AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BoB: కలికిరి బ్యాంకును వీడుతున్న కిరికిరి.. సూత్రధారి అలీఖాన్ బొక్కింది రూ.103 కోట్లు

చిత్తూరు జిల్లా కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడా లో తవ్వేకొద్దీ.. బ్యాంకులోని అక్రమార్కుడి లెక్క ఒక్కొక్కటిగా బయట పడుతోంది. స్వయం సహాయక సంఘాలే టార్గెట్ గా మెసెంజర్ అలీఖాన్ ఖాతాలు..

BoB: కలికిరి బ్యాంకును వీడుతున్న కిరికిరి.. సూత్రధారి అలీఖాన్ బొక్కింది రూ.103 కోట్లు
Bank Of Baroda Kalikiri
Sanjay Kasula
|

Updated on: Sep 06, 2021 | 9:26 AM

Share

చిత్తూరు జిల్లా కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడా లో తవ్వేకొద్దీ.. బ్యాంకులోని అక్రమార్కుడి లెక్క ఒక్కొక్కటిగా బయట పడుతోంది. స్వయం సహాయక సంఘాలే టార్గెట్ గా మెసెంజర్ అలీఖాన్ ఖాతాలు ఖాళీ చేసినట్లు తేలింది. ఇప్పటి వరకూ సుమారు 1.80 కోట్ల రూపాయలు స్వాహా అయినట్టు తేలగా.. బ్యాంకుకు సంబంధించిన ఇతర లావాదేవీలన్నింటినీ పరిశీలిస్తున్నారు విచారణ బృందం అధికారులు. మెసెంజర్ అలీ ఖాన్ నోటి వెంట ఒక్కో నిజాలను వెళ్లగక్కిస్తున్నారు. దీంతో ఇన్నాళ్ల పాటు బ్యాంకులో జరిగిన అవకతవకలు ఒకదాని వెంట మరొకటిగా వెలుగులోకి వస్తున్నాయి.

కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడా- కాస్తా మెసెంజర్ చేతివాటంతో కిరికిరి బ్యాంకుగా మారిన పేరు సాధించింది. బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము స్వాహా విషయంపై విచారణ చేసిన అధికారులు విస్తుపోయే నిజాలను వెలికి తీస్తున్నారు. ఒక్కో విషయం బయట పడ్డంతో అధికారులకు మైండ్ బ్లాంక్ అవుతోంది. బ్యాంకులో మెసెంజర్‌గా చేస్తున్న అలీ ఖాన్ అక్కడి సిబ్బంది సహకారంతోనే ఈ వ్యవహారం నడిపినట్టు తెలుస్తోంది.

తిరుపతి రీజినల్ మేనేజర్ నేతృత్వంలో 10 మంది తో కూడిన బృందం బ్యాంకులో ఎంక్వయిరీ చేస్తోంది. మొత్తం 103 కోట్ల రూపాయల లావాదేవీల్లో.. ఎస్ హెచ్ జీ గ్రూప్ కు చెందిన డబ్బు ఎక్కువగా దారి తప్పినట్టు గుర్తించారు. మహిళా సంఘాల పేరిట నకిలీ పత్రాలతో రుణాలు తీసుకున్నారనీ.. ఈ సొమ్మును బ్యాంకులో పని చేసే ఉద్యోగులందరికీ వాటాలు పంచానని అలీ ఖాన్ అనడంతో ఒక్కొక్కరికీ గుండెలదురుతున్నాయి.

బ్యాంకు స్టేట్ మెంట్లను ఎడిట్ చేసి స్వయం సహాయక సంఘాలకు అనుమానం రాకుండా తాను ప్రయత్నించాననీ చెప్పుకొచ్చాడు అలీఖాన్. ఇప్పటి వరకూ కోటీ 78 లక్షల రూపాయల నుంచి తాను ఎస్ హెచ్ జీ ఖాతాల నుంచి సొమ్ము కాజేసినట్టు ఒప్పుకున్నాడు.

ఈ డబ్బుతో తన అక్కచెల్లెళ్లకు ఘనంగా పెళ్లి చేయడం మాత్రమే కాదు.. కలికిరిలో ఇల్లు కూడా కట్టుకున్నాననీ.. మిగిలిన డబ్బుతో జల్సా చేశానని అలీ ఖాన్ చెప్పడంతో.. విస్తుపోయారు అధికారులు. గత వారం నుంచి.. బ్యాంక్ ఆఫ్ బరోడా స్కామ్ లో విచారణ జరుగుతుండగా.. ఈ బ్యాంకులో ఖాతాలున్నవారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా డబ్బు క్షేమమేనా? తిరిగి మా ఖాతాల్లోకి వచ్చి చేరేనా? అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సేవింగ్ ఖాతాలు, పంట రుణాల ఖాతాల లెక్కల్లో తేడాలపై అగమ్యగోచరంగా ఉంది. గత ఐదేళ్లుగా బ్యాంకు లావాదేవీలు అడ్డ దిడ్డంగా సాగినట్టు గుర్తించారు అధికారులు. దీంతో విచారణ ఎక్కడి నుంచి ఎలా మొదలు పెట్టారో తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: Cooking Oil: సామాన్యులకు శుభవార్త.. దిగిరానున్న వంట నూనె ధరలు.. ఎప్పటి నుంచి అంటే..!

డుగ్గు డుగ్గు డ్యాన్స్‌తో అదరగొట్టిన టీఆర్‌ఆస్‌ ఎమ్మెల్యే.. ‘బుల్లెట్‌ బండి’ రాజయ్య స్టెప్పులు

Follow Us