Electrolyte Water: నీరసంగా ఉందా.. శరీరానికి తక్షణ శక్తినిచ్చే డ్రింక్.. ఎల‌క్ట్రోలైట్ వాటర్.. ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలంటే

Electrolyte Water: శరీరానికి తగినంత నీరు మన అందించక పొతే.. ద్రవాల సమతుల్యం దెబ్బతింటుంది. అప్పుడు శరీరం వేడి ఎక్కినట్లు అనిపించడమే కాదు.. నీరసంగా కూడా అనిపిస్తుంది..

Electrolyte Water: నీరసంగా ఉందా.. శరీరానికి తక్షణ శక్తినిచ్చే డ్రింక్.. ఎల‌క్ట్రోలైట్ వాటర్.. ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలంటే
Electrolyte Water
Follow us
Surya Kala

|

Updated on: Sep 05, 2021 | 1:54 PM

Electrolyte Water: శరీరానికి తగినంత నీరు మన అందించక పొతే.. ద్రవాల సమతుల్యం దెబ్బతింటుంది. అప్పుడు శరీరం వేడి ఎక్కినట్లు అనిపించడమే కాదు.. నీరసంగా కూడా అనిపిస్తుంది. అప్పుడు వెంటనే తక్షణ శక్తి కోసం ఎల‌క్ట్రోలైట్స్ డ్రింక్ ను తాగుతారు. ముఖ్యంగా వ్యాయామం  ఎక్కువగా చేసేవారు,  క్రీడాకారులు ఎక్కువ‌గా ఈ డ్రింక్ ను తాగుతారు.  ఈ డ్రింక్ చెమట వలన కోల్పోయిన ఎల‌క్ట్రోలైట్స్‌ను భ‌ర్తీ చేస్తుంది. అంతేకాదు కండ‌రాలు, క‌ణాల‌కు కావ‌ల్సిన శ‌క్తిని అందేలా  చేస్తుంది. అందుకనే శరీరం అలసినా డీ హైడ్రేషన్ బారిన పడినట్లు అనిపించినా ఎక్కువగా  ఎల‌క్ట్రోలైట్స్ డ్రింక్  తాగుతారు.

అయితే ఈ ఎల‌క్ట్రోలైట్స్ అంటే ఏమిటి ? దీనితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి..? ఎల‌క్ట్రోలైట్ వాట‌ర్‌ను ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవచ్చు తదితర వివరాలను గురించి తెలుసుకుందాం..

మన శ‌రీరానికి నిత్యం పోష‌కాలు అవ‌స‌రం. వాటిల్లో ఒకరి మినిరల్స్ . వీటినే ఎల‌క్ట్రోలైట్స్ అని కూడా అంటారు. ఇవి మన శరీరానికి తినే ఆహారం, తాగే ద్రవ పదార్ధాల ద్వారా అందుతాయి.  ఎల‌క్ట్రోలైట్స్ సరిగా ఉంటేనే శరీరం తన విధులు స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తుంది. అయితే పొటాషియం, కాల్షియం, మెగ్నిషియం త‌దిత‌ర మిన‌ర‌ల్స్ ను ఎల‌క్ట్రోలైట్స్ గా వ్య‌వ‌హ‌రిస్తారు.

 ఎల‌క్ట్రోలైట్ వాటర్ ను ఇంట్లోనే తయారికి కావాల్సిన పదార్ధాలు: 

నీరు

ఉప్పు

నిమ్మరసం

కొబ్బరి నీరు

తయారీ విధానం: 

ముందుగా పావు లీటర్ నీటిని తీసుకుని అందులో పావు టీ స్పూన్ ఉప్పు, పావు కప్పు నిమ్మరసం, ఒకటిన్నర కప్పుల కొబ్బరి నీరు వేసి బాగా కలపాలి. వీటన్నిటిని కలిపినా తర్వాత ఒక బాటిల్ లో నిల్వ చేసుకోవాలి. శరీరానికి ఎప్పుడైనా సత్తువ లేదు.. నీరసంగా ఉంది అనుకున్న సమయంలో ఈ నీరుని తాగితే తక్షణ శక్తినిస్తుంది.

ఎల‌క్ట్రోలైట్స్ శరీరంలో నిర్వహించే విధులు: 

*క‌ణాల నుంచి వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. పోషకాలను అందించడానికి సహాయపడతాయి. శ‌రీరంలో ద్ర‌వాల‌ను స‌మ‌తుల్యంలో ఉంచుతాయి. శరీరంలోని పీహెచ్ స్థాయిల‌ను నియంత్రిస్తాయి. నాడులు, కండ‌రాలు, గుండె, మెద‌డు ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. దెబ్బ తిన్న క‌ణ‌జాలాల‌కు మ‌ర‌మ్మ‌త్తులు చేస్తాయి.

Also Read: వినాయక చవితిలో పూజకు ఉపయోగించే 21 రకాల పత్రి .. దానిలోని ఔషధ గుణాలు ఏమిటంటే..