Titanic Ship Memories: టైటానిక్ షిప్ ప్రమాదం గురించి, తెలియని వాళ్లు అంటూ ఎవరూ ఉండరు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేయడానికి ఈ షిప్‌ను తయారు చేశారు. అప్పట్లో ఇది భారీ షిప్‌గా పేరు తెచ్చుకుంది. అయితే 1912 నవంబర్ 14న సముద్రంలో ప్రయాణిస్తున్న టైటానికి మార్గమధ్యంలో ఐస్‌బర్గ్‌ను ఢీకొని, సముద్రంలో పూర్తిగా మునిగిపోయింది. ఈ ఘటన తర్వాత హాలీవుడ్‌లో టైటానిక్ పేరుతోనే ఫేమస్ ప్రేమ కథా చిత్రం కూడా తెరకెక్కింది. అయితే సముద్ర అడుగున్న ఈ షిప్.. మరికొన్ని ఏళ్లే కనిపించనుంది.
109 ఏళ్లు దాటినా ఆ ఓడ అవశేషాలు నేటికీ నీళ్లల్లో పదిలంగానే ఉన్నాయి. అయితే మరికొన్ని ఏళ్లల్లో అవి కనిపించవని పరిశోధకులు పేర్కొంటున్నారు. వినడానికి వింతగా ఉన్నా.. ఇదే నిజమని పేర్కొంటున్నారు. ఒకరకమైన బ్యాక్టీరియా టైటానిక్ అవశేషాలను వేగంగా తినేస్తోందని, మరో 12ఏళ్లల్లో టైటానిక్ అని చెప్పుకోవడానికి నీళ్లల్లో ఒక్క ముక్క కూడా మిగలదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
Sinking Of The Titanic
అయితే ఇన్ని సంవత్సరాలు సముద్ర గర్భంలో ఉన్న ఈ షిప్‌కు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే టైటానిక్‌కి సంబంధించిన లోహ భాగాలను దెబ్బతింటున్నాయని చెబుతున్నారు. ఇలాగే ఉంటే మరో 12ఏళ్లలో టైటానిక్ ఆనవాళ్లు కనుమరుగవుతాయని అంటున్నారు.
కాగా.. ఇప్పటివరకూ ‘ఆర్‌ఎంఎస్ టైటానిక్ సంస్థ’ ఈ భారీ షిప్ పై పలు పరిశోధనలు చేపట్టి.. దాదాపు 5 వేలకు పైగా.. వెండి పాత్రలు, బంగారు నాణాలు వంటివెన్నో శిథిలాల నుంచి బయటకు తీసింది. అప్పట్లో జరిగిన ఈ దుర్ఘటనలో వందలాది మంది మరణించగా.. దాదాపు ఏడు వందల మంది ప్రాణాలతో బయటపడ్డారు.
Also Read: