Trisha: హీరోయిన్ త్రిషను వెంటనే అరెస్ట్ చేయాలి.. భగ్గుమన్న హిందూ సంఘాలు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

త్రిష.. ఒకప్పుడు తెలుగు సీని పరిశ్రమలో టాప్ హీరోయిన్. దాదాపు దశాబ్దకాలం పాటు స్టార్ హీరోయిన్ రేసులో కొనసాగింది ఈ ముద్దుగుమ్మ.

Trisha: హీరోయిన్ త్రిషను వెంటనే అరెస్ట్ చేయాలి.. భగ్గుమన్న హిందూ సంఘాలు.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Trishaa
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 05, 2021 | 11:55 AM

త్రిష.. ఒకప్పుడు తెలుగు సీని పరిశ్రమలో టాప్ హీరోయిన్. దాదాపు దశాబ్దకాలం పాటు స్టార్ హీరోయిన్ రేసులో కొనసాగింది ఈ ముద్దుగుమ్మ. చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నటించి చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది ఈ అమ్మడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన త్రిష..అనుకోకుండా తెలుగులో స్లో అయ్యింది. చాలా కాలం నుంచి త్రిష సరైన హిట్ అందుకోలేదు. అయినా ఏమాత్రం నిరాశ చెందకుండా.. తనకు వచ్చిన ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. సక్సెస్ కోసం ట్రై చేస్తుంది త్రిష. ఇక ఈ మధ్యకాలంలో త్రిష ఎక్కువగా ఏదో ఒక విషయంలో నిత్యం వార్తలలో నిలుస్తున్నారు. ఇటీవల త్రిష పెళ్ళి గురించి నెట్టింట్లో వరుస కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో టాక్ నడిచింది. అయితే అవన్నీ రూమర్లే అంటూ కొట్టిపడేసింది త్రిష. అయితే ఈ అమ్మడు ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలంటూ హిందూ సంఘాలు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా.

ప్రస్తుతం త్రిష్.. సస్సెషనల్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటిస్తోంది. ఇందులో త్రిషతోపాటు.. విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తి, జయరామ్, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమాపై మొదటి నుంచి ఏదో ఒక వివాదం చెలరేగుతూ వస్తుంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ సమయంలో గుర్రం చనిపోయిందని.. దానిని గుట్టుగా పూడ్చిపెట్టారని పెటా సంస్థ డైరెక్టర్ మణిరత్నం పై కేసు పెట్టిన సంగతి తెలిసిందే.

1

ప్రస్తుతం ఇందులో నటిస్తున్న త్రిషను వెంటనే అరెస్ట్ చేయాలంటున్నారు హిందూ సంఘాలు. ఇందుకు కారణం కూడా లేకపోలేదుు. ప్రస్తుతం ఈ సినిమా ఇండోర్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో భాగంగా త్రిష కారు దిగి చెప్పులతో శివుడు, నంది విగ్రహాల మధ్య నడుచుకుంటూ వచ్చిన సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ మనోభావాలు దెబ్బ తీసినందుకు త్రిష పై కేసు నమోదు చేసి.. ఆమెను అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Trisha 2

Also Read: Bigg Boss 5 Telugu: షూరు కానున్న సందడి.. బిగ్‏బాస్ 5కు సర్వం సిద్ధం.. ఏ పాటకు ఎవరు డ్యాన్స్ చేసారో తెలుసా..

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు