకం సమస్యను బాదం దూరం చేస్తుంది.
ఇవి కూడా చదవండి: డుగ్గు డుగ్గు డ్యాన్స్‌తో అదరగొట్టిన టీఆర్‌ఆస్ ఎమ్మెల్యే.. ‘బుల్లెట్ బండి’ రాజయ్య స్టెప్పులు
Mysterious Fever: చిన్నారులను వెంటాడుతున్న మరో అంతుచిక్కని జ్వరం.. 48 గంటల్లో 50 మంది మృతి..