AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YCP Leader Warning: పనులు ఆపేస్తారా.. దాడులు చేయమంటారా.. కాంట్రాక్టర్‌కు అధికార పార్టీ నాయకుడి వార్నింగ్‌

రాయదుర్గం కనేకల్‌ రహదారి పనులు నిలిపివేయాలని హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరుడు హల్‌చల్‌ చేశాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

YCP Leader Warning: పనులు ఆపేస్తారా.. దాడులు చేయమంటారా.. కాంట్రాక్టర్‌కు అధికార పార్టీ నాయకుడి వార్నింగ్‌
Warning To Contractor
Sanjay Kasula
| Edited By: Janardhan Veluru|

Updated on: Sep 06, 2021 | 10:30 AM

Share

తమ నాయకుడు చెప్పిందే ఇక్కడ జరగాలి.. లేకుంటే లెక్క తేల్చేస్తాం.. ముఖ్యంగా ప్రభుత్వ పనుల టెండర్లు, ఇతర వ్యవహారాల్లో తాము చెప్పేందే జరగాలంటారు. ఇక ఎమ్మెల్యేలైతే నియోజకవర్గంలో ఎలాంటి వ్యవహారం ముందుకు సాగాలన్నా తమకు తెలియాల్సిందేనని పట్టుపడుతుంటారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల విషయంలోనూ ముందుగా కాంట్రాక్టర్ ఎమ్మెల్యేతో మాట్లాడాలి.. లేదంటే ఫసక్.. పనులు జరగవు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి రచ్చ కాంట్రాక్టర్ల పాలిట శాపంగా మారుతోంది. కొన్నిసార్లు అవి బెదిరింపుల వరకు వెళ్తున్నాయి.  అనంతపురం జిల్లాల్లో అధికార పార్టీ నాయకుడు కాంట్రాక్టర్ ను బెదిరించడం చర్చనీయాంశంగా మారింది. ఓ ఎమ్మెల్యే అనుచరుడు బరితెగించి మాట్లాడటంపై విమర్శలు వస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే… రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సన్నిహితుడు, అధికార పార్టీ నేత జయరామరెడ్డి కాంట్రాక్టర్ గుత్తేదారుపై బెదిరింపులకు దిగారు. రాయదుర్గం కనేకల్‌ రహదారి పనులు నిలిపివేయాలని హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరుడు హల్‌చల్‌ చేశాడు. కనేకల్‌ రోడ్డు పనులు నిలిపేయాలంటూ కాంట్రాక్టర్‌ను బెదిరించాడు జయరామిరెడ్డి. ఎమ్మెల్యేను కలవకుండా పనులు ఎలా చేస్తారంటూ ధూషించాడు. వెంటనే పనులు ఆపాలని..లేదంటే భౌతిక దాడులకు దిగుతామని హెచ్చరించాడు.  రాయదుర్గంలో అధికార పార్టీ నాయకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి: Cooking Oil: సామాన్యులకు శుభవార్త.. దిగిరానున్న వంట నూనె ధరలు.. ఎప్పటి నుంచి అంటే..!

డుగ్గు డుగ్గు డ్యాన్స్‌తో అదరగొట్టిన టీఆర్‌ఆస్‌ ఎమ్మెల్యే.. ‘బుల్లెట్‌ బండి’ రాజయ్య స్టెప్పులు