డుగ్గు డుగ్గు డ్యాన్స్‌తో అదరగొట్టిన టీఆర్‌ఆస్‌ ఎమ్మెల్యే.. ‘బుల్లెట్‌ బండి’ రాజయ్య స్టెప్పులు

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Sep 06, 2021 | 7:54 AM

బుల్లెట్టు బండి పాట పెట్టుకుని డుగ్గు డుగ్గుమంటూ ఆడాల్సిందే. ఈ పాటకు ఇప్పటి వరకు వాళ్లు వీళ్లు.. డ్యాన్స్ చేస్తే చూశాం. మరి మాజీ డిప్యూటీ సీఎం చేస్తే ఎట్టా ఉంటాదో తెలుసా.. ఇదిగో ఇట్టాగే ఉంటాది.  చిన్నారులతో కలిసి...

డుగ్గు డుగ్గు డ్యాన్స్‌తో అదరగొట్టిన టీఆర్‌ఆస్‌ ఎమ్మెల్యే..  ‘బుల్లెట్‌ బండి’ రాజయ్య స్టెప్పులు
Mla Rajaiah Dance

Follow us on

ఒక్క పాట.. ఒకే ఒక్క పాట దునియాలో దూసుకెళ్తోంది. రయ్ రయ్ మంటూ.. ఇంటర్నెట్ వీధుల్లో చక్కర్లు కొడుతోంది. మీసం మొలవని పిల్లాడి దగ్గరి నుంచి తలపండిన ముసలాడి వరకు అందరినీ.. కాలు కదిపేలా చేస్తోంది. ఉల్లాసాన్ని ఇస్తోంది. ఉత్సాహాన్ని నింపుతోంది.  అది ఏ పాట అనేది.. ఈ పాటికే అర్ధం అయ్యి ఉంటుంది. బుల్లెట్.. బుల్లెట్.. బండెక్కి వచ్చేత్తపా.. వచ్చేత్తపా.. ఇదే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్.. వైరల్ సాంగ్. పెళ్లి బరాత్ లో అయినా.. ఆస్పత్రిలో అయినా.. ఇంకే ఈవెంట్ అయినా.. బుల్లెట్ సాంగ్ పడాల్సిందే. స్టెప్పులతో ఊగిపోవాల్సిందే..

ఎక్కడ విన్నా ఈ పాటే వినిపిస్తోంది. పెళ్లి బరాత్‌లో నవ వధువు సాయిశ్రీయ చేసిన డ్యాన్స్ తో సోషల్ మీడియాలో వైరలైన బుల్లెట్టు బండి సాంగ్ మారుమోగిపోతోంది. ప్రతి ఒక్కరూ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తవా… అంటూ ఆడి పాడుకుంటున్నారు. ఫంక్షన్ ఏదైనా, సందర్భంగా ఏదైనా… సరదా కోసమైనా, రిలీఫ్ కోసమైనా.. బుల్లెట్టు బండి పాట పెట్టుకుని డుగ్గు డుగ్గుమంటూ ఆడాల్సిందే.

ఈ పాటకు ఇప్పటి వరకు వాళ్లు వీళ్లు.. డ్యాన్స్ చేస్తే చూశాం. మరి మాజీ డిప్యూటీ సీఎం చేస్తే ఎట్టా ఉంటాదో తెలుసా.. ఇదిగో ఇట్టాగే ఉంటాది.  చిన్నారులతో కలిసి… స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్టెప్పులేశారు. దుమ్ములేపారు.. అదరగొట్టారు. చిలుపూర్ మండలంలోని పల్లగుట్ట గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కోసం వెళ్లిన ఎమ్మెల్యే.. అక్కడ పిల్లలతో కాలు కదిపారు. రాజయ్య వేస్తున్న స్టెప్పులతో చిన్నారులు కూడా మరింత జోష్‌తో స్టెప్పులేశారు.

ఇదిలావుంటే.. అంతకుముందు ఓ పెళ్లి వేడుకలో ఎంపీ మాలోతు కవిత చేసిన కూడా స్టెప్పులు వేశారు. అందరినీ ఉత్సాహ పరిచారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కవిత దోస్తులు, నేతలు కూడా డ్యాన్స్ చేశారు.

ఇక పక్షవాతంతో శరీరం మొత్తం చచ్చుబడి ఆస్పత్రి బెడ్ పై కదల్లేకుండా పడివున్న రోగిలో చలనం తెచ్చేందుకు ఓ నర్సు ప్రయత్నించింది. అందుకామె చేసిన ట్రీట్‌మెంట్‌ బుల్లెట్‌ సాంగ్. ఫిజియోథెరపీగా ఈ బుల్లెట్‌ బండి సాంగ్‌ వినిపించింది. సాంగ్ బీట్ తో… రోగి కూడా ఉత్సాహంగా స్పందించాడు. కాళ్లు చేతులు కదిలించే ప్రయత్నం చేశాడు.

పని ఒత్తిడిలో రిలీఫ్ కోసం కూడా బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తవా అంటూ ఆడిపాడుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పీహెచ్ సీలో బుల్లెట్టు బండి పాటకు నర్సు ఆడిపాడింది. తనను తాను మైమరిపోయి బుల్లెట్టు పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఈ వీడియో కూడా తెగ వైరలైంది.

ఇవి కూడా చదవండి: Cooking Oil: సామాన్యులకు శుభవార్త.. దిగిరానున్న వంట నూనె ధరలు.. ఎప్పటి నుంచి అంటే..!

తగ్గేదేలే అంటే తాట తీస్తాం.. రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్‌..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu