Red Bhindi: ఎర్ర బెండకాయలను పండిస్తున్న రైతు.. ఇవి ఆరోగ్యానికి ఆరోగ్యం.. లాభసాటి అంటున్న అన్నదాత
Red Ladyfingers Farming: కూరగాయల్లో బెండకాయది ఒక ప్రత్యేక స్థానం. ఈ బెండకాయను పిల్లలనుంచి పెద్దల వరకూ ఇష్టంగా తింటారు. ఇంకా చెప్పాలంటే బెండకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని..
Red Ladyfingers Farming: కూరగాయల్లో బెండకాయది ఒక ప్రత్యేక స్థానం. ఈ బెండకాయను పిల్లలనుంచి పెద్దల వరకూ ఇష్టంగా తింటారు. ఇంకా చెప్పాలంటే బెండకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని.. పిల్లలు బెండకాయను తింటే వారిలో జ్ఞాపక శక్తి పెరుగుతుందని.. పెద్దలకైతే కీళ్ల నొప్పుల నుంచి అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని నమ్మకం. ఇక బెండకాయతో అనేక రకాలైన వంటకాలు కూడా తయారు చేసుకుంటారు. అయితే మనం సర్వసాధారణంగా బెండకాయ రంగు ఏది అంటే ఆకుపచ్చ రంగు అంటాం.. కానీ బెండకాయ కూడా ఎరుపు రంగులో ఉంటాయని.. వాటిని పండిస్తున్న రైతులు లాభాలను ఆర్జిస్తున్నారని మీకు తెలుసా.. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఓ రైతు సేంద్రీయ పద్దతిలో ఎర్ర బెండకాయలను పండిస్తూ.. లాభాల బాట పట్టారు.. వివరాల్లోకి వెళ్తే..
భోపాల్ జిల్లాలోని ఖజూరి కలాన్ ప్రాంతానికి చెందిన రైతు శ్రీశ్రీలాల్ రాజ్‌పుత్ కు సేంద్రీయ వ్యవసాయం పై మక్కువ ఎక్కువ. ఈ నేపథ్యంలో ఇటీవల అతను తన పొలంలో ఎరుపు రంగులో ఉన్న బెండను సాగు చేశారు. ఈ బెండ చాలా అరుదైన రకమని.. ప్రస్తుతం ఈ బెండకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉందని.. దిగుబడి కూడా ఆశాజనకంగా వచ్చిందని చెబుతున్నాడు. తాను వారణాసిలోని ఒక వ్యవసాయ పరిశోధన సంస్థ నుండి ఒక కిలో ఎర్ర బెండ విత్తనాలను కొనుగోలు చేసి.. వాటిని జూలై మొదటి వారంలో విత్తుకున్నానని చెప్పారు. బెండమొక్కలు సుమారు 40 రోజుల్లో పెరగడం ప్రారంభమైం దని చెప్పారు. అంతేకాదు ఈ ఎర్ర లేడీ ఫింగర్ సాగు సమయంలో హానికరమైన పురుగుమందులు ఉపయోగించలేదని రాజ్‌పుత్ చెప్పారు.
ఈ బెండకాయ ఎక్కువగా చలి ప్రాంతాల్లో సాగు చేయడానికి అనుకూలమని .తెలిపారు. అంతేకాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ బెండకాయ ను దేశంలో చాలా అరుదుగా సాగు చేస్తున్నారని తెలిపారు.. ఇక రక్తహీనతకు ఈ బెండ బాగా ఉపయోగపడుతుంది. ఇక ఇందులో సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు
ఇది ఆకుపచ్చ బెండకాయ కంటే ఎక్కువ ప్రయోజనకరమైనది.. పోషకమైనది. రక్తహీనతకు ఈ బెండ బాగా ఉపయోగపడుతుంది గుండె , రక్తపోటు సమస్యలు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వ్యక్తులకు ఇది చాలా ప్రయోజనకరమని రాజ్ పుత్ చెప్పారు. ఎకరా భూమిలో ఎర్ర బెండ కనీసం 40-50 క్వింటాళ్లు దిగుమతినిఇస్తుందని.. గరిష్టంగా 70-80 క్వింటాళ్లు పండించవచ్చని రాజ్‌పుత్ చెప్పారు. ఇక ధర విషయానికి వస్తే.. బెండకాయ కంటే ఎర్ర బెండ 5 నుంచి 7 రేట్లు ఖరీదు ఎక్కువని తెలిపారు. ప్రస్తుతం ఎర్ర బెండకాయ కొన్ని మాల్స్‌లో 250 గ్రాముల, 500 గ్రాములకు రూ. 75-80 నుండి రూ. 300-400 వరకు అమ్ముతున్నారని తెలిపారు రాజ్ పుత్.
Also Read : వినాయక చవితి ఆంక్షలపై, జగన్ పాలనపై సంచలన కామెంట్స్ చేసిన చంద్రబాబు నాయుడు..