AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bone Health: ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆకుకూర, పండ్లు తినండి చాలు..

Bone Health Foods: శరీరం నిర్మాణంలో ఎముకలు ప్రధానపాత్ర వహిస్తాయి. మనం నిలబడాలన్న, ఎలాంటి పనులు చేయాలన్నా.. శరీరం సహకరించాలన్న ఎముకలదే కీలక పాత్ర. అయితే..

Bone Health: ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆకుకూర, పండ్లు తినండి చాలు..
Bone Health Food
Shaik Madar Saheb
|

Updated on: Sep 05, 2021 | 4:25 PM

Share

Bone Health Foods: శరీరం నిర్మాణంలో ఎముకలు ప్రధానపాత్ర వహిస్తాయి. మనం నిలబడాలన్న, ఎలాంటి పనులు చేయాలన్నా.. శరీరం సహకరించాలన్న ఎముకలదే కీలక పాత్ర. అయితే.. ఎముకలు బలహీనంగా ఉంటే మన పని మనం చేసుకోవడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. మనిషిలో దాదాపు ముప్పై ఏళ్ల వరకు ఎముకుల అభివృద్ధి జరుగుతుంది. ఆ తర్వాత వాటిలో స్ధిరత్వం ఏర్పడుతుంది. వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనంగా మారుతుంటాయి. సరైన పోషకాహారం తీసుకుంటూ తగిన జాగ్రత్తలు పాటిస్తే ఎముకలను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. వయస్సు పెరుగుతున్న కొద్ద ఎముకల రోగాలు రాకుండా ఉండాలంటే.. కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎముకలకు అవసరమైన ఆహారాన్ని తీసుకోవటం ద్వారా కీళ్లు, మోకాళ్లు, ఎముకల నొప్పులకు కళ్లేం వేయవచ్చని పేర్కొంటున్నారు. అందుకే ఎముకల్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మంచి ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. అయితే.. ఎముకలు ధృఢంగా, బలంగా ఉండాలంటే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. ముఖ్యంగా ఆహారంలో కాల్షియం, విటమిన్ డి ఉండేటట్లు చూసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పోషకాలు అత్యధికంగా పండ్లు, కూరగాయల్లో ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే.. వీటిని వయస్సుతో సంబంధం లేకుండా రోజూ ఆహారంలో తీసుకుంటే మంచిదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఆ పండ్లు, కూరగాయలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పాలకూర.. పాలకూరలో కాల్షియం అధికంగా ఉంటుంది. దీనివల్ల ఎముకలు, దంతాల అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఒక కప్పు పాలకూర రోజూ శరీరానికి అవసరమయ్యే కాల్షియంలో దాదాపు 25 శాతాన్ని అందిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆకులలో విటమిన్ ఎ, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.

నారింజ నారింజ పండులో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. దీనిద్వారా ఎముకలు ధృఢంగా బలంగా మారుతాయి. ఆరెంజ్ జ్యూస్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బోలు ఎముకల వ్యాధిని నియంత్రించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

అరటిపండు అరటి పండు శరీరంలో జీర్ణక్రియ మెరుగుపడేందుకు సాయపడుతుంది. మెగ్నీషియం అత్యధికంగా ఉండటం వల్ల ఎముకలు, దంతాల నిర్మాణంలో అరటి కీలక పాత్ర పోషిస్తుంది. కావున అరటిపండు ఎముకలను బలంగా మార్చి.. వ్యాధులను నియంత్రిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

పైనాపిల్ పైనాపిల్ శరీరానికి నేరుగా విటమిన్ డి, కాల్షియం అందించదు కానీ ఎముకలు బలంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పైనాపిల్ పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కావున శరీరంలో యాసిడ్ భారాన్ని తటస్తం చేసి.. కాల్షియం నష్టాన్ని నివారిస్తుంది.

స్ట్రాబెర్రీలు స్ట్రాబెర్రీల్లో కాల్షియం, మాంగనీస్, పొటాషియం, విటమిన్ కె, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకల బలమైన నిర్మాణానికి సహాయపడతాయి.

బొప్పాయి బొప్పాయి పండులో పెద్ద మొత్తంలో కాల్షియం ఉంటుంది. 100 గ్రాముల బొప్పాయిలో 20 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుందని అంటారు. ఈ పండును రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఎముకలు బలంగా మారుతాయి.

కివి పండు కివి పండు అత్యధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది. ఈ పండు ఎముకలను, దంతాలను బలంగా మార్చడంలో సాయపడుతుంది. దీంతోపాటు కివి బోలు ఎముకల వ్యాధిని నివారించేందుకు కృషి చేస్తుంది.

Also Read:

Electrolyte Water: నీరసంగా ఉందా.. శరీరానికి తక్షణ శక్తినిచ్చే డ్రింక్.. ఎల‌క్ట్రోలైట్ వాటర్.. ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలంటే

ప్రెషర్ కుక్కర్‏లో అన్నం వండుతున్నారా ? అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాల్సిందే..