ప్రెషర్ కుక్కర్‏లో అన్నం వండుతున్నారా ? అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాల్సిందే..

ప్రస్తుతం వంటశాలలో ఎలక్ట్రిక్ వస్తువుల ఉపయోగించడం విపరీతంగా పెరిగిపోయింది. ఇండక్షన్ స్టవ్, ఎలక్టిక్ కుక్కర్ ఇలా అనేక వస్తువులను

ప్రెషర్ కుక్కర్‏లో అన్నం వండుతున్నారా ? అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాల్సిందే..
Pressure Cooker

ప్రస్తుతం వంటశాలలో ఎలక్ట్రిక్ వస్తువుల ఉపయోగించడం విపరీతంగా పెరిగిపోయింది. ఇండక్షన్ స్టవ్, ఎలక్టిక్ కుక్కర్ ఇలా అనేక వస్తువులను వాడేస్తున్నారు. అయితే వీటికంటే ముందు నుంచి ప్రెషర్ కుక్కర్ వినియోగం ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఈ ప్రెషర్ కుక్కర్లు ఉంటున్నాయి. అయితే వీటిని కొందరు కేవలం కర్రీ చేయడానికి ఉపయోగిస్తుంటే.. మరికొందరు అందులో అన్నం కూడా వండేస్తుంటారు. మీరు కూడా ప్రెషర్ కుక్కర్లో అన్నం వండుతున్నారా ? అయితే మీరు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే.

1. ప్రెషర్ కుక్కర్లో అన్నం వండితే అది.. పిండిని ఎక్కువగా నిలుపుకుంటుంది. దీంతో కడుపు ఎక్కువ సమయం నిండుగా ఉంటుంది. దీంతో చాలా సమయం వరకు ఆకలి వేయదు. ఈ కారణంతో ఆకలి తక్కువగా వేస్తుంది.
2. ప్రెజర్ కుక్కర్‌లో అన్నం వండినప్పుడు.. బియ్యం ఎక్కువగా ఉడికిపోతాయి. దీంతో జీర్ణ ప్రక్రియ సజావుగా సాగుతుంది. జీర్ణ వ్యవస్థపై పనిభారం తక్కువగా ఉంటుంది.
3. అన్నం వండడానికి ప్రెజర్ కుక్కర్ లేదా రైస్ కుక్కర్ ఉపయోగిస్తే అందులో ఉండే పోషకాలు అన్నంలోనే ఉండిపోతాయి. అన్నం ఉడకబెట్టినప్పుడు అలాగే అందులోని నీటిని పడేసినప్పుడు.. అందులోని పోషకాలు బయటకు వచ్చేస్తాయి.
4. అధిక వేడి, అధిక పీడనంతో ప్రెజర్ కుక్కర్‌లో అన్నం వండినప్పుడు అందులో ఎలాంటి బ్యాక్టీరియా ఉండకుండా.. పూర్తిగా తొలగిపోతుంది.
5. ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వండినప్పుడు వేగంగా మీ పని పూర్తవుతుంది. అలాగే గ్యాస్ వృధా కాదు. ఇలా మీ సమయం, శక్తి రెండూ ఆదా అవుతాయి.

Also Read: Viral Video: కొండచిలువకు ఎదురెళ్లిన పులి.. చివరికి గెలిచింది ఎవరంటే.. వైరల్ వీడియో!

Vinayaka Chavithi: మనదేశంలోనే కాదు.. ప్రపంచంలో ఏయే దేశాల్లో గణేషుడి విగ్రహాలు ఏయే రూపాల్లో ఉన్నాయి.. ఎలా పూజిస్తారంటే

Trisha: హీరోయిన్ త్రిషను వెంటనే అరెస్ట్ చేయాలి.. భగ్గుమన్న హిందూ సంఘాలు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Bigg Boss 5 Telugu: తనని తాను మార్చుకున్న ప్రియాంకా సింగ్‌కు బిగ్ బాస్ ఓ గోల్డెన్ ఛాన్స్

Click on your DTH Provider to Add TV9 Telugu